KCR COMMENTS: కాళేశ్వరానికి ఏ ఢోకా లేదు, భారీ ప్రాజెక్టుల్లో ఆ సమస్యలు సహజం - కేసీఆర్ కీలక వ్యాఖ్యలు

Kaleshwaram Project: కాళేశ్వరం ప్రాజెక్టుకు ఎలాంటి ఢోకా లేదని.. దానివల్ల భవిష్యత్తులో మంచి లాభాలు ఉంటాయని మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. క్షుద్ర ఆలోచనలతోనే కాళేశ్వరం ప్రాజెక్టుపై దుష్ర్పచారం చేస్తున్నారని అన్నారు. మెగా ప్రాజెక్టుల్లో కొన్ని లోపాలు ఉంటాయని.. అవి సహజమని అన్నారు. మిడ్ మానేరుపై కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఓ బ్యారేజ్ కట్టారని.. అది ఒక వాన కురిస్తే కొట్టుకుపోయిందని అన్నారు. అలాంటప్పుడు తాము దాన్ని రాద్ధాంతం చేయలేదని అన్నారు.

మొన్న గంగా నదిపై కడుతుంటే బ్రిడ్జి కూలిపోయిందని.. అమెరికాలో హోవర్ డ్యామ్ కూడా కూలిపోయిందని కేసీఆర్ గుర్తు చేశారు. ఇలా మహానదులపై కట్టే ప్రాజెక్టులు భారీగా ఉంటాయి కాబట్టి.. చాలా సమస్యలు వస్తుంటాయని అన్నారు. వాటిని పరిష్కరించుకొని ముందుకు పోవాలని అన్నారు. అలాంటి క్రమంలోనే మేడిగడ్డ బ్యారేజీ విషయంలో కూడా రాఫ్ట్ ఫౌండేషన్ కదిలిందని అన్నారు. మూతిలో 32 పళ్లు ఉంటాయి. ఒక్క పన్నుకు ఇబ్బంది వస్తే మిగతా పళ్లను నాశనం చేసుకుంటామా? అని కేసీఆర్ అన్నారు.

‘‘కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ బ్యారేజీలోని ఏడో బ్లాక్ లో 11 పిల్లర్లు ఉన్నాయి. దాంట్లో రెండో మూడో క్రాక్ ఉన్నాయి. ఆ బ్లాక్ మొత్తానికి సింగిల్ రాఫ్ట్ ఉంటుంది. మొత్తం రాఫ్ట్ తీసేసి కొత్త రాఫ్ట్ కట్టినా రూ.400 కోట్లే అవుతుంది. మీరు ఆ చేయకపోయినా మీ పరువు పోతుంది. కేసీఆర్ ను బద్నాం చేయాలని దాన్ని వదిలేసినా.. ఆ ఒక్క రాఫ్ట్ మాత్రమే పోతుంది. మిగతాది అంతా అలాగే ఉంటుంది. కేసీఆర్ ఆనవాళ్లు తీసేస్తామని ముఖ్యమంత్రి అంటున్నాడు. అది మూర్ఖత్వానికి పరాకాష్ఠ అవుతుంది’’ అని కేసీఆర్ అన్నారు.

2024-04-23T16:18:13Z dg43tfdfdgfd