విద్యార్థులకు చక్కని విద్యను అందిస్తున్నాం.. లోకల్18 తో బెస్ట్ అవార్డ్ టీచర్..

ఈమె ఒక ప్రభుత్వ ఉన్నత పాఠశాల ఉపాధ్యాయులు. విద్యార్థులకు చక్కని బోధన అందిస్తుండడంతో తాజాగా జిల్లా ఇన్స్పైర్ అవార్డును అందుకున్నారు. ఈ మహిళా ఉపాధ్యాయురాలు పాఠశాలకు వస్తుందంటే చాలు. విద్యార్థులు ఆమెకు ఘనస్వాగతం పలుకుతారు. అంతేకాదు ఆ పాఠశాలలో గల ఉపాధ్యాయులను సైతం అక్కడి విద్యార్థులు పూజిస్తారని చెప్పవచ్చు ఇంతలా ఆ పాఠశాలలో విద్యార్థులకు చక్కని విద్యతో పాటు ఉత్తమ క్రమశిక్షణను అందిస్తున్నారు అక్కడి ఉపాధ్యాయులు కాగా తాజాగా జిల్లా ఇన్స్పైర్ అవార్డును అందుకున్న సైన్స్ టీచర్ రాధ ను లోకల్ ప్రత్యేకంగా పలకరించింది.

నల్గొండ జిల్లా కట్టంగూరు మండల పరిధిలోని ఐటి పాముల గ్రామంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు చెందిన సైన్స్ ఉపాధ్యాయురాలు రాధాకు ఇటీవల జిల్లా ఇన్స్పైర్ అవార్డు దక్కింది. తాను అవార్డు అందుకోవడంపై సైన్స్ టీచర్ రాధా మాట్లాడుతూ తనకు జిల్లాస్థాయి ఉత్తమ ఉపాధ్యాయురాలుగా అవార్డు రావడం చాలా ఆనందంగా ఉందన్నారు. అయితే తమ పాఠశాలలోని ఉపాధ్యాయుల ప్రోత్సాహంతో తాను విద్యార్థుల్లో విద్యాసామర్థ్యాన్ని పెంపొందించేందుకు కృషి చేస్తున్నానన్నారు.

---- Polls module would be displayed here ----

తమ పాఠశాలకు చెందిన విద్యార్థులు ఇప్పటికే జిల్లా స్థాయి రాష్ట్రస్థాయి లో పలు అవార్డులను సాధించారని ఈ విజయం వెనుక తమ పాఠశాల ఉపాధ్యాయుల కృషి ఉందన్నారు తమ పాఠశాలలోని విద్యార్థులు ఉత్తమ ఫలితాలు సాధించేలా ఒక ప్రణాళిక బద్దంగా వారికి చదువుపై ఆసక్తి పెంచుతూ... తాము కృషి చేస్తున్నామని దీనితో తమ పాఠశాల విద్యార్థులు కార్పొరేట్ పాఠశాలకు దీటుగా ర్యాంకులను సైతం సాధిస్తున్నారని తెలిపారు.

తమ పాఠశాలకు చెందిన ఉపాధ్యాయురాలు రాధా జిల్లా స్థాయి ఉత్తమ ఉపాధ్యాయురాలుగా అవార్డు అందుకోవడంపై మిగిలిన ఉపాధ్యాయులు విద్యార్థులు ఆమెకు అభినందనలు తెలిపారు. తాను ఏ ప్రభుత్వ పాఠశాలలో పనిచేసినా అక్కడి విద్యార్థులకు ఉత్తమ విద్యను అందించడమే తన లక్ష్యమని రాధా తెలిపారు ప్రతి ఒక్కరి జీవితంలో జీవశాస్త్రం అనేది నిజ జీవితానికి చాలా దగ్గరగా ఉంటుందని ఈ సబ్జెక్టు పై విద్యార్థులు ఎక్కువ మక్కువ పెంచుకునేలా తాను కృషి చేయడం జరుగుతుందని తెలిపారు. ఏది ఏమైనా విద్యార్థులకు చక్కని విద్యను అందిస్తూ ఉత్తమ ఉపాధ్యాయురాలిగా సైన్స్ ఉపాధ్యాయురాలు రాధా జిల్లా స్థాయి ఉత్తమ ఉపాధ్యాయురాలిగా ఎంపిక కావడం ప్రశంసనీయం అభినందనీయం.

2024-04-24T14:14:00Z dg43tfdfdgfd