TELANGANA SCHEMES: వారికి మాత్రమే రైతు భరోసా.. మంత్రి తుమ్మల కీలక అప్డేట్

గత ప్రభుత్వం రైతుబంధు పేరిట పంట పెట్టుబడి సాయం అందించగా.. ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం రైతుభరోసా పేరిట ఈ పథకాన్ని అమలు చేయనుంది. ఏడాదికి ఎకరానికి రూ. 15 వేల చొప్పున పంట పెట్టుబడి సాయం అందించేందుకు సిద్ధమైంది. అయితే గతంలో రైతుబంధులు పరిమితి అంటూ లేదు. ఎన్నిఎకరాలైనా.. ఎలాంటి భూములకైనా రైతుబంధు పరిహారం అందించారు. కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం ఈ పథకం అమలుపై కీలక నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది. అందులో భాగంగా వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు కీలక అప్డేట్ ఇచ్చారు.

తెలంగాణలోని అర్హులైన రైతులకే రైతుభరోసా ఇచ్చే అంశాన్ని పరిశీలిస్తున్నట్లు ఆయన వెల్లడించారు. యాసంగి సీజన్‌కు సంబంధించిన రైతుభరోసా నగదును రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిందన్నారు. గత ప్రభుత్వంలో బంజరు భూములకు, విదేశాల్లో ఉన్నవారికి రూ.లక్షల నగదు జమ చేయడం జరిగిందని వెల్లడంచారు. కాంగ్రెస్‌ ప్రభుత్వంలో మాత్రం నిజమైన రైతులకు, పంట పండే వ్యవసాయ భూములకే రైతుభరోసా ఇచ్చేలా విధివిధానాలు రూపొందించే అంశాన్ని పరిశీలిస్తున్నట్లు మంత్రి తుమ్మల తెలిపారు.

ఇక రైతుభరోసా పథకం నిధుల విడుదలకు ఈసీ బ్రేకులు వేసింది. ఇప్పటికే చాలా మంది రైతుల ఖాతాల్లో డబ్బులు జమ కాగా.. 5 ఎకరాలు పైబడిన రైతులకు ఇంకా సాయం అందలేదు. ఈనెల 9 లోపు రైతుభరోసా నిధులు విడుదల చేస్తామని ఇటీవల సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. అయితే ప్రస్తుతం పార్లమెంట్ ఎన్నికల కోడ్ అమల్లో ఉన్న నేపథ్యంలో నిధుల జమపై కేంద్ర ఎన్నికల సంఘం బ్రేకులు వేసింది. పోలింగ్ పూర్తయిన తర్వాత నిధులు విడుదల చేయాలని ఈసీ ఆదేశించింది.

ఇటువంటి మరిన్ని వార్తలు సమయం తెలుగులో చదవండి. లేటెస్ట్ వార్తలు, సిటీ వార్తలు, జాతీయ వార్తలు, బిజినెస్ వార్తలు, క్రీడా వార్తలు, రాశిఫలాలు ఇంకా లైఫ్‌స్టైల్ అప్‌డేట్లు మొదలగునవి తెలుసుకోండి. వీడియోలను TimesXP లో చూడండి.

2024-05-08T03:32:15Z dg43tfdfdgfd