చిన్న పరిశ్రమలకు మరిన్ని లోన్లు

చిన్న పరిశ్రమలకు మరిన్ని లోన్లు

న్యూఢిల్లీ: సూక్ష్మ, చిన్న  మధ్యతరహా పరిశ్రమలలో (ఎంఎస్​ఎంఈ) ఈక్విటీ పెట్టుబడులను పెంచడానికి  కేంద్రం ప్రయత్నాలను ప్రారంభించింది. ముఖ్యంగా వీటికి అసంఘటిత రంగంలో ఫైనాన్సింగ్ అవకాశాలను పెంచడానికి మార్గాలను వెతుకుతోంది. ఢిల్లీలో సోమవారం జరిగిన సమావేశంలో కేంద్ర ఎంఎస్​ఎంఈల మంత్రిత్వ శాఖ, ఆర్థిక మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని ఆర్థిక సేవల విభాగం  ఎంఎస్​ఎంఈలకు ప్రాతినిధ్యం వహిస్తున్న పరిశ్రమల సంస్థలు ఈ అంశాలపై చర్చించాయి.   రాబోయే కొద్ది రోజుల్లో సిఫార్సులు  సూచనలతో ముందుకు రావాలని పరిశ్రమ వాటాదారులను కోరారు. 

ఎస్​ఆర్​ఐ ఫండ్ (సెల్ఫ్ రిలయంట్​ ఇండియా) ద్వారా ఎంఎస్​ఎంఈల ఈక్విటీ ఫైనాన్సింగ్‌‌‌‌‌‌‌‌ను మరింతగా పెంచడం,  అసంఘటిత రంగాలలో వ్యాపారాలకు ఫైనాన్సింగ్‌‌‌‌‌‌‌‌ను పెంచడంపై సమావేశంలో చర్చించామని అధికారులు చెప్పారు.  ఎస్​ఆర్​ఐ ఫండ్​ 2020లో రూ.50 వేల కోట్ల కార్పస్‌‌‌‌‌‌‌‌తో ప్రారంభమయింది. అందులో రూ.10,006 కోట్లు కేంద్రం నుంచి,  మిగిలినవి ప్రైవేట్ క్యాపిటల్ లేదా వెంచర్ క్యాపిటల్ ఫండ్స్ నుంచి వస్తాయి. గత మూడేళ్ళలో 425 ఎంఎస్​ఎంఈలకు సుమారు రూ.7,593 కోట్ల పెట్టుబడులు వచ్చాయని ఎంఎస్​ఎంఈల మంత్రిత్వ శాఖ గత నెలలో ట్వీట్ చేసింది. అదనంగా, 51 డాటర్ ఫండ్స్​ను  ఎన్​ఎస్​ఐసీ వెంచర్ క్యాపిటల్ ఫండ్స్ కింద ఎంపిక చేశారు.   

©️ VIL Media Pvt Ltd.

2024-04-24T01:27:54Z dg43tfdfdgfd