ఉత్తరాంధ్రవాసులకు గుడ్ న్యూస్.. మలేషియాకు నేరుగా విమాన సర్వీస్

ఉత్తరాంధ్రవాసులకు గుడ్ న్యూస్. విశాఖపట్నం నుంచి మలేషియాకు అంతర్జాతీయ విమాన సర్వీసు అందుబాటులోకి వచ్చింది. ఎయిర్ ఏషియా ద్వారా కౌలాలంపూర్‌కు కొత్త అంతర్జాతీయ విమాన సర్వీసు ప్రారంభమైంది. శుక్రవారం విశాఖపట్నం అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి ఈ సర్వీసు ప్రారంభమైంది. విమానం కౌలాలంపూర్ నుంచి రాత్రి 9.30 గంటలకు విశాఖపట్నం చేరుకుంటుంది. అలాగే విశాఖపట్నం నుంచి రాత్రి 10.00 గంటలకు బయలుదేరి తెల్లవారుజామున 4.20 గంటలకు (IST ఉదయం 1.50 గంటలకు) కౌలాలంపూర్ చేరుకుంటుంది.

ఈ విమానం కంబోడియా, చైనా, హాంకాంగ్, ఇండోనేషియా, జపాన్, లావోస్, మకావు, ఫిలిప్పీన్స్, సింగపూర్, తైవాన్, వియత్నాం, ఆస్ట్రేలియాలను కలుపుతుంది. మరోవైపు అంతర్జాతీయ విమాన సర్వీసు ప్రారంభోత్సవంలో వైజాగ్ ఎయిర్‌పోర్ట్ ఏపీడీ ఎస్. రాజా రెడ్డి, ఎయిర్‌పోర్ట్ అడ్వైజరీ కమిటీ సభ్యులు డా.కె.కుమార్ రాజా, ఓ.నరేష్ కుమార్, డి.ఎస్.వర్మ, ఇతర అధికారులు పాల్గొన్నారు.

మరోవైపు విశాఖపట్నం నుంచి కౌలాలంపూర్ స‌ర్వీసులు వారంలో మూడురోజులు మాత్రమే అందుబాటులో ఉంటాయి. వారంలో బుధ, శుక్ర, ఆదివారాల్లో మాత్రమే నడుస్తాయని విమానాశ్రయ వర్గాలు వెల్లడించాయి. మరోవైపు మలేషియా చూడాలని అనుకునే పర్యాటకులకు ఈ విమాన సర్వీసు ఉపయోగకరంగా ఉంటుందని అధికారులు చెప్తున్నారు. అలాగే విశాఖ అందాలు చూడాలనుకునే మలేషియావాసులకు ఉపయుక్తంగా ఉంటుందన్నారు. ఈ విమానంలో ప్రయాణించేందుకు వీసా కూడా అవసరం లేదు.

మరోవైపు ఎయిర్ ఏషియా సంస్థ విశాఖఫట్నం మీద ప్రత్యేక ఫోకస్ పెట్టింది. ఎయిర్ ఏషియా సంస్థ ఇప్పటికే విశాఖపట్నం నుంచి థాయిలాండ్‌కు విమాన సర్వీసు నడుపుతోంది. తాజాగా మలేషియా వెళ్లేందుకు కూడా సర్వీసును ప్రారంభించింది. టైర్‌–2 నగరాల్లోని ఇంటర్నేషనల్‌ ఎయిర్‌పోర్టుల్నే టార్గెట్‌ చేస్తూ కొత్త సర్వీసుల్ని మొదలు పెడుతోంది.

ఇటువంటి మరిన్ని వార్తలు సమయం తెలుగులో చదవండి. లేటెస్ట్ వార్తలు, సిటీ వార్తలు, జాతీయ వార్తలు, బిజినెస్ వార్తలు, క్రీడా వార్తలు, రాశిఫలాలు ఇంకా లైఫ్‌స్టైల్ అప్‌డేట్లు మొదలగునవి తెలుసుకోండి. వీడియోలను TimesXP లో చూడండి.

2024-04-26T14:38:23Z dg43tfdfdgfd