KCR: సోషల్ మీడియాలోకి కేసీఆర్ ఎంట్రీ.. ఆ ఇద్దర్నే ఫాలో అవుతున్న గులాబీ బాస్..!

మాజీ సీఎం, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సోష‌ల్ మీడియాలో అడుగుపెట్టారు. ఇప్ప‌టికే ఫేస్‌బుక్ అకౌంట్ ఉన్న ఆయన.. తాజాగా 'ఎక్స్' (ట్విట‌ర్) లోకి ఎంట్రీ ఇచ్చారు. @KCRBRSpresident పేరిట కేసీఆర్ త‌న ట్విట‌ర్‌ ఖాతా ఓపెన్ చేశారు. మాజీ మంత్రి, త‌న త‌న‌యుడు కేటీఆర్‌, మాజీ ఎంపీ సంతోష్ కుమార్ ఇద్ద‌రి అకౌంట్ల‌ను మాత్ర‌మే ఆయ‌న ఫాలో అవుతున్నారు. ఇక కేసీఆర్ ఎక్స్‌లోకి ఎంట్రీ ఇచ్చిన విష‌యం తెలిసిన బీఆర్ఎస్ శ్రేణులు ఆయ‌న ఖాతాను అనుస‌రించ‌డం చేస్తున్నాయి. ట్విట్టర్‌తో పాటు.. కేసీఆర్ తన ఇన్‌స్టాగ్రామ్‌లో ఖాతా కూడా తెరిచారు. ఆయన అకౌంట్ ఓపెన్ చేసిన గంటల వ్యవధిలోనే 6521 మంది ఫాలోవర్స్ వచ్చారు. ఇక నుంచి కేసీఆర్ ఎక్స్ వేదికగా విస్తృత ప్రచారం చేయనున్నారు.

లోక్‌స‌భ ఎన్నిక‌ల నేప‌థ్యంలో కేసీఆర్ బ‌స్సు యాత్ర చేప‌ట్టి.. నియోజ‌క‌వ‌ర్గాల్లో రోడ్‌షోలు నిర్వ‌హిస్తున్న విష‌యం తెలిసిందే. ఈ యాత్ర విశేషాల‌తో పాటు రాజ‌కీయాల‌కు సంబంధించిన వివ‌రాల‌ను ఎక్స్ ఖాతాలో కేసీఆర్ ఎప్ప‌టిక‌ప్పుడు పంచుకోనున్నారు. ఇక కేసీఆర్ ఎలాంటి విష‌యాల‌ను ఎక్స్ ద్వారా పంచుకోబోతార‌నే దాని కోసం నెటిజ‌న్లు, రాజ‌కీయ వ‌ర్గాలు, ఇత‌రులు ఆస‌క్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే ఆయన ట్విట్టర్‌లోకి రాగానే.. ‘బీఆర్ఉస్ పార్టీ నాయకులకు, కార్యకర్తలకు, అభిమానులకు, తెలంగాణ రాష్ట్ర ప్రజలకు బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు ’ అని ఫస్ట్ పోస్టు చేశారు.

ఇక నుంచి ఎక్స్ వేదిక‌గా కేసీఆర్ విస్తృతంగా ప్ర‌చారం చేయ‌నున్నారు. లోక్‌స‌భ ఎన్నిక‌ల నేప‌థ్యంలో కేసీఆర్ బ‌స్సు యాత్ర చేప‌ట్టి.. ఆయా నియోజ‌క‌వ‌ర్గాల్లో రోడ్‌షోలు నిర్వ‌హిస్తున్న సంగ‌తి తెలిసిందే. ఈ యాత్ర విశేషాల‌తో పాటు రాజ‌కీయాల‌కు సంబంధించిన వివ‌రాల‌ను ఎక్స్ ఖాతాలో కేసీఆర్ ఎప్ప‌టిక‌ప్పుడు పంచుకోనున్నారు. ట్విట్టర్ ద్వారా కేసీఆర్ ఒక ట్రెండ్ సృష్టించే అవ‌కాశం ఉంద‌ని నెటిజ‌న్లు అనుకుంటున్నారు. ఎక్స్‌లో కేసీఆర్‌ను ఫాలో కావాల‌నుకునే వారు ఈ లింక్‌ను క్లిక్ చేయండి https://twitter.com/kcrbrspresident.

2024-04-27T09:10:12Z dg43tfdfdgfd