వైభవంగా తత్తూరు రంగనాథ స్వామి రథోత్సవం..

నంద్యాల జిల్లా నందికొట్కూరు నియోజకవర్గ పరిధిలో తత్తూరు గ్రామం నందు శ్రీశ్రీశ్రీ తత్తూరు రంగనాథ స్వామి వారి రథోత్స కార్యక్రమాన్నిఅంగరంగ వైభవంగా నిర్వహించడం జరిగింది. ఈ రథోత్సవ కార్యక్రమాన్ని తిలకించేందుకు ఉమ్మడి నంద్యాల జిల్లాల నుంచి వేలాది సంఖ్యలో భక్తాదులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. రథాన్ని చూడ ముచ్చటగా మొత్తం రకరకాల పూలతో అలకరించారు. మెుత్తం ఆ ప్రాంతమంతా ఆధ్మాత్మిక శోభను సంతరించుకుంది. స్వామి వారి నామస్మరణలతో మారుమ్రోగింది.

తత్తురు రంగనాథస్వామి వేలాది మంది భక్తాదులకు దర్శనం ఇవ్వడం జరిగింది. స్వామి అమ్మవార్లను వేలాది మంది దర్శనం చేసుకోవటం ఆనందదాయకమన్నారు. రథోత్సవం కార్యక్రమాన్నితత్తూరు గ్రామ పెద్దలు అందరూ కలిసి ఎంతో ఘనంగా నిర్వహించడం జరిగింది.

---- Polls module would be displayed here ----

సంవత్సరానికి ఒకసారి జరిగే తత్తూరు రంగనాథ స్వామి జాతరను పురస్కరించుకొని ఉమ్మడి జిల్లాల నుంచి అధిక సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. తత్తూరు గ్రామాన్ని చేరుకొని రంగనాథ స్వామిని దర్శించుకున్న తర్వాత రథోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నారు. రథోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న భక్తులు స్వామి వారు కోరిన కోరికలు తీరుస్తారని పూర్వం నుంచి వస్తున్న ఆచారం.

ఇలా తత్తూరులో జన సంద్రోహంతో తత్తూరు తిరుణాలంతా ఒక్కసారిగా అంగరంగ వైభవంగా ఉత్సవాలను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రైతన్నలు ఎక్కువగా పాల్గొని వారి మొక్కులను తీర్చుకోవడం జరిగింది. స్వామి అమ్మవార్లకు వారి నైవేద్యాన్ని ప్రసాదించడం జరిగింది . రథోత్సవ కార్యక్రమంలో మహిళలు, పురుషులు, చిన్నారులు, పెద్దలు, అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

2024-04-24T11:58:41Z dg43tfdfdgfd