నూతన హంగులతో ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్న శివాజీ పార్క్

విశాఖ నగరంలో సుందర సాగర తీరంతో పాటు ఎన్నో ఉద్యానవనాలు ఉన్నాయి. అందులో కుటుంబ సభ్యులు , పిల్లలతో గడిపేందుకు సుందర పార్కులు అనేకం ఉన్నాయి.
అందులో ఒకటి అద్భుతమైన ఉద్యానవనం శివాజీ పార్క్. విశాఖ చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలు శివాజీ పార్క్ కి అధిక సంఖ్యలో సందర్శకులు వస్తుంటారు. వీకెండ్ సమయాల్లో , సమ్మర్ సెలవుల్లో ఈ శివాజీ పార్క్ మరింత సందడిగా కనిపిస్తోంది.
నూతన హంగులతో ఏర్పాటు చేసిన శివాజీ పార్క్ , వాటర్ ఫౌంటెన్ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి. మూడు రకాల వాటర్ ఫౌంటెంట్స్ , చత్రపతి శివాజీ నూతన విగ్రహం ఏర్పాటు చేసి చుట్టూ కొండల నుంచి జాలువారే జలపాతంలా తయారు చేయడం జరిగింది.
మరో ఆకర్షణగా డాల్ఫిన్స్ నోట్లో నుండి నీళ్లు రావడం చూడవచ్చు. ఈ సమ్మర్ కి కుటుంబ సభ్యులు, స్నేహితులతో కలిసి సరదాగా సమయం గడిపేందుకు ఒక చక్కని ప్రదేశం.
సాహసం, వినోదం, ఉత్సాహాన్ని అందించే ఈ శివాజీ పార్క్ కి ఒక కోటి, 53 లక్షల రూపాయలతో నూతన హంగులు జీవీఎంసీ నిధులుతో చేయడం జరిగింది. ఈ పార్క్ లో ప్రతిరోజు వందల సంఖ్యలో వాకర్స్ వ్యాయామాలు చేయడానికి మంచి వాకింగ్ ట్రాక్ వుంది. చల్లని సాయంత్రం వేళ , వేసవి లో సేదతీరేందుకు అధిక సంఖ్య లో పార్కుకి వస్తూ ఉంటారు. నూతన అభివృధి కి నిధులు కేటాయించడంతో పర్యాటకులు, స్థానిక వాకర్స్ హర్షం వ్యక్తం చేస్తున్నారు.

2024-03-29T12:46:42Z dg43tfdfdgfd