నేడు హనుమాన్ జయంతి.. శోభాయాత్ర సందర్భంగా ట్రాఫిక్ ఆంక్షలు.. ఏ రూట్లలో అంటే..

లోక్‌సభ ఎన్నికలు వస్తున్న సమయంలో.. ఎన్నికల కోడ్ అమల్లో ఉన్న సందర్భం.. ఇలాంటి సమయంలో ఏప్రిల్ 23న హనుమానం జయంతి సందర్భంగా.. హైదరాబాద్‌లో శోభాయాత్ర జరగబోతోంది. ఈ విజయ యాత్రలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలూ జరగకుండా, పూర్తి ప్రశాంత వాతావరణంలో ఇది జరిగేలా హైదరాబాద్ పోలీసులు.. పూర్తి జాగ్రత్తలు తీసుకుంటున్నారు. అలాగే.. కొన్ని రూట్లలో ట్రాఫిక్ ఆంక్షలు విధిస్తున్నట్లు హైదరాబాద్ సీపీ శ్రీనివాస రెడ్డి తెలిపారు.

23-4-2024న ఈ రూట్లలో శోభాయాత్ర:

ఉదయం 11.30కి శోభాయాత్ర గౌలిగూడ రామ మందిరం నుంచి ప్రారంభమవుతుంది. అది అది సికింద్రాబాద్‌లోని తాడ్‌బండ్ హనుమాన్ మందిర్‌కి వెళ్తుంది. ఈ శోభాయాత్ర గౌలిగూడ రామ మందిరం, పుత్లీబౌలీ క్రాస్ రోడ్స్, ఆంధ్రబ్యాంక్ క్రాస్ రోడ్స్, కోటి, డీఎం అండ్ హెచ్ఎస్, సుల్తాన్ బజార్ క్రాస్ రోడ్స్, రామకోటి క్రాస్ రోడ్స్, కాచీగూడ క్రాస్ రోడ్స్, నారాయణగూడ YMCA, చిక్కడపల్లి క్రాస్ రోడ్స్, RTC క్రాస్ రోడ్స్, అశోక్ నగర్, గాంధీనగర్, వైశ్రాయ్ హోటల్ వెనకవైపు, ప్రాగా టూల్స్, కవాడీగూడ, CGO టవర్స్, బన్సీలాల్ పేట్ రోడ్, బైబిల్ హౌస్, సిటీ లైట్ హోటల్, బాటా షోరూమ్, ఉజ్జయినీ మహంకాళి టెంపుల్, ఓల్డ్ రాంగోపాలపేట్ పీఎస్, ప్యారడైజ్ క్రాస్ రోడ్స్, CTO జంక్షన్, లీ రాయల్ ప్యాలెస్, బ్రూక్ బాండ్, ఇంపెరియల్ గార్డెన్, మస్తాన్ కేఫ్, తాడ్ బండ్ హనుమాన్ ఆలయం దగ్గర లెఫ్ట్ టర్న్ దిశగా ఈ శోభాయాత్ర సాగుతుంది. ఇది మొత్తం 12 కిలోమీటర్లు ఉంటుంది. ఈ యాత్ర రాత్రి 8 గంటలకు ముగుస్తుంది.

మరో శోభాయాత్ర రాచకొండ కమిషనరేట్ పరిధిలో కర్మన్‌ఘాట్ హనుమాన్ ఆలయం నుంచి మొదలై.. చంపాపేట దగ్గర హైదరాబాద్‌లోకి ఎంటర్ అవుతుంది. ఇది చంపాపేట క్రాస్ రోడ్, IS సదన్, ధోబీఘాట్, సైదాబాద్ Y జంక్షన్, (DCP సౌత్ ఈస్ట్ జోన్ ఆఫీస్), సైదాబాద్ కాలనీ రోడ్, శంకేశ్వర్ బజార్ గుండా సాగుతూ.. రాచకొండలోకి ఎంటర్ అవుతుంది. ఇది సరూర్ నగర్ లిమిట్స్ దగ్గర తిరిగి హైదరాబాద్ లోకి ఎంటరై.. రాజీవ్ గాంధీ స్టాట్యూ, దిల్‌సుఖ్ నగర్ గుండా సాగుతూ.. మూసారంబాగ్ జంక్షన్, మలక్ పేట్, నల్గొండ క్రాస్ రోడ్, అంజంపురా రోటరీ, చందేర్ ఘాట్ క్రాస్ రోడ్ గుండా సాగుతూ.. DM అండ్ HS ఉమెన్స్ జంక్షన్ దగ్గర.. శోభాయాత్రతో కలుస్తుంది. ఇది మొత్తం 10.8 కిలోమీటర్లు ఉంటుంది.

ఈ కింది రూట్ల రద్దు లేదా దారిమళ్లింపులు:

1. సుల్తాన్ బజార్:

గౌలిగూడలోని రామమందిర్ దగ్గర.. శంకర్ షేర్ హోటల్ దగ్గర డైవర్షన్ ఉంది. అఫ్జల్ గంజ్ నుంచి వచ్చేవారిని గౌలిగూడ చమన్ వైపు వెళ్లనివ్వరు. వారిని శంకర్ షేర్ హోటల్ గుండా.. SA బజార్, బడేమియా పెట్రోల్ బంక్ వైపు మళ్లిస్తారు. అలాగే.. రామమందిరం వైపు వెళ్లేవారిని.. గౌలిగూడ చమాన్ నుంచి లాల్‌బాగ్ లోని BSNL లేన్ వైపు మళ్లిస్తారు.

2. సుల్తాన్ బజార్:

శోభాయాత్ర పుత్లీబౌలీ క్రాస్ రోడ్‌కి వచ్చినప్పుడు.. ట్రాఫిక్‌ని రంగ మహల్ వైపు మళ్లిస్తారు. చందేర్ ఘాట్ నుంచి వచ్చేవారిని ఎంజే మార్కెట్ వైపు వెళ్లనివ్వరు. వారిని రంగమహల్ క్రాస్ రోడ్స్ వైపు మళ్లిస్తారు. అలాగే.. జీపీఓ అబిడ్స్ నుంచి వచ్చేవారిని బ్యాంక్ స్ట్రీట్ వైపు వెళ్లనివ్వరు. వారిని జీపీఓ అబిడ్స్ నుంచి ఎంజే మార్కెట్ వైపు మళ్లిస్తారు. ఎంజే మార్కెట్ నుంచి వచ్చేవారిని... యూసుఫియన్ కంపెనీ నుంచి జీపీఓ అబిడ్స్ వైపు మళ్లిస్తారు. సుల్తాన్ బజార్ క్రాస్ రోడ్ నుంచి వచ్చేవారిని.. ఆంధ్రాబ్యాంక్ వైపు పంపించి.. డీఎం అండ్ హెచ్‌ఎస్ దగ్గర డైవర్ట్ చేసి.. చందేర్‌ఘాట్ వైపు పంపిస్తారు. చందేర్‌ఘాట్ నుంచి వచ్చేవారిని ఆంధ్రాబ్యాంక్, పుత్లీబౌలి వైపు అనుమతించరు. వారిని డీఎం అండ్ హెచ్ఎస్ వైపుగా, సుల్తాన్ బజార్ క్రాస్ రోడ్ వైపు పంపిస్తారు.

3. సుల్తాన్ బజార్:

చాదర్‌ఘాట్ నుండి వచ్చే ట్రాఫిక్ DM&HS వైపు అనుమతించరు. చాదర్‌ఘాట్‌ ఎక్స్‌ రోడ్డు వద్ద నింబోలియాడ్డ, రంగమహల్‌ వైపు మళ్లిస్తారు.

4. సుల్తాన్ బజార్:

కాచిగూడ ఎక్స్ రోడ్డు నుండి వచ్చే ట్రాఫిక్‌ను సుత్లాన్ వైపు అనుమతించరు. బజార్ ఎక్స్ రోడ్స్, కాచిగూడ ఎక్స్ రోడ్ వద్ద టూరిస్ట్ హోటల్, YMCA వైపు మళ్లిస్తారు.

5. సుల్తాన్ బజార్:

బొగ్గులకుంట ఎక్స్‌రోడ్డు నుంచి వచ్చే ట్రాఫిక్‌ను అనుమతించరు. వారిని రాంకోటి X రోడ్డు, బొగ్గులకుంట X రోడ్డు వద్ద కింగ్ కోటి వైపు మళ్లిస్తారు.

ఈడెన్ గార్డెన్ నుంచి వచ్చే ట్రాఫిక్ రాంకోటి X రోడ్డు వైపు అనుమతించరు. వారిని ఈడెన్ గార్డెన్ వద్ద కింగ్ కోటి వైపు మళ్లిస్తారు.

6. కాచిగూడ:

కాచిగూడ రైల్వే స్టేషన్ నుంతి, ఇతర మార్గాల ద్వారా వచ్చే ట్రాఫిక్‌ను కాచిగూడ ఎక్స్‌రోడ్డు వైపు అనుమతించరు. లింగంపల్లి ఎక్స్‌రోడ్డు వద్ద బర్కత్‌పురా పోస్టాఫీసు రోడ్డు, చప్పల్ బజార్ వైపు మళ్లిస్తారు.

YMCA నుంచి వచ్చే ట్రాఫిక్‌ను కాచిగూడ X రోడ్స్ వైపు అనుమతించరు. YMCA వద్ద బర్కత్‌పురా పోస్ట్ ఆఫీస్ వైపు మళ్లిస్తారు.

7. నారాయణగూడ:

షాలిమార్ థియేటర్ రోడ్డు నుంచి వచ్చే ట్రాఫిక్‌ను రాజ్‌మొహల్లా వైపు అనుమతించరు, షాలిమార్ వద్ద ఈడెన్ గార్డెన్స్ వైపు మళ్లిస్తారు.

8. నారాయణగూడ:

స్మశానవాటిక నుంచి విట్టల్‌వాడి ఎక్స్‌రోడ్డు మీదుగా వచ్చే ట్రాఫిక్‌ను YMCA వైపు అనుమతించరు. వాటర్ ట్యాంక్ వద్ద మెల్కోటే పార్క్ వైపు మళ్లిస్తారు.

బర్కత్‌పురా నుంచి వచ్చే ట్రాఫిక్‌ను YMCA వైపు అనుమతించరు. బర్కత్‌పురా పోస్టాఫీసు వద్ద క్రౌన్ కేఫ్ వైపు మళ్లిస్తారు.

9. నారాయణగూడ:

హిమాయత్ నగర్ వై జంక్షన్ నుంచి వచ్చే ట్రాఫిక్ నారాయణగూడ ఎక్స్ రోడ్ వైపు అనుమతించరు. ఫ్లై ఓవర్ మీదుగా క్రౌన్ కేఫ్ వైపు మళ్లిస్తారు.

క్రౌన్ కేఫ్ నుండి వచ్చే ట్రాఫిక్ నారాయణగూడ ఎక్స్ రోడ్ వైపు అనుమతించరు. నారాయణగూడ ఫ్లైఓవర్ మీదుగా మళ్లిస్తారు.

10. చిక్కడపల్లి:

ముషీరాబాద్‌ ఎక్స్‌ రోడ్డు నుంచి వచ్చే ట్రాఫిక్‌ను ఆర్టీసీ ఎక్స్‌ రోడ్డు వైపు అనుమతించరు, మెట్రో కేఫ్‌ వద్ద రాంనగర్‌ ఫిష్‌ మార్కెట్‌ రోడ్డు వైపు మళ్లిస్తారు.

హిందీ మహా విద్యాలయం నుండి వచ్చే ట్రాఫిక్‌ను RTC X రోడ్స్ వైపు అనుమతించరు, VST వద్ద బాగ్ లింగంపల్లి వైపు మళ్లిస్తారు.

ఇందిరాపార్క్ ఎక్స్ రోడ్ నుంచి వచ్చే ట్రాఫిక్‌ను ఆర్టీసీ ఎక్స్ రోడ్ వైపు అనుమతించరు, ఇందిరాపార్క్ ఎక్స్ రోడ్ వద్ద ధర్నా చౌక్ వైపు మళ్లిస్తారు.

11. చిక్కడపల్లి:

గాంధీనగర్ టి జంక్షన్ నుండి వచ్చే ట్రాఫిక్‌ను అశోక్ నగర్ ఎక్స్ రోడ్ వైపు అనుమతించరు, లోయర్ ట్యాంక్ బండ్ వైపు మళ్లిస్తారు.

స్ట్రీట్ నెం.9, హిమాయత్ నగర్ నుండి వచ్చే ట్రాఫిక్ అశోక్ నగర్ ఎక్స్ రోడ్ వైపు అనుమతించరు. నారాయణగూడ ఫ్లైఓవర్ వైపు మళ్లిస్తారు.

12. చిక్కడపల్లి:

కవాడిగూడ ఎక్స్‌రోడ్డు నుంచి గాంధీ నగర్‌ టి జూనియం వైపు వచ్చే ట్రాఫిక్‌ను అనుమతించరు. సెయిలింగ్ క్లబ్ వైపు మళ్లిస్తారు.

ముషీరాబాద్ ఎక్స్ రోడ్డు నుంచి వచ్చే ట్రాఫిక్‌ను కవాడిగూడ వైపు అనుమతించరు, మెట్రో కేఫ్ మీదుగా ఆర్టీసీ ఎక్స్ రోడ్డు వైపు మళ్లిస్తారు.

ధోబీఘాట్ నుండి వచ్చే ట్రాఫిక్ గాంధీ నగర్ టి జంక్షన్ వైపు అనుమతించరు, చిల్డ్రన్స్ పార్క్ వైపు మళ్లిస్తారు.

సెయిలింగ్ క్లబ్ నుండి డిబిఆర్ మిల్ మీదుగా గాంధీ నగర్ టి జంక్షన్ వైపు వచ్చే ట్రాఫిక్‌ను ధోబీఘాట్ వైపు మళ్లిస్తారు.

13. చిక్కడపల్లి:

బైబిల్ హౌస్ నుండి వచ్చే ట్రాఫిక్ కవాడిగూడ ఎక్స్ రోడ్ వైపు అనుమతించరు, కర్బలా మైదాన్ వైపు మళ్లిస్తారు.

కర్బలా మైదాన్ నుండి వచ్చే ట్రాఫిక్‌ను కవాడిగూడ ఎక్స్‌రోడ్ వైపు అనుమతించరు, చిల్డ్రన్ పార్క్ వైపు మళ్లిస్తారు.

14. చిక్కడపల్లి:

బైబిల్ హౌస్ నుండి వచ్చే ట్రాఫిక్ CGO టవర్స్ వైపు అనుమతించరు, బైబిల్ హౌస్ వద్ద కర్బలా వైపు మళ్లిస్తారు.

కర్బలా మైదాన్ నుండి బైబిల్ హౌస్ వైపు వచ్చే ట్రాఫిక్ RP రోడ్ వైపు అనుమతించరు. కర్బలా మైదాన్ వద్ద రాణిగంజ్, ప్యారడైజ్, పాట్నీ వైపు మళ్లి్స్తారు.

15. మహంకాళి:

కవాడిగూడ నుండి బైబిల్ హౌస్ వైపు వచ్చే ట్రాఫిక్ అనుమతించరు. కవాడిగూడ వద్ద సెయిలింగ్ క్లబ్ వైపు మళ్లిస్తారు.

పాట్నీ నుండి వచ్చే ట్రాఫిక్ బైబిల్ హౌస్ వైపు అనుమతించరు. ప్యాట్నీ వద్ద ప్యారడైజ్ వైపు మళ్లిస్తారు.

16. మహంకాళి:

రాణిగంజ్ నుండి రోచా బజార్ వైపు వచ్చే ట్రాఫిక్ అనుమతించరు, రాణిగంజ్ వద్ద మినిస్టర్స్ రోడ్డు వైపు మళ్లిస్తారు.

CTO నుండి రోచా బజార్ వైపు వచ్చే ట్రాఫిక్ అనుమతించరు, CTO వద్ద SBI వైపు మళ్లిస్తారు.

17. బేగంపేట:

బేగంపేట నుండి CTO వైపు వచ్చే ట్రాఫిక్ అనుమతించరు. రెండు వైపులా CTO ఫ్లైఓవర్ వైపు మళ్లిస్తారు.

బోవెన్‌పల్లి, తాడ్‌బండ్, బాలామ్రాయ్ నుండి CTO వైపు వచ్చే ట్రాఫిక్ ని బాలమ్రాయ్ వద్ద బ్రూక్‌బాండ్, టివోలి వైపు మళ్లిస్తారు.

18. బేగంపేట:

బేగంపేట నుండి CTO వైపు వచ్చే ట్రాఫిక్ అనుమతించరు. రెండు వైపులా CTO ఫ్లైఓవర్ వైపు మళ్లిస్తారు.

సుచిత్ర నుండి CTO వైపు వచ్చే ట్రాఫిక్ సేఫ్ ఎక్స్‌ప్రెస్‌లో బాపూజీ నగర్, బోవెన్‌పల్లి మార్కెట్, త్రిముల్‌గేరీ ఎక్స్ రోడ్, JBS వైపు మళ్లిస్తారు.

బాలానగర్‌ నుంచి తాడ్‌బండ్‌ వైపు వచ్చే ట్రాఫిక్‌ను బోవెన్‌పల్లి ఎక్స్‌ రోడ్డు వద్ద సేఫ్‌ ఎక్స్‌ప్రెస్‌ వైపు, సేఫ్‌ ఎక్స్‌ప్రెస్‌ నుంచి వచ్చే ట్రాఫిక్‌ను బాలానగర్‌ వైపు మళ్లిస్తారు.

19. మారేడ్‌పల్లి:

టివోలి థియేటర్ నుండి బ్రూక్ బాండ్ వైపు వచ్చే ట్రాఫిక్ అనుమతించరు. టివోలి వద్ద త్రిముల్‌గేరీ వైపు మళ్లిస్తారు.

బోవెన్‌పల్లి మార్కెట్, బాపూజీ నగర్ నుంచి వచ్చే ట్రాఫిక్‌ను డైమండ్ పాయింట్ వద్ద నార్నే ఎస్టేట్, జేబీఎస్ వైపు మళ్లిస్తారు.

19. బోయినపల్లి:

బోయినపల్లి మార్కెట్ నుండి డైమండ్ పాయింట్ వైపు వచ్చే ట్రాఫిక్‌ను అనుమతించరు, బోయినపల్లి మార్కెట్ వద్ద త్రిముల్‌గేరి వైపు మళ్లిస్తారు.

బ్రూక్ బాండ్, సిక్కు గ్రామం నుండి వచ్చే ట్రాఫిక్ అనుమతించరు. మస్తాన్ కేఫ్ వద్ద బాపూజీ నగర్ వైపు మళ్లిస్తారు.

ఇవాళ హనుమాన్ జయంతి.. శోభాయాత్ర సందర్భంగా ట్రాఫిక్ ఆంక్షలు

ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 2 వరకూ:

లక్డీకాపూల్ నుండి కోటి, బ్యాంక్ స్ట్రీట్ & చాదర్‌ఘాట్ మీదుగా దిల్‌సుఖ్‌నగర్ లేదా సౌత్ జోన్ వైపు వెళ్లాలనుకునే ప్రయాణికులు బషీర్‌బాగ్, ఓల్డ్ ఎమ్మెల్యే క్వార్టర్స్, హిమాయత్‌నగర్ వై జంక్షన్, నారాయణగూడ ఫ్లై ఓవర్, బర్కత్‌పురా, టూరిస్ట్ జంక్షన్, నింబోలియాడ్డ, చాదర్‌ఘాట్, కాజ్‌వే, నల్గొండ X రోడ్లు మీదుగా వెళ్లాలని సూచించారు.

దిల్‌సుఖ్ నగర్ నుంచి కోటి మీదుగా మెహదీపట్నం వైపు వెళ్లే ప్రయాణికులు, డీఎంఅండ్‌హెచ్‌ఎస్‌ మీదుగా ఎల్‌బీ నగర్, ఉప్పల్, తార్నాక, సికింద్రాబాద్ లేదా ఎల్‌బీ నగర్, చాంద్రాయణగుట్ట, ఆరంఘర్, అత్తాపూర్, మెహదీపట్నం మీదుగా వెళ్లాలని సూచించారు.

మధ్యాహ్నం 3 నుంచి రాత్రి 7 వరకూ:

లక్డీకపూల్ నుండి సికింద్రాబాద్ స్టేషన్ లేదా ఉప్పల్ వైపు వచ్చే ప్రయాణికులు వివి విగ్రహం, సోమాజిగూడ, గ్రీన్‌లాండ్స్, బేగంపేట్ ఫ్లై ఓవర్, ప్రకాష్‌నగర్ ఫ్లై ఓవర్, ప్యారడైజ్ ఫ్లైఓవర్ మీదుగా, అక్కడ దిగిన తర్వాత ఎడమవైపు JBS లేదా సెకండ్‌బాద్ స్టేషన్‌కు వెళ్లవచ్చు. ఉప్పల్‌కి వెళ్లాలంటే నేరుగా సెయింట్ జాన్ రోటరీ వైపు వెళ్లవచ్చు.

పైన చెప్పిన మార్గాల్లో శోభాయాత్ర వచ్చినప్పుడు ఆంక్షలు అమలులో ఉంటాయి. అందువల్ల ప్రయాణికులు.. శోభాయాత్ర వచ్చే సమయాలను దృష్టిలో ఉంచుకోవాలి. ఏదైనా డౌట్ ఉంటే, హైదరాబాద్ ట్రాఫిక్ కంట్రోల్ రూమ్ (040 2785 2482), ట్రాఫిక్ హెల్ప్ లైన్ (9010203626)కి కాల్ చేసి కనుక్కోవచ్చు.

2024-04-22T09:06:24Z dg43tfdfdgfd