గాజాకు మద్దతుగా అమెరికాలో ఆందోళనలు.. భారత సంతతి విద్యార్థిని అరెస్ట్‌

గాజాపై ఇజ్రాయేల్‌ దాడులకు సహకారం అందిస్తోన్న జో బైడెన్ సర్కారును వైఖరిని నిరసిస్తూ అమెరికా యూనివర్సిటీల్లోని విద్యార్థులు పెద్ద ఆందోళనలు చేపట్టారు. జో బైడెన్‌ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలకు వ్యతిరేకంగా విద్యార్థులు గళమెత్తారు. తాజా, ప్రిన్స్‌టన్‌ యూనివర్సిటీలో నిరసనల్లో పాల్గొన్న ఇద్దరు విద్యార్థులను అదుపులోకి తీసుకున్నారు. వీరిలో భారత సంతతికి చెందిన విద్యార్థిని అచింత్య శివలింగన్‌‌తో పాటు హస్సన్ సయ్యద్ అనే మరో విద్యార్ధి ఉన్నట్టు విద్యార్థులు తెలిపారు. ప్రిన్స్‌టన్‌లో మాస్టర్స్ చేస్తున్న అచింత్య శివలింగన్ తమిళనాడులోని కోయంబత్తూరులో జన్మించారు.

గురువారం తెల్లవారుజామున నిరసనకారులు క్యాంపస్‌లో టెంట్లు ఏర్పాటు చేయడంతో వారిద్దరి అరెస్టు చోటుచేసుకుందని విద్యార్థి సంఘాల పత్రికల్లో పేర్కొన్నట్లు మీడియా కథనాలు వెల్లడించాయి. యూనివర్సిటీ నిబంధనలకు విరుద్ధంగా టెంట్లు ఏర్పాటు చేయడంతోనే చర్యలు తీసుకున్నట్లు అధికార ప్రతినిధి జెన్నిఫర్ మోరిల్ వెల్లడించారు. వారిని యూనివర్సిటీ నుంచి తొలగించామని తెలిపారు. న్యూయార్క్‌లోని కొలంబియా యూనివర్సిటీలో మొదలైన ఈ నిరసనలు దేశవ్యాప్తంగా పలు విద్యాసంస్థలకు వ్యాపించాయి. ఈ ఆందోళనలకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యాయి.

శివలింగం ప్రిన్స్‌టన్ యూనివర్సిటీ ఇంటర్నేషనల్ డెవలప్‌మెంట్ విభాగంలో పబ్లిక్ అఫైర్స్‌లో మాస్టర్స్ చేస్తుండగా.. సయ్యద్ పీహెచ్‌డీ చేస్తున్నాడు. ‘ఆందోళనలు విరమించాలని, తక్షణమే నిరసన ప్రదేశాన్ని వీడాలని పలుసార్లు హెచ్చరించినా వినిపించుకోలేదు.. అందుకే వారిపై క్రమశిక్షణ చర్యలు తీసుకున్నాం.. విద్యార్థుల ఇద్దరి అరెస్ట్‌తో మిగతా ఆందోళనకారులు తమకు తాముగా నిరసన విరమించారు’ అని మోరిల్ అన్నారు.

కోయంబత్తూరులో జన్మించిన అచింత్య తల్లిదండ్రుల అమెరికా వెళ్లి స్థిరపడ్డారు. కొలంబస్, ఓహియోలో ఆమె విద్యాభ్యాసం సాగింది. ఓహియో యూనివర్సిటీ నుంచి పాలిటిక్స్, ఎకన్‌మిక్స్‌లో డిగ్రీ, హార్వర్డ్ లా స్కూల్‌లో ఇంటర్న్‌గా చేశారు. ఒహియోలోని మూడవ జిల్లాలో కాంగ్రెషనల్ క్యాంపెయిన్ కోసం పనిచేశారు. సెంటర్ ఫర్ పాలసీ రిసెర్చ్‌లో భారత్‌లోని భూమి హక్కులు, విధాన కార్యక్రమాలకు కూడా సహకరించారు.

ఇటువంటి మరిన్ని వార్తలు సమయం తెలుగులో చదవండి. లేటెస్ట్ వార్తలు, సిటీ వార్తలు, జాతీయ వార్తలు, బిజినెస్ వార్తలు, క్రీడా వార్తలు, రాశిఫలాలు ఇంకా లైఫ్‌స్టైల్ అప్‌డేట్లు మొదలగునవి తెలుసుకోండి. వీడియోలను TimesXP లో చూడండి.

2024-04-26T10:22:50Z dg43tfdfdgfd