తెల్లారితే చాలు అక్కడికే పరుగులు పెడుతున్న జనం.. కారణం ఏమిటంటే !

విశాఖపట్నంలో చికెన్, మటన్ కంటే సముద్ర చేపలు ఎక్కువగా అందుబాటులో వుండటంతో ఎక్కువగా నగరవాసులు వీటినే కొనుగోలు చేస్తున్నారు. హార్బర్ నుండి వ్యాపారస్తులు చేపలు తీసుకువెళ్లి జిల్లా అంతటా అమ్మకాలు చేస్తూ వుంటారు. రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వుల మేరకు సముద్రంలో చేపల వేటను తాత్కాలికంగా నిషేధించారు. సముద్రంలో మొత్తం 61 రోజులు వేట నిషేధం. అయితే వేట నిషేధం పూర్తిగా అమలులోకి రావడం తో విశాఖలో సముద్ర చేప ఒక్కటి కనిపించని పరిస్థితి ఉంది.

ఇలా విశాఖ సముద్రపు చేపలు తమకు దూరం కావడంతో ఇక స్థానిక చెరువు చేపలలో ప్రజలు వేటాడడం మొదలుపెట్టారు. దీంతో చెరువు చేపకు మంచి డిమాడ్ పెరిగింది. సముద్రపు చేపలు లేకపోవడంతో చాలా వరకు అమ్మకాలు జోరుగా సాగుతున్నాయని చెరువు చేపల వ్యాపారస్తుడు శ్రీను అన్నారు. చెరువు చేప విక్రయాలతో మంచి లాభాలు కూడా వస్తున్నాయన్నారు. సముద్రపు చేపలు రాకపోవడంతో చెరువుల వద్ద జోరుగా చేపల విక్రయాలు సాగుతుండగా.. చేపలను కొనుగోలు చేసేందుకు ప్రజలు సైతం ఉదయాన్నే చెరువుల బాట పట్టారు.

మీ దాహం తీరలేదా.. ఈ పండు తినేస్తే చాలట.. మీలో హుషారే

ఇలా చెరువుల వద్ద ఉన్న మత్స్యకారులలో ఆనందం పెరిగింది. గతంలో స్థానికంగా చెరువులలో చేపలు వున్నప్పటికీ విశాఖ హార్బర్ నుండి దిగుమతి చేసుకొన్న చేపలను ఐస్‌ బాక్సులలో నిల్వ ఉంచి విక్రయించేవారు. సముద్రపు చేపల పై వున్న మక్కువతో మాంస ప్రియులు వీటిని కొనుగోలు చేసేవారు. పైగా వాటి ధరలూ ఎక్కువ గానే ఉండేవి. కానీ ఇప్పుడు చెరువు చేపలు తక్కువ ధరకు లభిస్తుండడంతో ప్రజలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

ఇక్కడ చిన్నారుల కేకలు ఫుల్.. పెద్దలు మాత్రం సైలెంట్.. ఎందుకంటే !

కిలో రూ. 150ల చొప్పున విక్రయిస్తుండగా, అక్కడే చేపలను శుభ్రపరిచే వారు సైతం ఉపాధి పొందుతున్నారు. ఈ చెరువులలో రవ్వ, బొచ్చు, కొర్రమీను, బంగారు చేపలు లభిస్తుండగా ప్రజలు వీటిని కొనుగోలు చేస్తూ.. సముద్రంలో వేట నిషేధం ఎత్తివేత వరకు చేపల కోసం చెరువుల బాట తప్పదని వారు తెలుపుతున్నారు. ఏది ఏమైనా చెరువు చేప రుచి కూడా టేస్టీగా ఉండడంతో, విశాఖ సమీపంలోని అన్ని గ్రామాలలో గల చెరువుల వద్ద కొనుగోలుదారుల సందడి నెలకొంది.

2024-04-26T12:21:50Z dg43tfdfdgfd