TS DOST 2024: డిగ్రీ కోర్సుల్లో ప్రవేశాలకు మార్గం 'దోస్త్' - నోటిఫికేషన్‌ ఎప్పుడంటే?

DOST: తెలంగాణలోని ప్రభుత్వ, ప్రైవేట్‌ డిగ్రీ కళాశాలల్లో 2024-25 విద్యాసంవత్సరానికి సంబంధించి వివిధ డిగ్రీ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్దేశించిన 'డిగ్రీ ఆన్‌లైన్‌ సర్వీసెస్‌-తెలంగాణ(దోస్త్‌)' ఏప్రిల్ 27 లేదా మే 1న  వెలువడే అవకాశం ఉంది. అదేసమయంలో 'దోస్త్' ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్‌ ప్రారంభం కానుంది. రాష్ట్రంలో ఏప్రిల్ 24న ఇంటర్‌మీడియట్‌ ఫలితాలు వెలువడనున్న నేపథ్యంలో.. ఉన్నత విద్యామండలి డిగ్రీ ప్రవేశ షెడ్యూలు ప్రకటించడానికి సన్నాహాలు చేస్తోంది. దోస్త్‌ పరిధిలో రాష్ట్రంలోని ఉస్మానియా, కాకతీయ, తెలంగాణ, పాలమూరు, మహాత్మాగాంధీ, శాతవాహన యూనివర్సిటీల పరిధిలో 1054 డిగ్రీ కాలేజీలుండగా, వాటిలో 136 ప్రభుత్వ డిగ్రీ కాలేజీలు, నాన్‌ దోస్త్‌ కాలేజీలు 63 ఉన్నాయి. మిగిలినవి ప్రైవేట్‌ కాలేజీలు ఉన్నాయి. వీటిల్లో మొత్తం 3,86,544 డిగ్రీ సీట్లు అందుబాటులో ఉన్నాయి. రాష్ట్రంలోని విశ్వవిద్యాలయాల్లో బీఏ, బీకాం, బీఎస్సీ, బీబీఏ, బీబీఎం, బీసీఏ తదితర కోర్సుల్లోని సీట్లను దోస్త్‌ ద్వారా భర్తీ చేయనున్నారు. 

Courses

WEBSITE

ALSO READ:

ఐసర్‌లో డ్యూయల్ డిగ్రీ, బీఎస్ డిగ్రీ కోర్సులు - నోటిఫికేషన్, ప్రవేశ పరీక్ష వివరాలు ఇలా

దేశవ్యాప్తంగా ఉన్న ఇండియన్ ఇన్‌స్టిట్యూట్స్ ఆఫ్ సైన్స్ ఎడ్యుకేషన్ అండ్ రిసెర్చ్‌ (IISER) విద్యాసంస్థల్లో 2024-25 విద్యాసంవత్సరానికి డిగ్రీ కోర్సుల్లో ప్రవేశాలకు 'IAT-2024' (ఐసర్ ఆప్టిట్యూడ్ టెస్ట్) నోటిఫికేషన్ వెలువడింది. దీనిద్వారా బెర్హంపూర్, భోపాల్, కోల్‌కతా, మొహాలీ, పుణే, తిరువనంతపురం, తిరుపతిలో ఐఐఎస్‌ఈఆర్ క్యాంపస్‌లలో ఐదేళ్ల బీఎస్-ఎంఎస్ డ్యూయల్ డిగ్రీ, నాలుగేళ్ల బీఎస్ డిగ్రీలో సీట్లను భర్తీచేస్తారు. ప్రవేశ పరీక్ష (ఆప్టిట్యూడ్ టెస్ట్) ద్వారా ప్రవేశాలు కల్పిస్తారు. ఇంటర్ లేదా తత్సమాన విద్యార్హత ఉన్నవారు దరఖాస్తుకు అర్హులు. ఇతర దేశాలకు చెందినవారు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. అభ్యర్థులు దరఖాస్తు ఫీజుగా రూ.2000 చెల్లించాలి. ఎస్సీ, ఎస్టీ, కశ్మీర్ శరణార్థులు, దివ్యాంగులు రూ.1000 చెల్లిస్తే సరిపోతుంది. ఇందుకు సంబంధించిన ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ఏప్రిల్ 1న ప్రారంభంకాగా.. మే 13 వరకు దరఖాస్తులు స్వీకరించనున్నారు. దరఖాస్తు చేసుకున్నవారికి జూన్ 9న దేశంలోని ప్రధాన నగరాల్లో ప్రవేశపరీక్ష నిర్వహించనున్నారు.

పూర్తివివరాల కోసం క్లిక్ చేయండి..

జాతీయ విద్యాసంస్థల్లో ఇంటిగ్రేటెడ్‌ బీఈడీ కోర్సులు - నోటిఫికేషన్, పరీక్ష వివరాలు ఇలా

దేశంలోని ఐఐటీలు, ఎన్‌ఐటీలు, సెంట్రల్‌ వర్సిటీల్లో నాలుగేళ్ల ఇంటిగ్రేటెడ్‌ బీఈడీ కోర్సులో ప్రవేశాలకు 2024-25 విద్యా సంవత్సరానికిగాను 'నేషనల్‌ కామన్‌ ఎంట్రన్స్‌ టెస్ట్‌(NCET)-2024' నోటిఫికేషన్‌ను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) ఇటీవల విడుదల  చేసింది. ఇంటర్‌ లేదా తత్సమాన విద్యార్హత కలిగిన విద్యార్థులు దరఖాస్తుకు అర్హులు. ఇందుకు సంబంధించిన దరఖాస్తు ప్రక్రియ ఏప్రిల్ 13న ప్రారంభంకాగా.. ఏప్రిల్ 30 వరకు ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తులు సమర్పించాల్సి ఉంటుంది. దరఖాస్తు చేసుకున్నవారికి జూన్ 12న ప్రవేశ పరీక్ష నిర్వహించనున్నారు. ప్రవేశ పరీక్షలో ర్యాంకు ఆధారంగా ఆయా సంస్థలు ప్రవేశాల కౌన్సెలింగ్‌ నిర్వహించి నాలుగేళ్ల ఇంటిగ్రేటెడ్ టీచర్ ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్ (ITEP) బీఈడీ సీట్లను భర్తీ చేస్తాయి. ఈ పరీక్షలో ర్యాంకు ఆధారంగా ఆయా సంస్థలు ప్రవేశాల కౌన్సెలింగ్ నిర్వహించి సీట్లను భర్తీ చేస్తారు. కేవలం ఇంటిగ్రేటెడ్ కోర్సులకు మాత్రమే ఎన్‌సీఈటీ వర్తిస్తుంది.

ప్రవేశ వివరాల కోసం క్లిక్ చేయండి..

మరిన్ని విద్యాసంబంధ వార్తల కోసం క్లిక్ చేయండి..

2024-04-23T18:33:38Z dg43tfdfdgfd