ఆశ్రమంలో చదువుకుంటూ టాప్ మార్కులతో రాణించిన విద్యార్థులు

అమ్మ అంటే మెరిసే మేఘం, కురిసే వాన నాన్న అంటే నీలాకాశం తలవంచెన అంటూ ఒక కవి వివరించిన కవిత్వంలో ఉన్న అర్ధానికి ఆమడ దూరంలో ఏరోజైన తమ తల్లిదండ్రులు వచ్చి పలకరించకపోతారా అనే కలలకి దగ్గరగా ఉంటాయి వీరి జీవితాలు చిన్నతనంలోనే తల్లిదండ్రులను కోల్పోయి విధి ఆడే వింత నాటకంలో వీరి భవిష్యత్తుకు మార్గాలు ఇక కష్టమే అనుకున్న సందర్భాల్లో నుండి ఇటీవల విడుదలైన ఇంటర్మీడియట్ ఫలితాల్లో మంచి మార్కులు సాధించి తమ తలరాతను తామే రాయగలం అని నిరూపిస్తున్న విద్యార్థులపై ఈ రోజు లోకల్18 ప్రత్యేక కథనం.

పెద్దపెల్లి జిల్లా రామగుండం ప్రాంతంలో 13 ఏళ్ల క్రితం తబిత ఆశ్రమాన్ని నెలకొల్పారు వీరేందర్ నాయక్. ఈయన చదువుకుంటున్న రోజుల్లో నుండి సేవా కార్యక్రమాలు చేస్తూ ఉద్యోగం చేసే సమయంలో నుండి కూడా తన జీతం నుండి వచ్చే కొంత డబ్బులు పేద విద్యార్థుల కోసం ఖర్చు చేసే వారు. అలా కొద్ది రోజుల తర్వాత ఆశ్రమాన్ని నెలకొల్పి తద్వారా అనాథ పిల్లలకు చేయూతనిచ్చి వారి బంగారు భవిష్యత్తుకు తోడుగా నిలవాలని సంకల్పించాడు వీరేందర్. తబిత ఆశ్రమాన్ని నెలకొల్పి తల్లిదండ్రులను కోల్పోయిన చిన్నారులను చేరదీసి చదివిస్తూ వారిని ఉన్నత స్థాయిలో నెలకొల్పడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నారు.

బస్సులో తిరుపతి టూర్... తిరుమలలో శ్రీవారి శీఘ్రదర్శనం ఉచితం

ఇక ఇటీవల విడుదలైన ఇంటర్మీడియట్ ఫలితాల్లో మంచి మార్కులు సాధించిన విద్యార్థులు తమ చిన్ననాటి నుండే ఆశ్రమంలోనే ఉంటూ వీరేందర్ చెప్పిన మాటలు వింటూ అటు విద్య చెప్పే ఉపాధ్యాయుల బాటలో నడుస్తూ మంచి మార్కులు సాధించి స్థానికులచే మరియు కళాశాల ఉపాధ్యాయులచే శభాష్ అనిపిస్తున్నారు. తల్లిదండ్రులకు దూరమై చిన్న వయసు నుండే ఆశ్రమంలో ఉంటూ ప్రభుత్వ కాలేజీలో చదువుకుంటూ బైపిసిలో 954 మార్కులతో ఉత్తీర్ణత సాధించింది సంధ్య అనే అమ్మాయి. అలాగే మొదటి సంవత్సరంలో 500 మార్కులకు గాను 454 మార్కులు సాధించింది మరో అమ్మాయి. వీరు మంచి మార్కులు సాధించడం పట్ల ఉపాధ్యాయులు, ఆశ్రమ నిర్వాహకులు ఆనందాన్ని వ్యక్తం చేశారు.

Srisailam AC Bus: శ్రీశైలం వెళ్లేవారికి శుభవార్త... ఏసీ బస్సులు నడుపుతున్న ఆర్‌టీసీ... ఛార్జీ ఎంతంటే

విద్యార్థులు లోకల్ 18 తో మాట్లాడుతూ అమ్మ నాన్నలను కోల్పోయిన మమ్మల్ని అయిన వారేచేరదీయలేదు. అప్పుడప్పుడు గుర్తొస్తే బాధగా ఉంటుంది. అలాంటి పరిస్థితుల్లో నుండి మమ్మల్ని చేరదీసి ఆశ్రమంలో చోటు కల్పించి మా భవిష్యత్తుకు సక్రమమైన బాటలు వేస్తూ మాకు జీవిత పాఠాలు నేర్పిస్తూ ప్రతిరోజు సమాజంలో మేము ఎలా గెలవాలి అనే విషయాలు నేర్పించడం వల్లే మేము మంచి గుర్తింపు తెచ్చుకోగలుగుతున్నామని విద్యార్థులు తెలిపారు భవిష్యత్తులో అనుకున్న గమ్యానికి చేరి ఆశ్రమ రుణం తీర్చుకునే దిశగా అడుగులు వేస్తామని విద్యార్థులు భావోద్వేగానికి గురవుతూ లోకల్ 18 తో తెలిపారు.

2024-04-26T08:51:10Z dg43tfdfdgfd