కవితను బయటకు తీసుకురావాలనే బీజేపీకి బీఆర్ఎస్ ​సపోర్ట్: కొండా సురేఖ

కవితను బయటకు తీసుకురావాలనే బీజేపీకి బీఆర్ఎస్ ​సపోర్ట్: కొండా సురేఖ

గ్రేటర్​వరంగల్​, వెలుగు:  కేసీఆర్​ బిడ్డ కవితను జైలు నుంచి బయటకు తీసుకురావాలనే బీజేపీకి పార్లమెంట్ఎన్నికల్లో బీఆర్ఎస్​ సపోర్ట్​ చేస్తోందని రాష్ర్ట దేవాదాయ, పర్యావరణ, ఆటవీ శాఖ మంత్రి కొండా సురేఖ ఆరోపించారు. కాంగ్రెస్​వరంగల్ ఎంపీ అభ్యర్థి కడియం కావ్య గెలుపు కోసం వరంగల్​తూర్పు నియోజకవర్గంలో సన్నాహక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కొండా సురేఖ మాట్లాడుతూ ఈ లోక్​సభ ఎన్నికల్లో బీఆర్ఎస్, బీజేపీ కలిసి పని చేస్తున్నాయన్నారు. 

ఇందులో భాగంగానే బీఆర్ఎస్​లీడర్లను బీజేపీ అభ్యర్థులుగా పోటీలో నిలుపుతున్నారన్నారు. స్టేషన్​ఘన్​పూర్​ఎమ్మెల్యే కడియం శ్రీహరి మాట్లాడుతూ కాంగ్రెస్​కార్యకర్తల ఉత్సాహం చూస్తుంటే తన బిడ్డ కావ్య గెలుపు ఖాయమైపోయినట్టు కనిపిస్తోందన్నారు. ఎంపీ అభ్యర్థి కావ్య మాట్లాడుతూ ఈ ఎన్నికల్లో తనకు అత్యధిక మెజార్టీ ఇచ్చి గెలిపించాలని కోరారు. మాజీ ఎమ్మెల్సీ కొండా మురళీధర్​రావు, కాంగ్రెస్​పార్టీ మైనార్టీ లీడర్​మహ్మద్ ఆయూబ్ పాల్గొన్నారు. 

  ©️ VIL Media Pvt Ltd.

2024-04-19T02:45:42Z dg43tfdfdgfd