Qఅండ్ R ల మధ్య చూడండి: వైరల్ ట్రెండ్లో..రోడ్ సేఫ్టీపై ఢిల్లీ పోలీసుల వార్నింగ్

Qఅండ్ R ల మధ్య చూడండి: వైరల్ ట్రెండ్లో..రోడ్ సేఫ్టీపై ఢిల్లీ పోలీసుల వార్నింగ్

సోషల్ మీడియాలో ఢిల్లీ పోలీసులు పోస్టు చేసిన ‘కీ బోర్డులో Q మరియు R అక్షరాల మధ్య చూడండి’ అనే వైరల్ ట్రెండ్ X ఫ్లాట్ ఫాంలో సంచలనం సృష్టిస్తోంది. అదేంటంటే ఏదైనా మేసేజ్ చెప్పాలనుకున్నపుడు.. కీబోర్డులో కొన్ని అక్షరాల మధ్య చూడండి అంటూ కోడింగ్ ను ఉపయోగిస్తున్నారు. విషయం మొత్తం పూర్తిగా చెప్పకుండా కోడ్ ద్వారా మేసేజ్ చెప్పడం అన్నమాట. గతంలో పలు రాజకీయ పార్టీలు , ఇతర సంస్థలు, వ్యక్తులు ‘క్లిక్ ఇయర్ ’ వైరల్ ట్రెండ్ ను వినియోగించడం అది సోషల్ మీడియాలో ఓ సంచలనంగా మారింది. ఇప్పుడు కీబోర్డులో T, O అక్షాల మధ్య చూడండి.. ‘H, L ల మధ్య చూడండి’ అంటూ  వైరల్ ట్రెండ్ కోడింగ్ మేసేజ్ లు Xలో ఇప్పుడు విపరీతంగా వైరల్ అవుతున్నాయి. 

 ఇంతకీ కీ బోర్డులో ఈ రెండు అక్షరాల మధ్య చూడండి అనేది ఏంటీ.. ఎలా ఉపయోగిస్తారు అని తెలుసుకోవాలని ఉంది కదా.. ఇది X ఫ్లాట్ ఫాంలో ఓ వైరల్ ట్రెండ్.. ఏదైనా మేసేజ్ పోస్ట్ చేయాలంటే.. రెండు అక్షరాలను ఎంచుకుని వాటి మధ్య ఉన్న అక్షరాలను కలుపుకొని డీకోడ్ చేయాలి. ఉదాహరణకు  కీబోర్డులో QR మధ్య ఉన్న అక్షరాలు W, E. వీటిని కలిపితే మేం అని అర్థం వస్తుంది. ఢిల్లీలో పోలీసులు ఇలాంటి వైరల్ ట్రెండ్ ను వినియోగించి వాహనదారులకు రోడ్ సేఫ్టీ వార్నింగ్ జారీ చేస్తూ వారి అటెన్షన్ ను పెంచుతున్నారు. తాజాగా దీనికి సంబంధించిన వీడియో X లో వైరల్ అవుతోంది. 

ఇదే విధంగా చాలా నెటిజన్లు ఈ వైరల్ ట్రెండ్ ను వినియోగిస్తున్నారు. జోక్ అని చెప్పడానికి కోడింగ్ గా H, L  అక్షరాల మధ్య చూడండి అని మేసేజ్ లో రాస్తున్నారు. అంటే  మేసేజ్ రీసీవర్ ఆ మేసేజ్ ను ఆసక్తిగా చూసేలా కోడింగ్ ఉపయోగిస్తున్నారు. కీబోర్డులో H, L ల మధ్య ఉండే అక్షరాలు J, K. వీటిని కలిపితే జోక్ అనే అర్థం వస్తుంది. ఇలా మేసేజ్ ను ఆసక్తిగా చేసేందుకు ప్రోత్సహిస్తున్నారు. 

గత కొద్దిరోజుల క్రితం ఇలాంటిదే  క్లిక్ ఇయర్ అనే ది పదం వైరల్ ట్రెండ్ అయింది. దీనిని రాజకీయ నాయకులు, వ్యక్తులు , సంస్థలు క్లిక్ ఇయర్ అని టైప్ పంపించిన చిత్రాన్ని పోస్ట్ చేసి మేసేజ్ రీసీవర్ అటెన్షన్ ను ప్రోత్సహించారు.  

©️ VIL Media Pvt Ltd.

2024-04-24T12:29:37Z dg43tfdfdgfd