JEE: రోజూ 12 గంటలు చదివి.. జాతీయ స్థాయి ర్యాంక్ సాధించిన కర్నూల్ విద్యార్థి

జేఈఈ మెయిన్స్ పరీక్షా ఫలితాల్లో కర్నూలు జిల్లా విద్యార్థులు ప్రభంజనం సృష్టించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇటీవల వెలువడిన ఇంటర్ పరీక్ష ఫలితాల్లో సత్తా చాటిన విద్యార్థులు.. జేఈఈ మెయిన్స్ పరీక్షల్లో సైతం అద్భుత ప్రతిభ కనబరచి శభాష్ అనిపించుకున్నారు. ఉమ్మడి కర్నూలు జిల్లా కోవెలకుంట్ల చెందిన కె.ప్రశాంత్ రెడ్డి అనే విద్యార్థి జాతీయస్థాయిలో 148వ ర్యాంక్ సాధించి సత్తా చాటారు. కోవెలకుంట్ల గ్రామానికి చెందిన కె.ప్రశాంత్ రెడ్డి తమ గ్రామంలోని విఆర్ పాఠశాలలో పదవ తరగతి విద్యాభ్యాసం పూర్తి చేశారు. ప్రశాంత్ రెడ్డి ఇంటర్ మాత్రం కర్నూల్ పట్టణంలోని యస్.ఆర్ జూనియర్ కళాశాలలో హాస్టల్ లో ఉంటూ విద్యాభ్యాసం పూర్తి చేశారు.

ఈయన తల్లి కోవెలకుంట్లలోని విఆర్ పాఠశాలలో ప్రవేట్ టీచర్ గా విధులు నిర్వహిస్తున్నారు. తన తండ్రి ఉద్యోగరీత్యా కువైట్ లో ఉంటున్నారు. జేఈఈ మెయిన్స్ లో ఇంతటి ర్యాంక్ సాధించడంపై ప్రతి రోజూ 12 గంటలు కష్టపడి ఇష్టంతో చదవడంతో అనుకున్న విజయానికి తాను చేరువైనట్లు తెలిపారు. ప్రతిరోజూ ఉదయం 6 గంటల నుండి 11 గంటల వరకు కేవలం మెయిన్స్ కి ప్రిపేర్ అయ్యేవాడినన్నారు. తన ఉత్తమ ఫలితం వెనుక ఎస్.ఆర్ కళాశాల లెక్చరర్స్ ప్రోత్సాహం ఉందన్నారు.

తెల్లారితే చాలు అక్కడికే పరుగులు పెడుతున్న జనం.. కారణం ఏమిటంటే !

కళాశాలలో లెక్చరర్స్ చెప్పిన పాఠాలను ప్రతి ఒక్కటి నోట్ చేసుకొని, అందులో ముఖ్యమైన విషయాలను షార్ట్ నోట్స్ గా ప్రిపేర్ చేసుకోవడం జరిగిందన్నారు. అవన్నీ మళ్లీ మళ్లీ రివిజన్ చేయడంతోనే తనకు జేఈఈ మెయిన్స్ లో మంచి మార్కులు వచ్చాయని, తాను భవిష్యత్ లో నీటితో నడిచే వాహనాలు తయారు చేయడమే లక్ష్యంగా ఎంచుకున్నానన్నారు. ఇటువంటి వాహనాలను తయారు చేసేందుకు పరిశోధన చేస్తానని తెలిపారు.

Latest Offers: ఆన్‌లైన్ కన్నా తక్కువ రేటుకే.. టీవీ, ఏసీ ,వాషింగ్ మెషీన్, ఫ్రిజ్

అలాగే వివిధ కేటగిరీలలో కర్నూల్ జిల్లాకు చెందిన పలువురు విద్యార్థులు జాతీయ స్థాయిలో రాణించారు. వీరిలో కె.ప్రశాంత్ రెడ్డి ఆల్ ఇండియా ర్యాంక్ - 148, వేదవచన్ రెడ్డి - 1647, మల్లు నాయక్ - 1580, బద్రినాథ్ రెడ్డి - 4476, యస్.శివమణి - 5954, చరణ్ తేజ్- 8618, సాయి సృజన్ - 9218 మొత్తం 30 మంది విద్యార్థులు జాతీయ స్థాయిలో ప్రతిభను కనబరచడంతో పలువురు వీరికి అభినందనలు తెలిపారు. అయితే ఇటీవల విడుదలైన ఇంటర్, టెన్త్ ఫలితాలలో ప్రతిభ కనబర్చిన కర్నూల్ విధ్యార్థులు, జేఈఈ లో సైతం ఉత్తమ ఫలితాలు సాధించడం విశేషం.

2024-04-26T15:52:28Z dg43tfdfdgfd