రెండో విడత పార్లమెంట్ ఎన్నికల పోలింగ్ ప్రశాంతం.. అత్యధికం, అత్యల్పం ఎక్కడంటే

Lok Sabha Polls: దేశవ్యాప్తంగా లోక్‌సభ ఎన్నికల రెండో దశ పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. శుక్రవారం 13 రాష్ట్రాల్లోని 88 స్థానాల్లో శుక్రవారం ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5గంటల వరకూ కొనసాగింది. దేశ పౌరులు తమ ఓటు హక్కును వినియోగించుకోవడంలో కొన్ని రాష్ట్రాల్లో మెగ్గు చూపారు. మరికొన్ని రాష్ట్రాల్లో ఓటు వేయడానికి నిరాకరించినట్లుగా ఆ రాష్ట్రంలో నమోదైన పోలింగ్ శాతం చూస్తే అర్ధమవుతోంది. ఈ ఎన్నికల్లో 15.88 కోట్ల మంది ఓటర్లు ఇవాళ ఓటు కలిగి ఉండగా అత్యధికంగా త్రిపురాలో పోలింగ్ నమోదైంది. ఇక్కడ 77.53శాతం పోల్ పర్సంటేజ్ నమోదైనట్లుగా ఎన్నికల కమిషన్ వెల్లడించింది. దేశంలోనే అతిపెద్ద రాష్ట్రాల్లో ఒకటైన ఉత్తర ప్రదేశ్ లో అత్యల్పంగా పోలింగ్ నమోదైంది. ఇక్కడ కేవలం 52.74శాతం ఓటింగ్ శాతం నమోదైంది. ఇక మిగిలిన రాష్ట్రాల్లో కూడా పోలైన ఓటింగ్ శాతం ఈవిధంగా ఉంది.

త్రిపురాలో అత్యధికం..

దేశ నాయకుడు ఎవరనేది తేల్చే ఎన్నికలు, కేంద్రంలో పాలన పగ్గాలు ఎవరికి అప్పగించాలో డిసైడ్ చేసే లోక్ సభ ఎన్నికల రెండో విడత పోలింగ్ దేశ వ్యాప్తంగా శుక్రవారం ప్రశాంత వాతావరణంలో ముగిశాయి. ఈసారి ఆయా రాష్ట్రాల్లో జరిగిన పోలింగ్ అత్యధికంగా త్రిపురాలో ఓటింగ్ శాతం నమోదైంది. ఇక్కడ 77.53శాతం ఓట్లు పడ్డాయి. మణిపూర్ - 78.06శాతం, పశ్చిమ బెంగాల్‌- 71.84, చత్తీస్ గడ్ -72.13, అస్సాం-70.66 సాయంత్రం 5గంటల వరకు పోలింగ్ నమోదైంది. మహారాష్ట్ర-53.51, బీహార్-53.03, మధ్యప్రదేశ్ -54.83, రాజస్థాన్-59.19 శాతం పోలింగ్ నమోదైంది. ఇక ఉత్తరప్రదేశ్ లో 52.64 శాతం మాత్రమే నమోదవడం విశేషం.

Puzzle: ఈ మ్యాథ్స్ పజిల్‌లో మిస్ అయిన నంబర్ ఏదో తెలుసా..? బుర్రకు పదును పెట్టుకోండి..!

యూపీలో అత్యల్పం..

దేశ వ్యాప్తంగా లోక్ సభ ఎన్నికలు 12రాష్ట్రాలతో పాటు కేంద్ర పాలిత ప్రాంతాల్లో పోలింగ్ సజావుగా సాగింది. కేరళలో 63.97, కర్నాటకలో 63.90, జమ్ము అండ్ కశ్మీర్ లో 67.22 శాతం పోలైంది. అయితే ఈసారి కేంద్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి రెండు జాతీయ పెద్ద పార్టీలుగా ఉన్న బీజేపీ ఎన్డీఏ కూటమిగా పోటీ చేస్తే.. కాంగ్రెస్ ఇండియా కూటమిగా ఎన్నికల బరిలోకి దిగింది. శుక్రవారం మొత్తం 88పార్లమెంటరీ నియోజకవర్గాల్లో పోలింగ్ జరిగింది. అయితే కొన్ని ప్రాంతాల్లో బంకా, మాదేపూర, కగారియా, ముంగర్ వంటి నియోజకవర్గాల్లో 6గంటల వరకు కూడా పోలింగ్ నిర్వహించారు.

---- Polls module would be displayed here ----

ఓటర్ల చేతిలో నేతల భవితవ్యం..

మొదటి విడత పోలింగ్ ఏప్రిల్ 19వ తేది నాడు 21 రాష్ట్రాల్లోని 102 లోక్ సభ నియోజకవర్గాల్లో పోలింగ్ జరిగింది. ఈసారి ఎన్నికల్లో కొత్తగా 19.34.8లక్షల మంది కొత్త ఓటర్లు తమ ఓటు హక్కును నమోదు చేసుకున్నారు. మొత్తం 7 విడతలుగా పోలింగ్ జరగనుంది. జూన్ 4న ఫలితాలు వెలుడవడనున్నాయి.

2024-04-26T14:52:09Z dg43tfdfdgfd