TS TET MOCK TEST 2024 : తెలంగాణ టెట్ మాక్ టెస్ట్ లింక్‌ ఓపెన్‌.. అభ్యర్థులు ప్రాక్టీస్‌ చేయొచ్చు

TS TET 2024 : తెలంగాణ టెట్ దరఖాస్తుల ప్రక్రియ ముగిసింది. ఈ టెట్ పరీక్ష కోసం మొత్తం 2,83,441 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. ఇందులో పేపర్-1 కోసం 99,210 మంది.. పేపర్‌-2కు 1,84,231 మంది దరఖాస్తు చేసుకున్నారు. ఇక తెలంగాణ టెట్ పరీక్షలు (Telangana TET Exams 2024) మే 20 నుంచి ప్రారంభమై.. జూన్ 3వ తేదీ వరకు కొనసాగుతాయి. ఉదయం 9 గంటల నుంచి 11.30 వరకు పేపర్-1.. మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 4.30 వరకు పేపర్-2 పరీక్ష నిర్వహిస్తారు. రాష్ట్రవ్యాప్తంగా 11 జిల్లా కేంద్రాల్లో టెట్‌ పరీక్షలు నిర్వహించనున్నారు. ఈసారి ఆన్ లైన్‌లో పరీక్షలు నిర్వహించనున్నారు. దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు మే 15 నుంచి హాల్ టికెట్లు డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు. అనంతరం జూన్‌ 12న ఫలితాలు విడుదల చేయనున్నారు.

టెట్‌ పరీక్షల్లో అర్హత మార్కులను 60 శాతం, బీసీలకు 50 శాతం, ఎస్సీ-ఎస్టీ-దివ్యాంగులకు 40 శాతంగా నిర్ణయించారు. అలాగే.. మరోవైపు కీలకమైన డీఎస్సీ ఉన్న నేపథ్యంలో.. టెట్ స్కోరు కీలకంగా మారింది. ఈ క్రమంలో పరీక్షా విధానం, ప్రశ్నాల సరళి, సమయాభావంతో పాటు మరిన్ని విషయాలు తెలియాలంటే మాక్ టెస్టులు రాయడం ఉత్తమం. అయితే.. తెలంగాణ టెట్‌కు ప్రిపేరయ్యే విద్యార్థుల కోసం విద్యాశాఖ ఉచితంగా మాక్ టెస్టులు రాసే అవకాశం కల్పించింది. ఈ మేరకు వెబ్ సైట్‌లో ఆప్షన్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది.

తెలంగాణ టెట్ మాక్ టెస్టులు ఎలా రాయాలంటే..?

  • మొదట అభ్యర్థులు https://tstet2024.aptonline.in/tstet/ వెబ్‌సైట్‌ ఓపెన్‌ చేయాలి.
  • హోంపేజీలో పైన కనిపించే TS TET Mock Test-2024 అనే ఆప్షన్ పై క్లిక్ చేయాలి.
  • ఇక్కడ సైన్ ఇన్ కావాల్సి ఉంటుంది. ఆ తర్వాత వచ్చే ఆప్షన్లపై క్లిస్ చేస్తే.. మీకు ప్రశ్నాపత్రం ఓపెన్ అవుతుంది.
  • ఇలా అభ్యర్థులు ఎన్నిసార్లు అయినా పరీక్షలను రాయొచ్చు.

TS TET పరీక్ష విధానం:

ఈ టెట్ పరీక్షలకు సంబంధించి 150 మార్కులకు పేపర్-1.. 150 మార్కులకు పేపర్-2 నిర్వహించనున్నారు. ఒక్కో పేపరులో 150 ప్రశ్నలు ఉంటాయి. పేపర్-1లో 5 విభాగాలు ఉంటాయి. ఒక్కో విభాగంలో 30 ప్రశ్నలు- 30 మార్కులు కేటాయించారు. ఇక పేపర్-1లో 4 విభాగాలు ఉంటాయి. వీటిలో మొదటి మూడు విభాగాల్లో 30 ప్రశ్నలు- 30 మార్కులు.. నాలుగో విభాగానికి 60 ప్రశ్నలు - 60 మార్కులు కేటాయించారు.

ఇటువంటి మరిన్ని వార్తలు సమయం తెలుగులో చదవండి. లేటెస్ట్ వార్తలు, సిటీ వార్తలు, జాతీయ వార్తలు, బిజినెస్ వార్తలు, క్రీడా వార్తలు, రాశిఫలాలు ఇంకా లైఫ్‌స్టైల్ అప్‌డేట్లు మొదలగునవి తెలుసుకోండి. వీడియోలను TimesXP లో చూడండి.

2024-04-26T12:18:39Z dg43tfdfdgfd