TELANGANA NEWS: రైతులకు శుభవార్త.. అందుకు ఈసీ గ్రీన్ సిగ్నల్.. అకౌంట్లలో డబ్బులు పడేది అప్పుడే..!

తెలంగాణలో ఓవైపు లోక్ సభ ఎన్నికల హడావుడి నడుస్తుండగానే.. మరోవైపు రైతులకు శుభవార్త వినిపించింది రేవంత్ రెడ్డి ప్రభుత్వం. అన్నదాతలు ఆరుగాలం శ్రమించి సాగు చేసిన పంటలు ఇటీవల కురిసిన అకాల వర్షాలు, వడగండ్ల ధాటికి నేలపాలు కాగా.. రైతన్నకు జరిగిన నష్టానికి ప్రభుత్వం పరిహారం ఇచ్చి ఆదుకుంటామని ఇప్పటికే భరోసానిచ్చింది. ఈమేరకు మార్చి 16 నుంచి 24 వరకు దాదాపు 10 జిల్లాల్లో 15,814 ఎకరాల్లో వివిధ పంటలు నష్టపోయినట్లుగా అధికారులు ఓ నివేదికను కూడా రూపొందించారు. రిపోర్టు ప్రకారం మొత్తం రూ.15.81 కోట్లను రైతులకు పంట నష్ట పరిహారంగా చెల్లించాల్సి ఉంటుందని ఆర్థిక శాఖ ఫండ్ రిలీజ్‌కు సిద్ధమైంది.

అయితే.. ఈ లోపే రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికల కోడ్ అమల్లోకి రావడంతో పరిహారం పంపిణీకి తాత్కలికంగా బ్రేక్ పడింది. అసలే సాగునీరు లేక కరువు తాండవిస్తుండటంతో రైతన్నను ఆదుకునేందుకు సర్కారు ప్రత్యేక చొరవ తీసుకుంది. రైతులకు పంట నష్ట పరిహారం విడుదలకు ప్రభుత్వం అనమతి కోరగా.. ఎన్నికల సంఘం అందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీంతో.. రైతులకు పంట నష్ట పరిహారాన్ని సర్కారు విడుదల చేయనుంది. ఈ మేరకు రైతుల ఖాతాల్లో సోమవారం లేదా మంగళవారం పరిహం పైసలు జమ కానున్నాయి.

ఇటువంటి మరిన్ని వార్తలు సమయం తెలుగులో చదవండి. లేటెస్ట్ వార్తలు, సిటీ వార్తలు, జాతీయ వార్తలు, బిజినెస్ వార్తలు, క్రీడా వార్తలు, రాశిఫలాలు ఇంకా లైఫ్‌స్టైల్ అప్‌డేట్లు మొదలగునవి తెలుసుకోండి. వీడియోలను TimesXP లో చూడండి.

2024-05-05T17:48:56Z dg43tfdfdgfd