గుడ్ న్యూస్: CBSEలో ఏడాదికి రెండుసార్లు బోర్డు పరీక్షలు

గుడ్ న్యూస్: CBSEలో ఏడాదికి రెండుసార్లు బోర్డు పరీక్షలు

CBSE 10వ తరగతి పరీక్షలను ఏడాదికి రెండు సార్లు నిర్వహించేందుకు సెంట్రల్ బోర్డు ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ సన్నాహాలు చేస్తోంది. CBSE 10వ, 12 తరగతి పరీక్ష లను 2024-25 విద్యాసంవత్సరంలో రెండు దశలుగా నిర్వహించనున్నట్లు గతంలోనే ప్రకటించింది. తాజాగా మరోసారి ఈ విషయం శుక్రవారం (ఏప్రిల్ 26) తెరమీదికి వచ్చింది. ఇదేగనక జరిగితే CBSE సాంప్రదాయ వార్షిక పరీక్ష ఫార్మాట్ నుంచి గణనీయమైన మార్పు జరుగుతుంది. విద్యార్థులకు సబ్జెక్టుల అవగాహన, మంచి ఫలితాలు సాధించడానికి మరిన్ని అవకాశాలు లభిస్తాయని కేంద్రం భావిస్తోంది. 

ఏడాదికి రెండుసార్లు పరీక్షల విధానాన్ని ఇంప్లిమెంట్ చేసేందుకు సన్నాహాలు చేస్తోంది. సీబీఎస్ఈతోపాటు పాఠశాలల ప్రధానోపాధ్యాయులతో విద్యామంత్రిత్వశాఖ సమావేశం కానుంది. ఎగ్జామ్ నిర్వహణ సాధ్యాసాధ్యాలపై చర్చిస్తోంది.

విద్యార్థుల్లో పరీక్షల ఒత్తిడి తగ్గించేందుకే ఈ విధానాన్ని ప్రవేశపెట్టామని కేంద్ర విద్యాశాఖ చెబుతోంది. ఏడాదికి ఒక్కసారే పరీక్ష రాసే అవకాశం ఉంటే ఎక్కడ తప్పుతా మోననే భయం పిల్లల్లో ఉంటోందని.. దాని వలన పరీక్షలు సరిగ్గా రాయలేకపోతున్నారని..అందుకే ఈ విధానాన్ని ఎంచుకున్నామని తెలిపారు.దాంతో పాటు రెండు స్లారు పరీక్షలు రాయడం వలన విద్యార్థులు పూర్తి స్థాయిలో ప్రిపేర్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. దాని వలన వారికి స్కోర్ కూడా ఎక్కువ వస్తుంది. అదే మొదటి సారిలోనే మంచి మార్కులు వస్తే రెండోసారి రాయనక్కర్లేదు కూడా. దీని వలల ఏడాది మొత్తం ఒత్తిడి కూడా ఉండదు అని చెబుతున్నారు. 

సీబీఎస్ ఈ (CBSE)  10వ, 12 తరగతుల పరీక్షలు రాయలేని జాతీయ , అంతర్జాతీయ స్పోర్ట్స్ ఈవెంట్స్, అంతర్జాతీయ ఒలింపియాడ్ లలో పాల్గొన్న విద్యార్థుల కోసం సీబీఎస్ ఈ బోర్డు ప్రత్యేక పరీక్షలను నిర్వహించాలని కూడా కేంద్ర విద్యాశాఖ నిర్ణయం తీసుకుంది. అయితే ఇది కేవలం రాత పరీక్షలకు మాత్రమే వర్తిస్తుంది. కంపార్ట్ మెంట్, ప్రాక్టికల్స్ కు ప్రత్యేకంగా పరీక్షలను మాత్రం అందరితో కలిపే రాయాల్సి ఉంటుంది.  క్రీడలు, ఎడ్యుకుేషన్ పోటీల్లో పాల్గొనేలా యువతను ప్రోత్సహించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు బోర్డు అధికారులు చెప్పారు. 

©️ VIL Media Pvt Ltd.

2024-04-26T14:37:40Z dg43tfdfdgfd