అక్షయ తృతీయ రోజు ఈ పనులు చేస్తే వారికి డబ్బే డబ్బు..

హిందూ మతం జీవనది లాంటిది. అందుకే ఏడాది పొడవునా పండగలు, పర్వదినాలు వస్తుంటాయి. అందులో అక్షయ తృతీయ ఒకటి. ఈ పండగ ప్రతి ఏటా వైశాఖ మాసం శుక్ల పక్షం తృతీయ తిథి నాడు జరుపుకుంటారు. అక్షయ తృతీయను కొన్ని ప్రాంతాల్లో అబుజ్హ ముహూర్తం, అఖా తీజ్ అని కూడా పిలుస్తారు. ఈ పండగ రోజు విష్ణువు, లక్ష్మీదేవిని పూజిస్తారు. ఈ ఏడాది మే10న అక్షయ తృతీయ రానుంది. ఈ నేపథ్యంలో లక్ష్మీదేవిని ప్రసన్నం చేసుకోవడానికి పాటించాల్సిన ఆచారాలేంటో తెలుసుకుందాం.

* అక్షయ తృతీయ నాడు బంగారం కొనుగోలు చేయడం శుభప్రదంగా భావిస్తారు. ఇది కుటుంబానికి ఆనందం, శాంతి, సంపదను తీసుకొస్తుందని చాలా మంది నమ్మకం.

* లక్ష్మీదేవీ ప్రసన్నం కోసం108 తామర పువ్వులు లేదా గులాబీలను సంపద దేవతకు సమర్పించాలి. ఆచారాల ప్రకారం ఆమెను పూజించాలి. ఇలా చేస్తే లక్ష్మీదేవి సంతోషిస్తుంది. ఆమె ఆశీర్వాదం లభించి ఆనందం, శ్రేయస్సు కలుగుతుంది.

* ఆర్థిక సమస్యల నుంచి గట్టెక్కడానికి అక్షయ తృతీయ నాడు లక్ష్మీదేవీకి కుంకుమ, పసుపు సమర్పించాలి. దీంతో సంపదల దేవత అనుగ్రహం లభించి ఆర్థిక సమస్యలు తొలగిపోతాయి. సంపద సృష్టి అవకాశాలు లభిస్తాయి. ఆర్థికంగా బలోపేతం అవుతారు.

* అక్షయ తృతీయ నాడు ఇంటి ప్రధాన ద్వారానికి మామిడి లేదా అశోక ఆకులతో తోరణం కట్టాలి. ఇది ఇంట్లోకి అదృష్టం, సానుకూల శక్తిని తెస్తుంది. ఇంట్లో ఉండే ప్రతికూల శక్తి నశిస్తుంది. సంపదలు, శ్రేయస్సు పెరుగుతాయి.

* అక్షయ తృతీయ రోజు కొనుగోలు చేసిన బంగారు ఆభరణాలు లేదా బంగారు నాణేలను ఉత్తరం దిశలో ఉంచాలి. మరుసటి రోజు వాటిని తీసుకుని భద్రంగా దాచుకోవాలి. ఇలా చేయడం వల్ల లక్ష్మీదేవి ఆశీస్సులు లభిస్తాయి. ఇంట్లోకి సానుకూల శక్తి ప్రవహిస్తుంది. సంపద, శ్రేయస్సు కలుగుతాయి.

* అక్షయ తృతీయ రోజును చాలా పవిత్రమైనదిగా పరిగణిస్తారు. ఈ పండగ రోజు నిర్దిష్టమైన శుభ సమయాన్ని పాటించకుండా ఎప్పుడైనా పనులు ప్రారంభించవచ్చు. వివాహానికి అనుకూలమైన తేదీ లేకపోతే అక్షయ తృతీయ రోజున వివాహం చేసుకోవచ్చు. ఫలితంగా లక్ష్మీదేవీ ఆశీస్సులు లభించి వైవాహిక జీవితం ఆనందంగా సాగుతుంది.

* జ్యోతిష్యశాస్త్రం ప్రకారం.. అక్షయ తృతీయ నాడు గజకేసరి యోగం, ధన యోగం, శుక్రాదిత్య యోగం, షష యోగం, మాళవ్య రాజయోగం, సుకర్మ యోగం వంటి ఆరు శుభ యోగాలు ఏర్పడతాయి. ఈ యోగాల సమయంలో పనులు ప్రారంభిస్తే ధనలక్ష్మీ ఆశీస్సులు లభించి కొన్ని ప్రత్యేక ప్రయోజనాలు సిద్ధిస్తాయి.

* గజకేసరి యోగంతో ధనలాభం, శ్రేయస్సు, విజయ అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ధనయోగంలో వ్యాపారులకు మంచి జరుగుతుంది. వ్యాపార వృద్ధికి అవకాశాలు ఏర్పడతాయి.

* శుక్రాదిత్య యోగంతో ప్రేమ, బంధాలు, వైవాహిక జీవితం సంతోషంగా ఉంటుంది. షష యోగంతో సమాజంలో గౌరవ, ప్రతిష్టలు పెరుగుతాయి. మాళవ్య రాజయోగంతో ఆకస్మిక ధనలాభం కలుగుతుంది. కొత్తగా ఆస్తులు కొనుగోలు చేయడానికి అవకాశాలు ఉంటాయి. సుకర్మ యోగంలో శుభకార్యాలను నిర్వహిస్తే శుభపద్రం.

2024-04-25T12:32:35Z dg43tfdfdgfd