మరోసారి అంతరిక్ష యాత్రకు సునీత విలియమ్స్

మరోసారి అంతరిక్ష యాత్రకు సునీత విలియమ్స్

సునీత ఎల్. విలియమ్స్..ప్రఖ్యాత నాసా అంతరిక్ష వ్యోమగామి మరోసారి అంతరిక్ష యాత్రకు సిద్దమవుతున్నారు. ఇప్పటికే రెండు సార్లు అంతరిక్ష యాత్ర చేసిన సునీత విలియమ్స్..మూడోసారి అంతరిక్ష యాత్రకు శిక్షణ పొందుతున్నారు. మే 6న సాయంత్రం 10.34 ని మిషాలకు NASA  వ్యోమగాములు బచ్ విల్మోర్, సునీత విలియమ్స్ బోయింగ్ స్టార్ లైనర్  స్పేష్ క్రాఫ్ట్ లో అంతరిక్షంలోకి వెళ్లనున్నారు. అంతరిక్షంలోని ప్రయోగశాల వద్ద డాక్ చేస్తారు. వారం రోజులు అంతర్జాతీయ అంతరిక్ష స్టేషన్ లో గడిపిన తర్వాత తిరిగి భూమికి వస్తారు. పశ్చిమ యూస్ లో ల్యాండ్ అవుతారు. 

అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ISS) అనేది  భూమి చుట్టూ తిరుగుతున్న అంతరిక్ష ప్రయోగశాల. వివిధ  దేశాల వ్యోమగాములు ఇక్కడ పరిశోధనలు, టెక్నాలజీ  ప్రయోగాలు,అంతరిక్ష పరిశోధన రంగానికి సంబంధించిన అంతర్జీతీ ప్రాజెక్టలపై పని చేశారు. 

వ్యోమగాములు బచ్ విల్మోర్, సునీత విలియమ్స్ లు అట్లాస్ V రాకెట్ లో అంతరిక్షంలోకి వెళ్లనున్నారు. భూ కక్ష్య ఉన్న లాబోరేటరీలో వారం రోజులు  ఉంటారు. నాసా ప్రయోగిస్తున్న మొదటి స్టార్ లైనర్ స్పేస్ క్రాఫ్ట్ కోసం ఈ ఇద్దరు వ్యోమగాములు భాగస్వాములవుతారని  నాసా తెలిపింది. 

వ్యోమగాములు బచ్ విల్మోర్, సునితీ విలియమ్స్ స్టార్ లైనర్ సిస్టమ్ ను పని విధానాన్ని పరీక్షిస్తారు. దీంతోపాటు అంతరిక్ష నౌక ప్రయోగం, డాకింగ్ కాపబిలిటీని టెస్ట్ చేస్తారు. క్రూయిడ్ ఫ్లైట్ టెస్ట్ విజయవంతం అయిన తర్వాత స్పేస్ స్టేషన్ కు  క్రివ్డ్ మిషన్ సిస్టమ్, స్టార్ లైనర్ సర్టిఫికేషన్ ప్రారంభిస్తుంది. 

సునీత విలియమ్స్ గత రెండు మిషన్లు 

సునిత విలియమ్స్ మొదటిసారి 2006 డిసెంబర్ 9న అంతరిక్షంలోకి వెళ్లారు. ఆమె డిసెంబర్ 11,2006న అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంతో డాక్ చేయబడిం ది.మొత్తం 14 మంది వ్యోమగాములు వెళ్లగా వారికి సునీత విలియమ్స్  ఫ్లైట్ ఇంజనీర్ గా పనిచేశారు.  ఆన్ బోర్డులో ఉన్నప్పుడు ఆమె 29 గంటల 17 నిమిషాలు స్పేస్ వాక్ చేశారు. 2007 జూన్ 22 న తిరిగి భూమికి వచ్చారు. 

2012 జూలై 14 నుంచి నవంబర్ 18 వరకు సునీత విలియమ్స్ ఖజఖస్తాన్ లోని బైకోనుూ కాస్మోడ్రోడ్ నుంచి రష్యన్ సోయూజ్ కమాండర్ యూరి మాలెంచెంకో, జపాన్ ఏరోస్పేస్ కు చెందిన ఫ్లైట్ ఇంజినీర్ అకిహికో మోషిడ్ తో కలిసి అంతరిక్షంలో మరోసారి అడుగుపెట్టారు. కక్ష్యంలోని నాలుగు నెలల పాటు ప్రయోగశాలలో పరిశోధనలు చేశారు. 50 గంటల 40 నిమిషాల స్పేస్ వాక్ చేసి మరోసారి రికార్డు సృష్టించారు. 

©️ VIL Media Pvt Ltd.

2024-04-24T17:30:25Z dg43tfdfdgfd