కేరళలో ముగిసిన ఎన్నికల ప్రచారం.. 26న పోలింగ్

కేరళలో ముగిసిన ఎన్నికల ప్రచారం.. 26న పోలింగ్

కేరళలో ఏప్రిల్ 24వ తేదీ బుధవారం సాయంత్రంతో ఎన్నికల ప్రచారం ముగిసింది.  ఇప్పటివరకు నియోజకవర్గాల వారీగా సభలు, సమావేశాలతో దద్దరిల్లిన కేరళలో ఇప్పుడు మైకులు మూగబోయాయి.  సాయంత్రం ఆరు గంటలకు ప్రచార పర్వం ముగియడంతో  సోషల్ మీడియా లోనూ ఎలాంటి ప్రచారం చేయొద్దంటూ ఎన్నికల  ప్రధాన అధికారి సంజయ్ కౌల్ తెలిపారు.   కాంగ్రెస్, బీజేపీ, సీపీఎంలకు చెందిన కీలక నేతలు కేరళ ప్రచారంలో చురుగ్గా పాల్గొన్నారు.

ప్రచారం చివరి రోజున  తిరువనంతపురంలోని నెయ్యట్టింకర వద్ద బీజేపీ, ఎల్‌డీఎఫ్‌ కార్యకర్తల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. ఎన్నికల ప్రచారం జోరుగా సాగుతున్న నేపథ్యంలో యూడీఎఫ్ కార్యకర్తలు మావెలిక్కర వద్ద పోలీసులతో ఘర్షణకు దిగారు.  అల్లర్లను నివారించడానికి, పోలీసులు వడక్కర, కల్పేటలో UDF, LDF, NDA కోసం మూడు వేర్వేరు స్థానాలను కేటాయించారు.  

కాగా కాగా, కేరళలో 20 లోక్‌సభ నియోజకవర్గాలకు ఏప్రిల్ 26న ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు ఎన్నికలు జరగనున్నాయి. ఓట్ల లెక్కింపు జూన్ 4న జరగనుంది.  20 స్థానాలకు మొత్తం 194 మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు.  2019 లోక్‌సభ ఎన్నికల్లో మొత్తం 20 స్థానాలకు గాను UDF 19 స్థానాలను గెలుచుకోగా, LDF కేవలం ఒక్క సీటుతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది

  ©️ VIL Media Pvt Ltd.

2024-04-24T15:30:05Z dg43tfdfdgfd