POST OFFICE : 10వ తరగతి అర్హతతో.. పోస్టల్‌ డిపార్ట్‌మెంట్‌లో భారీగా ఉద్యోగాల భర్తీకి ఏర్పాట్లు!

India Post GDS Recruitment 2024 : దేశవ్యాప్తంగా 10వ తరగతి పాసై ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగ యువతకు గుడ్‌న్యూస్‌. దేశ వ్యాప్తంగా ఉన్న పోస్టల్‌ సర్కిళ్లలో భారీ సంఖ్యలో గ్రామీణ డాక్ సేవక్ (India Post GDS Recruitment 2024) పోస్టుల భర్తీకి రంగం సిద్ధమైంది. త్వరలో GDS Recruitment 2024 నోటిఫికేషన్‌ విడుదల కానుంది. గతేడాది జనవరిలో 40,000 ఖాళీల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదల కాగా.. ఈ ఏడాది ప్రకటన విడుదల కావాల్సి ఉంది. 10వ తరగతిలో సాధించిన మార్కుల ఆధారంగా ఈ పోస్టులను భర్తీ చేస్తారు. అభ్యర్థుల వయసు 18-40 ఏళ్ల మధ్యలో ఉండాలి. ఎస్సీ, ఎస్టీలకు ఐదేళ్లు, ఓబీసీలకు మూడేళ్లు, దివ్యాంగులకు పదేళ్లు గరిష్ఠ వయసులో సడలింపు ఉంటుంది. అర్హత, ఆసక్తిగల అభ్యర్థులు ఆన్‌లైన్‌లో అప్లయ్‌ చేసుకోవాలి.

ఈ పోస్టులకు ఎంపికైనవారు బ్రాంచ్‌పోస్టు మాస్టర్‌ (BPM), అసిస్టెంట్‌బ్రాంచ్‌పోస్టు మాస్టర్‌ (ABPM), డాక్‌ సేవక్‌ హోదాలతో విధులు నిర్వహించాలి. పోస్టును బట్టి రూ.పది వేల నుంచి రూ.పన్నెండు వేల ప్రారంభ వేతనం ఉంటుంది. ఈ పోస్టులకు ఎంపికైనవారు రోజుకు నాలుగు గంటలు మాత్రమే పనిచేస్తే సరిపోతుంది. వీటితోపాటు ఇండియా పోస్టల్‌ పేమెంట్‌ బ్యాంక్‌ (India Post Payments Bank)కు సంబంధించిన సేవలకు గానూ ప్రత్యేకంగా ఇన్సెంటివ్‌ రూపంలో బీపీఎం/ ఏబీపీఎం/ డాక్‌ సేవక్‌లకు ప్రోత్సాహం అందజేస్తారు. ఏ క్షణమైనా India Post GDS Recruitment 2024 నోటిఫికేషన్‌ https://indiapostgdsonline.gov.in/ వెబ్‌సైట్‌లో విడుదలయ్యే అవకాశం ఉంది.

UPSC CAPF 2024 : డిగ్రీ అర్హతతో 506 ప్రభుత్వ ఉద్యోగాలు.. దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం

UPSC CAPF Notification 2024 : న్యూఢిల్లీలోని యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్‌ (UPSC) .. సెంట్రల్‌ ఆర్మ్‌డ్‌ పోలీస్‌ ఫోర్సెస్‌ -CAPF (అసిస్టెంట్ కమాండెంట్) ఎగ్జామినేషన్‌-2024 నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఈ CAPF పరీక్ష ద్వారా బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్, సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్, సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్, ఇండో-టిబెటన్ బోర్డర్ పోలీస్, సశస్త్ర సీమా బల్‌లో 506 అసిస్టెంట్ కమాండెంట్‌ (గ్రూప్ -ఏ) ఉద్యోగాలను భర్తీ చేయనుంది. విద్యార్థతలు, ముఖ్యమైన తేదీల తదితర వివరాల కోసం లింక్‌ ఇదే.. క్లిక్‌ చేయండి.

ఇటువంటి మరిన్ని వార్తలు సమయం తెలుగులో చదవండి. లేటెస్ట్ వార్తలు, సిటీ వార్తలు, జాతీయ వార్తలు, బిజినెస్ వార్తలు, క్రీడా వార్తలు, రాశిఫలాలు ఇంకా లైఫ్‌స్టైల్ అప్‌డేట్లు మొదలగునవి తెలుసుకోండి. వీడియోలను TimesXP లో చూడండి.

2024-04-25T07:11:48Z dg43tfdfdgfd