యనమల కుటుంబం నుంచి ఈసారి ఎన్నికల్లో మహిళ నామినేషన్..!!

ఆ పార్టీలో ఆ ఉమ్మడి జిల్లాలోనే కాదు తెలుగు రాష్ట్రాల్లోనే ఆ నాయకుడు ప్రత్యేక పేరు. ముఖ్యమంత్రి తర్వాత ముఖ్యమంత్రి అంత పేరు సంపాదించుకుని సుదీర్ఘ కాలంగా ఆయన అనేక పదవుల్లో ఉంటూ ప్రత్యేక స్థానాన్నితెచ్చుకున్నారు. మొట్టమొదటి సారిగా ఆయన కుటుంబం నుంచి ఒక మహిళను ఈసారి పోటీలోకి దింపారు. ఈ సందర్భంగా నామినేషన్ ప్రక్రియ సైతం ఆ జిల్లాలో కొనసాగుతుంది. ఎవరా నేత.. ఎవరా ఆయన కుమార్తె విశేషాలు ఒకసారి చూద్దాం. తెలుగు రాష్ట్రాల్లోనే కాదు దేశంలోనే రాజకీయాల్లో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు పొందిన నేత యనమల రామకృష్ణుడు అని చెప్పుకోవచ్చు. స్వర్గీయ నందమూరి తారక రామారావు తెలుగుదేశం పార్టీ పెట్టినప్పటి నుంచి ఒక ఎమ్మెల్యేగా తొలిసారి న్యాయశాఖ మంత్రిగా నాటి నుంచి అనేక ఆర్థిక శాఖ న్యాయశాఖ ఇలా అనేక శాఖలో ఆయన పనిచేస్తూ దేశ రాజకీయాల్లో ఒక ప్రత్యేక గుర్తింపు పొందారు.

కాకినాడజిల్లా తొండంగి మండలం ఏవి నగరం గ్రామానికి చెందిన ఈ తెలుగుదేశం పార్టీ నేత యనమల రామకృష్ణుడు నాటి కాలంలో లాయర్ ప్రాక్టీస్ చేస్తుండగా పొలిటికల్ లోకి ఎంటర్ కావడం నాటి నుంచి ఒక తిరుగులేని నేతగా ఎదిగిన పరిస్థితి నెలకొంది. అయితే గత రెండు ఎలక్షన్ల ముందు ఆయన ఓటమి పాలు కావడంతో ఆయన సోదరుడును బరిలో దింపారు. ఆయనపై రెండు సార్లు ప్రస్తుత రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రివర్యులుగా ఉన్న దాడిశెట్టి రాజా విజయ కేతనం ఎగరవేశారు.

కాకినాడలో భలే మామిడి చెట్టు.. ఆకుల కన్నా కాయలు ఎక్కువ!

ఇక ఇలా కాదు అని ఈ ఎలక్షన్ లో చాలా సీరియస్ గా తీసుకున్న సీనియర్ నేత యనమల రామకృష్ణుడు నేరుగా తన పెద్ద కుమార్తె యనమల దివ్యను తుని నియోజకవర్గం నుంచి పోటీకి దింపారు. గత కొన్ని రోజులుగా ప్రచార హోరులో యనమల దివ్య తుని నియోజకవర్గం ప్రజలను కలుసుకుంటున్నారు. ఒక్క అవకాశం ఇవ్వండి నియోజకవర్గంలో అభివృద్ధి అంటే ఏంటో చూపిస్తాను ఎన్నో సమస్యలు ఇక్కడ తాండవిస్తూ ఉన్నాయి. అని ప్రజలకు వివరిస్తూ ఆమె ముందుకు సాగుతున్నారు.

నిర్లక్ష్యంతో జరిగే అగ్ని ప్రమాదాలే ఎక్కువ.. అవగాహన లేకుంటే భారీగానే నష్టమట.. అవేంటో తెలుసుకోండి మరి!

ఎలక్షన్ కు సంబంధించి నామినేషన్ ప్రక్రియ కొనసాగుతున్న నేపథ్యంలో కాకినాడ జిల్లా తుని నియోజకవర్గం నుంచి తెలుగుదేశం పార్టీ తరఫున యనమల దివ్య ఆయన తండ్రి యనమల రామకృష్ణుడు పర్యవేక్షణలో నామినేషన్ దాఖలు చేశారు. ఆమె ప్రత్యేకంగా లోకల్ 18 తో మాట్లాడారు. ఇక్కడ ఎన్నో సమస్యలు దీర్ఘకాలికంగా ఉన్నాయని అవన్నీ తెలుగుదేశం పార్టీ ద్వారానే పరిష్కారం అవుతాయని ఒక ఆడపడుచుగా తుని నియోజకవర్గ ప్రజలు నన్ను చూసుకోవడం ఎంతో ఆనందంగా ఉందని యనమల దివ్య పేర్కొన్నారు.

2024-04-24T04:27:31Z dg43tfdfdgfd