ఆ రెండు కాంగ్రెస్ పథకాలను ప్రశంసించిన గులాబీ బాస్ కేసీఆర్..!

KCR on Congress Schemes: తెలంగాణలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వంపై బీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు (Kalvakuntla Chandrashekar Rao) కీలక వ్యాఖ్యలు చేశారు. అయితే.. ప్రస్తుత రేవంత్ రెడ్డి సర్కార్.. బీఆర్ఎస్ పార్టీపై అడ్డగోలుగా ఆరోపణలు చేస్తున్నారని తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. దేవుళ్ల మీద ఒట్లు.. కేసీఆర్ మీద తిట్లు అన్న విధానం తెలంగాణలో నడుస్తోందని చెప్పుకొచ్చారు. తనను తగ్గించాలనే ప్రయత్నం సాగుతుందన్నారు. తెలంగాణలో కేసీఆర్ ఆనవాళ్లు లేకుండా చేద్దామని స్వయంగా సీఎం రేవంత్ రెడ్డే.. అసెంబ్లీ సాక్షిగా చెప్పటం ఆందోళనకరమని కేసీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు.

అయితే.. అధికారం ఇచ్చింది కేసీఆర్‌‌ను తిట్టడానికి కాదని.. ప్రజలకు సమర్థవంతమైన పాలన అందించడానికి అని కేసీఆర్ చెప్పుకొచ్చారు. అధికారంలోకి వచ్చిన తర్వాత.. తమ పథకాల్లో చాలా వాటిని ఆపేశారని కేసీఆర్ గుర్తు చేశారు. సమర్థవంతమైన నాయకుడు.. గత ప్రభుత్వంలో అమలు చేసిన పథకాలను ఆపేయడని.. వాటిని మరింత ఆకర్షణీయంగా ప్రజలకు అందించేలా కృషి చేస్తాడని కేసీఆర్ వివరించారు. ఈ క్రమంలోనే.. తాను అధికారంలోకి వచ్చిన కొత్తలో.. కాంగ్రెస్ అమలు చేసిన పాత పథకాలను తాను కంటిన్యూ చేశానని కేసీఆర్ వివరించారు.

అందులో ఒకటి ఆరోగ్య శ్రీ కాగా.. ఇంకోటి విధ్యార్థులకు అందించే ఫీజు రియంబర్స్ మెంట్ పథకమని కేసీఆర్ గుర్తు చేశారు. అధికారంలోకి రాగానే.. రాష్ట్రంలో అమలవుతున్న పథకాల గురించి అధికారులతో చర్చించినప్పుడు.. దివంగత సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి ప్రవేశపెట్టిన ఆరోగ్య శ్రీ పథకం గురించి అధికారులు గొప్పగా చెప్పినప్పుడు.. దాన్ని కంటిన్యూ చేయాలని.. ఇంకా మిగితా రోగాలను కూడా అందులో చేర్చాలని కూడా ఆదేశించినట్టు వివరించారు. మరోవైపు.. విద్యార్థులకు అందించే ఫీజు రియంబర్స్ మెంట్ పథకాన్ని కూడా వైఎస్ రాజశేఖర్ రెడ్డే ప్రవేశపెట్టారని.. దాన్ని కూడా అమలు చేయాని అధికారులకు సూచించానని తెలిపారు.

ఆ రెండు పథకాలను ప్రవేశపెట్టి అమలు చేసింది కూడా కాంగ్రెస్ ప్రభుత్వమేనని.. కానీ వాటి ప్రాముఖ్యత, ప్రాధాన్యతను అర్థం చేసుకుని మరింత ఉన్నతంగా వాటిని అమలు చేసేలా చర్యలు తీసుకున్నామని కేసీఆర్ వివరించారు. కానీ.. ఇప్పుడున్న ప్రభుత్వం.. కేసీఆర్ నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టును, మిషన్ భగీరథ పథకాన్ని వాడటం లేదంటూ కేసీఆర్ అసహనం వ్యక్తం చేశారు.

ఇటువంటి మరిన్ని వార్తలు సమయం తెలుగులో చదవండి. లేటెస్ట్ వార్తలు, సిటీ వార్తలు, జాతీయ వార్తలు, బిజినెస్ వార్తలు, క్రీడా వార్తలు, రాశిఫలాలు ఇంకా లైఫ్‌స్టైల్ అప్‌డేట్లు మొదలగునవి తెలుసుకోండి. వీడియోలను TimesXP లో చూడండి.

2024-04-23T18:10:23Z dg43tfdfdgfd