తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్‌న్యూస్.. ఆ రోజు వేతనంతో కూడిన సెలవు

తెలంగాణ పార్లమెంట్ ఎన్నికలు తుది అంకానికి చేరుకున్నాయి. ఇవాళ నామినేషన్లకు చివరి రోజు.. ఇప్పటికే అన్ని ప్రధాన పార్టీలకు చెందిన అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేయగా.. మిగిలిన వారు ఇవాళ రిటర్నింగ్ అధికారులకు నామినేషన్ పత్రాలు అందిచనున్నారు. మధ్యాహ్నం 3 గంటలలోపు నామినేషన్ దాఖలుకు అవకాశం ఉండగా.. ఆ మేరకు అభ్యర్థులు సిద్ధమవుతున్నారు.

ఇక తెలంగాణలో మే 13న పోలింగ్ జరగనుంది. 17 లోక్‌సభ స్థానాలతో పాటు సికింద్రాబాద్ కంటోన్మెంట్ అసెంబ్లీ స్థానానికి బైపోల్ జరగనుంది. ఈ మేరకు ఎన్నికల అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. పోలింగ్ కేంద్రాలు, ఓటరు జాబితా, పోల్ చిటీలు తదితర ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు. కాగా, పోలింగ్ సందర్భంగా ప్రభుత్వ ఉద్యోగులకు ఎన్నికల సంఘం గుడ్‌న్యూస్ చెప్పింది.

లోక్‌సభ ఎన్నికల పోలింగ్‌ జరిగే రోజును వేతనంతో కూడిన సెలవుగా ప్రకటించారు. కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాలతో ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసినట్లు తెలంగాణ రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి వికాస్‌రాజ్‌ వెల్లడించారు. తెలంగాణ రాష్ట్రంలో పనిచేస్తూ ఛత్తీస్‌గఢ్‌, మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాల్లోని తమ సొంత ప్రాంతాల్లో ఓటు హక్కు వినియోగించుకునేందుకు ఆయా ప్రాంతాలకు వెళ్లే వారికి కూడా వేతనంతో కూడిన సెలవు ఇవ్వాల్సిందేనని అందులో స్పష్టం చేశారు. ఈసీ నిర్ణయం పట్ల ఉద్యోగులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

ఇటువంటి మరిన్ని వార్తలు సమయం తెలుగులో చదవండి. లేటెస్ట్ వార్తలు, సిటీ వార్తలు, జాతీయ వార్తలు, బిజినెస్ వార్తలు, క్రీడా వార్తలు, రాశిఫలాలు ఇంకా లైఫ్‌స్టైల్ అప్‌డేట్లు మొదలగునవి తెలుసుకోండి. వీడియోలను TimesXP లో చూడండి.

2024-04-25T02:22:47Z dg43tfdfdgfd