కేటీఆర్‌పై ఆరోపణలు.. మంత్రి కొండా సురేఖకు ఈసీ స్వీట్ వార్నింగ్..!

Election Commission: తెలంగాణలో ఎన్నికల హడావుడి ఊపందుకుంది. ప్రధాన పార్టీల నేతలంతా రంగంలోకి దిగి ప్రచారంలో జోరు పెంచారు. ఈ క్రమంలోనే.. అధికార ప్రతిపక్ష నేతల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. ప్రస్తుతం తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తున్న నేపథ్యంలో.. ఇందులో బీఆర్ఎస్ నేతల ప్రమేయం ఉందంటూ కాంగ్రెస్ నేతలు పదే పదే ఆరోపిస్తున్నారు. అందులోనూ మాజీ మంత్రి కేటీఆర్ పేరును కూడా ప్రస్తావించారు. దీంతో.. కేటీఆర్ ఈ విషయాన్ని సీరియస్‌గా తీసుకుని తనపై ఆరోపణలు చేస్తున్న వారిపై ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. అయితే.. ఆ ఆరోపణలు చేసినవారిలో రాష్ట్ర దేవాదాయ, పర్యావరణ, అటవీ శాఖ మంత్రి కొండా సురేఖ కూడా ఉండటం గమనార్హం. కేటీఆర్ ఇచ్చిన ఫిర్యాదుపై స్పందించిన ఈసీ.. మంత్రి కొండా సురేఖను సున్నితంగా హెచ్చరించింది.

ఎన్నికల వేళ జాగ్రత్తగా వ్యవహరించాలని కొండా సురేఖను ఈసీ హెచ్చరించింది. కాగా.. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈ నెల 1వ తేదీన వరంగల్‌లో మాట్లాడిన కొండా సురేఖ కేటీఆర్‌పై తీవ్ర విమర్శలు చేశారు. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో.. కేటీఆర్ ప్రమేయం ఉందంటూ కీలక ఆరోపణలు చేశారు. దీంతో.. సురేఖ వ్యాఖ్యలపై బీఆర్ఎస్ నేతలు.. ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. బీఆర్ఎస్ నేతల ఫిర్యాదు మేరకు సురేఖ వ్యాఖ్యలను పరిశీలించిన ఈసీ.. తాజాగా ఆమెకు నోటీసులు జారీ చేసింది.

కేటీఆర్‌పై కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలను ఈ సందర్భంగా కేంద్ర ఎన్నికల సంఘం తప్పుబట్టింది. ప్రత్యర్థులపై ఆరోపణలు చేసేటప్పుడు బాధ్యతగా వ్యవహరించాలని సూచించింది. స్టార్ క్యాంపెయినర్‌గా అందులోనూ మంత్రిగా ఉన్న నేపథ్యంలో మరింత బాధ్యతగా ఉండాలని కొండా సురేఖకు ఈసీ స్వీట్ వార్నింగ్ ఇచ్చింది.

ఇటువంటి మరిన్ని వార్తలు సమయం తెలుగులో చదవండి. లేటెస్ట్ వార్తలు, సిటీ వార్తలు, జాతీయ వార్తలు, బిజినెస్ వార్తలు, క్రీడా వార్తలు, రాశిఫలాలు ఇంకా లైఫ్‌స్టైల్ అప్‌డేట్లు మొదలగునవి తెలుసుకోండి. వీడియోలను TimesXP లో చూడండి.

2024-04-26T16:59:06Z dg43tfdfdgfd