ఇవి రాజ్యాంగాన్ని రక్షించే ఎన్నికలు : రాహుల్ గాంధీ

ఇవి రాజ్యాంగాన్ని రక్షించే ఎన్నికలు : రాహుల్ గాంధీ

  • కాంగ్రెస్ కార్యకర్తలంతా గట్టిగా పోరాడాలె
  • పార్టీ క్యాడర్ కు రాహుల్ గాంధీ పిలుపు 

కన్నూర్/న్యూఢిల్లీ:  బీజేపీ విధానాలు, పాలసీలను విమర్శిస్తున్నందుకు కొన్ని మీడియా సంస్థలు తనను దూషిస్తున్నాయని కాంగ్రెస్ మాజీ ఛీప్ రాహుల్ గాంధీ ఆరోపించారు. గురువారం కన్నూర్ లో ఎన్నికల ర్యాలీని ఉద్దేశించి ఆయన మాట్లాడారు. బీజేపీ దేశంలో అశాంతిని సృష్టిస్తోందని, లక్షలాది మంది ప్రజలకు హాని కలిగిస్తోందని విమర్శించారు. దేశంలోని వైవిధ్యాన్ని మార్చేందుకు బీజేపీ ప్రయత్నిస్తోందని మండిపడ్డారు. 

ఈ ఎన్నికలు భారత రాజ్యాంగం, మన దేశ ప్రజాస్వామ్య నిర్మాణానికి సంబంధించినవని వెల్లడించారు. బ్యూరోక్రసీ, జ్యుడిషరీ సిస్టమ్, ఎలక్షన్ కమిషన్, పోలీసులు, సీబీఐ, ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్, ఇతర సంస్థలు భారత రాజ్యాంగాన్ని, భారత పౌరుల హక్కులను పరిరక్షించేవిగా ఉండాలని పేర్కొన్నారు. ఈడీ, సీబీఐలను రాజకీయ అస్త్రాలుగా ఉపయోగించుకోవడం ద్వారా బీజేపీ మన దేశ స్వభావాన్నే మార్చేందుకు ప్రయత్నిస్తోందని వివరించారు. 

ఈ ఎన్నికలు సాధారణమైనవి కావు.. 

రాబోయే లోక్ సభ ఎన్నికలు సాధారణమైనవి కాదని, రాజ్యాంగాన్ని రక్షించే ఎన్నికలని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ తెలిపారు గురువారం ఆయన ఓ వీడియో సందేశాన్ని విడుదల చేశారు. కాంగ్రెస్ కార్యకర్తలపై పెద్ద బాధ్యత ఉందని చెప్పారు. భారత్ అనే ఐడియాకు బీజేపీ, ఆర్ఎస్ఎస్ వ్యతిరేకమని పేర్కొన్నారు. అవి మన రాజ్యాంగంపై, దేశ ప్రజాస్వామ్య నిర్మాణంపై, ఎన్నికల కమిషన్ తో సహా ఇతర సంస్థలపై  దాడి చేస్తున్నాయని ఆరోపించారు. కాంగ్రెస్ కార్యకర్తలందరూ వీధుల్లో, గ్రామాల్లో ఆర్ఎస్ఎస్ భావజాలానికి వ్యతిరేకంగా పోరాడాలని పిలుపునిచ్చారు. 

©️ VIL Media Pvt Ltd.

2024-04-19T03:15:42Z dg43tfdfdgfd