RAPIDO: ఓటర్లకు ర్యాపిడో గుడ్‌న్యూస్.. పోలింగ్ రోజు వారికి ఉచిత ప్రయాణాలు

Rapido: లోక్‌సభ ఎన్నికల హోరు దేశవ్యాప్తంగా కొనసాగుతోంది. సార్వత్రిక ఎన్నికలు 7 దశల్లో జరగనుండగా.. ఇప్పటికే ఒక దశ పోలింగ్ పూర్తి అయింది. మరో రెండు రోజుల్లో రెండో దశ పోలింగ్ కూడా జరగనుంది. ఈ నేపథ్యంలోనే దేశంలో పార్టీలు, అభ్యర్థులు తమ ప్రచారాన్ని మరింత ముమ్మరం చేసి.. ఓటర్లను తమ వైపు ఆకర్షించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఇక ఎన్నికలను సజావుగా నిర్వహించేందుకు కేంద్ర ఎన్నికల సంఘం అధికారులు అనేక చర్యలు చేపడుతున్నారు. ఇక ఓటర్లను పోలింగ్ స్టేషన్లకు వచ్చి ఓటు వేసి ఓటింగ్ శాతాన్ని పెంచేలా రకరకాల కార్యక్రమాలు చేపడుతున్నారు. ఈ క్రమంలోనే ప్రముఖ ట్యాక్సీ సర్వీసులు అందించే ర్యాపిడో సంస్థ బంపరాఫర్ ప్రకటించింది.

పోలింగ్‌ రోజున ఓటర్లకు ఫ్రీ రైడ్ కల్పించనున్నట్లు తెలిపింది. అయితే ఇది కేవలం కర్ణాటక రాష్ట్రంలో ఉన్న వారికి మాత్రమే అని స్పష్టం చేసింది. అందులో కూడా అందరు ఓటర్లకు ఈ ఫ్రీ రైడ్ వర్తించదని పేర్కొంది. కేవలం వృద్ధులు, వికలాంగులకు మాత్రమే ఈ ఉచిత ప్రయాణ సదుపాయాన్ని తీసుకువస్తున్నట్లు ర్యాపిడో ప్రకటించింది. ఎన్నికల వేళ.. కర్ణాటకలోని పోలింగ్‌ కేంద్రాల వద్దకు సీనియర్ సిటిజన్లు, దివ్యాంగులను ఇంటి దగ్గరి నుంచి ఉచితంగా పోలింగ్ స్టేషన్‌కు తీసుకువెళ్లనున్నట్లు తెలిపింది. అయితే ఓటు వేసేందుకు పోలింగ్ బూత్‌కు వెళ్లలేని వారి కోసమే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ర్యాపిడో తెలిపింది.

సార్వత్రిక ఎన్నికల రెండో దశ పోలింగ్‌లో భాగంగా కర్ణాటకలో ఈ నెల 26 వ తేదీన ఎన్నికలు జరగనున్నాయి. ఈ క్రమంలోనే కర్ణాటకలో ఓటింగ్ శాతాన్ని పెంచేందుకు తమ వంతు ప్రయత్నం చేస్తున్నట్లు ర్యాపిడో ప్రకటించింది. దీనికోసం ‘సవారీ జిమ్మదారీకీ’ పేరిట కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు ర్యాపిడో తెలిపింది. సీనియర్‌ సిటిజన్స్‌, దివ్యాంగులు మాత్రమే ఈ ఉచిత రైడ్ సేవలను ఉపయోగించుకోవచ్చని తెలిపింది.

బెంగళూరు, మైసూర్‌, మంగళూరు ప్రాంతాల్లో ఓటు హక్కు వినియోగించుకునేవారు VOTE NOW అనే కోడ్‌ను ఉపయోగించుకుని ఫ్రీ రైడ్‌లను పొందాలని ర్యాపిడో వెల్లడించింది. పోలింగ్‌ తేదీ రోజున ఓటు వేసేందుకు వెళ్లేందుకు వికలాంగులు, వృద్ధులు ఎలాంటి ఆందోళన చెందకుండా ఉండేందుకు తాము ఈ సేవలు తీసుకువచ్చినట్లు ర్యాపిడో కో ఫౌండర్ పవన్‌ గుంటుపల్లి తెలిపారు.

ఇటువంటి మరిన్ని వార్తలు సమయం తెలుగులో చదవండి. లేటెస్ట్ వార్తలు, సిటీ వార్తలు, జాతీయ వార్తలు, బిజినెస్ వార్తలు, క్రీడా వార్తలు, రాశిఫలాలు ఇంకా లైఫ్‌స్టైల్ అప్‌డేట్లు మొదలగునవి తెలుసుకోండి. వీడియోలను TimesXP లో చూడండి.

2024-04-24T14:58:40Z dg43tfdfdgfd