కాంగ్రెస్ లీడర్ నాగయ్య గుండెపోటుతో మృతి .. నివాళులర్పించిన ఎమ్మెల్యేలు

కాంగ్రెస్ లీడర్ నాగయ్య గుండెపోటుతో మృతి .. నివాళులర్పించిన ఎమ్మెల్యేలు

  • నివాళులర్పించిన ఎమ్మెల్యేలు గడ్డం వినోద్, వివేక్ వెంకటస్వామి, ప్రేమ్ సాగర్ రావు

బెల్లంపల్లి, వెలుగు: కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు, పీసీసీ వైస్ ప్రెసిడెంట్ తాటిపాముల నాగయ్య (81) గుండెపోటుతో మృతి చెందారు. కొద్ది రోజులుగా బెల్లంపల్లి టౌన్​లోని బాబు క్యాంపులో గల తన ఇంట్లో ఉంటున్న నాగయ్యకు మంగళవారం అర్ధరాత్రి ఒంటిగంట ప్రాంతంలో గుండెపోటు వచ్చింది. వెంటనే కుటుంబ సభ్యులు మంచిర్యాలలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు.

 అయితే, ఆయన అప్పటికే మృతి చెందారని డాక్టర్లు నిర్ధారించారు. నాగయ్యకు భార్య, ముగ్గురు పిల్లలున్నారు. 1984లో బెల్లంపల్లి టౌన్​ డెవలప్​మెంట్ కోసం పట్టణ అభివృద్ధి కమిటీని ఏర్పాటు చేయడంలో నాగయ్య కీలకపాత్ర పోషించారు. కమిటీ ప్రధాన కార్యదర్శిగా కూడా పనిచేశారు. 1969లో జరిగిన తెలంగాణ తొలిదశ  ఉద్యమంలో బెల్లంపల్లి నుంచి ముఖ్య భూమిక పోషించారు. 

నాగయ్య మృతి కాంగ్రెస్ పార్టీకి తీరని లోటు

నాగయ్య మృతి కాంగ్రెస్ పార్టీకి తీరని లోటని బెల్లంపల్లి, చెన్నూర్, మంచిర్యాల ఎమ్మెల్యేలు గడ్డం వినోద్, వివేక్ వెంకటస్వామి, కొక్కిరాల ప్రేంసాగర్ రావు అన్నారు. నాగయ్య మృతి విషయం తెలియగానే వారితో పాటు మాజీ ఎమ్మెల్సీ బి. వెంకట్రావు నాగయ్య ఇంటికి వెళ్లి ఆయన పార్థివ దేహానికి నివాళులర్పించారు. ఆయన కుటుంబ సభ్యులకు సంతాపాన్ని తెలిపారు.

©️ VIL Media Pvt Ltd.

2024-04-24T04:28:19Z dg43tfdfdgfd