IRCTC: ఐఆర్‌సీటీసీ ఆధ్యాత్మిక యాత్ర.. ఏడు జ్యోతిర్లింగాల దర్శనానికి స్పెషల్ టూర్ ప్యాకేజీ

IRCTC: సమ్మర్‌లో ఆధ్యాత్మిక టూర్ ప్లాన్ చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు గుడ్‌న్యూస్. ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ (IRCTC) ఏడు జ్యోతిర్లింగాలు దర్శించుకునేలా కొత్త టూర్ ప్యాకేజీని ప్రకటించింది. భారత్ గౌరవ్ AC టూరిస్ట్ రైలులో ప్రయాణం ఉంటుంది. ఏడు జ్యోతిర్లింగ యాత్ర మే 22న ప్రారంభం కానుంది. టూర్ మొత్తం 11 రాత్రులు/12 పగలు ఉంటుంది. ప్యాకేజీ కోడ్- NZBG35. ప్యాకేజీలో భాగంగా యాత్రికులకు వనతి, భోజనం సదుపాయం ఐఆర్‌సీటీసీ కల్పిస్తుంది. ఉదయం టీ, టిఫిన్, మధ్యాహ్నం భోజనం, రాత్రి భోజనం ఉంటుంది. భోజనంలో శాకాహారం మాత్రమే ఉంటుంది.

* కవర్ అయ్యే గమ్యస్థానాలు

ఐఆర్‌సీటీసీ జ్యోతిర్లింగ యాత్రలో భాగంగా ఓంకారేశ్వరం, మహాకాళేశ్వరం, సోమనాథ్ ఆలయం, ద్వారకాధీష్ ఆలయం & నాగేశ్వర్ జ్యోతిర్లింగ, ద్వారకా త్రయంబకేశ్వర్, ఘృష్ణేశ్వర్ జ్యోతిర్లింగ, భీమశంకర్ జ్యోతిర్లింగాలను దర్శించుకోవాల్సి ఉంటుంది. IRCTC జ్యోతిర్లింగ యాత్ర కోసం బుకింగ్ చేసుకునేవారు భారత్ గౌరవ్ AC టూరిస్ట్ రైలులో స్లీపర్ క్లాస్, థర్డ్ AC, సెకండ్ ACలో ప్రయాణం చేయవచ్చు. వాటిలో నచ్చిన కేటగిరీని ఎంపిక చేసుకోవచ్చు. అందుకు తగ్గట్టు ఛార్జీ వసూలు చేస్తారు.

Special Yoga: ఈ 6 రాశుల వారికి గోల్డెన్ డేస్ వచ్చేశాయ్.. ఇక వెనక్కి చూసుకోవాల్సిన పని లేదు

* టికెట్ ధరలు

భారత్ గౌరవ్ AC టూరిస్ట్ రైలులో 2ఏసీ ప్రయాణానికి ఒక్కో టికెట్ ధర(డబుల్/ట్రిపుల్ షేరింగ్) రూ.48,600. 5-11 ఏళ్ల చిన్నారులైతే రూ.46,700 చెల్లించాలి. 3ఏసీలో ప్రయాణానికి (డబుల్/ట్రిపుల్ షేరింగ్) టికెట్ ధర రూ.36,700 కాగా, 5-11 ఏళ్ల చిన్నారులైతే రూ.35,150 చెల్లించాలి. స్లీపర్ క్లాస్‌లో ప్రయాణానికి ఒక్కో టికెట్(డబుల్/ట్రిపుల్ షేరింగ్) ధర రూ.22,150. 5-11 ఏళ్ల చిన్నారులైతే రూ. 20,800 చెల్లించాల్సి ఉంటుంది.

---- Polls module would be displayed here ----

* ఎక్కే, దిగే స్టేషన్లు

ఐఆర్‌సీటీసీ ఏడు జ్యోతిర్లింగ టూర్ ప్యాకేజీలో భాగంగా యోగ్ నగరి రిషికేశ్, హరిద్వార్, మొరాదాబాద్, బరేలీ, షాజహాన్‌పూర్, హర్దోయ్, లక్నో, కాన్పూర్, ORAI, విరంగన లక్ష్మీబాయి, లలిత్‌పూర్ జంక్షన్‌ రైల్వే స్టేషన్లలో టూరిస్ట్‌లు రైలు ఎక్కవచ్చు. తిరుగు ప్రయాణంలో ఇవే స్టేషన్లలో దిగిపోవచ్చు. టూరిస్ట్‌లకు ఐఆర్‌సీటీసీ ప్రయాణ బీమాను కల్పిస్తుంది. టూర్ ఎస్కార్ట్స్ సర్వీస్ కూడా ఉంటుంది. IRCTC టూర్ మేనేజర్లు యాత్రికులకు అవసరమైన గైడెన్స్ ఇస్తారు.

* ప్రయాణ వివరాలు

మే 22 ఉదయం యోగ్‌నగరి రిషికేష్‌లో రైలు బయలుదేరుతుంది. హరిద్వార్, మొరదాబాద్, బరేలీ, షాజహాన్‌పూర్, హర్దోయ్, లక్నో, కాన్పూర్, ORAI, విరంగన లక్ష్మీబాయి, లలిత్‌పూర్ జంక్షన్‌ రైల్వే స్టేషన్లలో టూరిస్ట్‌లను ఎక్కించుకుని ప్రయాణాన్ని కొనసాగిస్తుంది.

*రెండో రోడు జర్నీ ..

రెండో రోజు అంటే మే 23న ఉదయం రైలు ఉజ్జయిని చేరుకుంటుంది. అక్కడ హోటల్‌లో బ్రేక్‌ఫాస్ట్ చేసిన తరువాత మహాకాళేశ్వర దేవాలయం, కాల భైరవుడు, భర్తారి గుహ, శక్తి పీఠం, మంగళ మందిరం దర్శనం ఉంటుంది. రాత్రి ఉజ్జయినిలో బస ఉంటుంది.

మూడో రోజు సాయంత్రం ఉజ్జయిని నుంచి బయలుదేరి రైలు నాలుగో రోజు మధ్యాహ్నానికి ద్వారకకు చేరుకుంటుంది. ద్వారకలో రాత్రి బస చేయాలి.

*5రోజు ఇలా..

ఐదో రోజు హోటల్‌లో బ్రేక్‌ఫాస్ట్ చేసిన తరువాత ద్వారకాధీష్ ఆలయం & నాగేశ్వర్ జ్యోతిర్లింగ దర్శనం, రుక్మిణి ఆలయం, బెట్ ద్వారక, సిగ్నేచర్ బ్రిడ్జ్ సందర్శన ఉంటుంది. అదే రోజు సాయంత్రం రైలు ద్వారక నుంచి సోమనాథ్‌కు బయలుదేరుతుంది.

సోమనాథ్ జ్యోతిర్లింగ దర్శనం, అక్కడి నుంచి నాసిక్ రోడ్‌ అక్కడ త్రంబకేశ్వర్ జ్యోతిర్లింగ దర్శనం ఉంటుంది.

ఆ తరువాత రైలు ఖడ్కి బయలుదేరుతుంది. అక్కడ బీమాశకంర్ జ్యోతిర్లింగ దర్శనం ఉంటుంది.

ఖడ్కి నుంచి రైలు ఔరంగాబాద్ వెళ్తుతుంది. అక్కడ ఘృష్ణేశ్వర్ జ్యోతిర్లింగ దర్శనం ఉంటుంది.

ఔరంగాబాద్ నుంచి రైలు ఖహండ్వా చేరుకుంటుంది. అక్కడ ఓంకారేశ్వర్ దేవాలయం దర్శనం ఉంటుంది. దీంతో టూర్ ఎండ్ అవుతుంది. అక్కడ నుంచి రైలు తిరుగు ప్రయాణం అవుతుంది.

2024-04-26T12:51:44Z dg43tfdfdgfd