తెలంగాణ భవన్లో కేసీఆర్ బస్సు యాత్ర ప్రారంభం

తెలంగాణ భవన్లో కేసీఆర్ బస్సు యాత్ర ప్రారంభం

తెలంగాణ భవన్ లో బస్సు యాత్రను ప్రారంభించారు మాజీ సీఎం, గులాబీ బాస్ కేసీఆర్. తెలంగాణ తల్లి విగ్రహానికి నివాళి అర్పించాక యాత్రను మొదలుపెట్టారు. బస్సు ఎక్కి కార్యకర్తలకు అభివాదం చేశారు కేసీఆర్‌.  హైదరాబాద్ నుంచి భారీ కాన్వాయ్ తో మిర్యాలగూడకు బయలుదేరారు కేసీఆర్. కేసీఆర్‌కు మంగళహారతులతో స్వాగతం పలికారు మహిళలు.  బాణాసంచా కాల్చి సంబరాలు చేసుకున్నారు బీఆర్ఎస్ కార్యకర్తలు.  

సాయంత్రం 5.30 కు మిర్యాలగూడలో బస్సుయాత్రలో ప్రచారం చేయనున్నారు.  17 రోజుల పాటు బస్సు యాత్రలో 12 నియోజకవర్గాల్లో ప్రచారం చేయనున్నారు. కేసీఆర్ బస్సుతో పాటు 25 వెహికిల్స్ కు మాత్రమే ఈసీ అనుమతించింది.  సూర్యాపేట రోడ్ షో అనంతరం కేసీఆర్ అక్కడే బస చేస్తారు.  గురువారం భువనగిరికి చేరుకొని, సాయంత్రం రోడ్‌షో నిర్వహిస్తారు. అనంతరం ఎర్రవెల్లికి వెళ్లి అక్కడే బస చేస్తారు. 

Also Read:సీఎం రేవంత్ సవాల్ ను స్వీకరించిన హరీశ్ రావు

ప్రతి పార్లమెంట్‌ నియోజకవర్గ పరిధిలో 3-4 అసెంబ్లీ సెగ్మెంట్​లలో రోడ్‌ షోలు నిర్వహించనున్నారు కేసీఆర్.  ఉదయం 8 నుంచి 10, తిరిగి సాయంత్రం 5 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు రోడ్‌షోలు ఉంటాయి. బస్సుయాత్రలు చేస్తూనే మధ్యలో  సిద్దిపేట్, వరంగల్ వంటి ప్రాంతాల్లో బహిరంగ సభల్లో కూడా పాల్గొంటారు. 

©️ VIL Media Pvt Ltd.

2024-04-24T09:29:06Z dg43tfdfdgfd