చెరువుల ఆక్రమణపై ప్రభుత్వానికి హైకోర్టు నోటీసులు..

చెరువుల ఆక్రమణపై ప్రభుత్వానికి హైకోర్టు నోటీసులు.. 

హైదరాబాద్ నగర వ్యాప్తంగా చెరువుల ఆక్రమణ అంశంపై తెలంగాణ ప్రభుత్వం, జీహెచ్ఏంసి, చెరువుల పరిరక్షణ కమిటీ అధికారులకు హైకోర్టు నోటీసులు జారీ చేసింది. హైకోర్టు జడ్జ్ ఈవీ వేణుగోపాల్ రాసిన లేఖ ఆధారంగా పిల్ దాఖలైన నేపథ్యంలో కోర్టు ఈ మేరకు నోటీసులు జారీ చేసింది. నగరంలోని పలు చెరువులు, కుంటలు ఆక్రమణకు గురి కావడం వల్ల నీటి నిల్వలు తగ్గుతున్నాయని, అంతే కాకుండా చాలా ప్రాంతాల్లో వరదలు చెరువుల ఆక్రమణ కూడా కారణమని ఆయన రాసిన లేఖలో పేర్కొన్నారు.

చెరువులు ఆక్రమణకు గురికాకుండా చూడటంలో ప్రభుత్వం విఫలం అయ్యిందని, దీని వల్ల నీటి నిల్వలు తగ్గటమే కాకుండా వాతావరణంలో మార్పులు సంభవించి పర్యావరణ సమతుల్యత దెబ్బతింటుందని పేర్కొన్నారు.గ్లోబల్ వార్మింగ్, ఎల్నినో, లానినా వంటి తీవ్రమైన సమస్యలకు కూడా దారి తీస్తుందని వేణుగోపాల్ పేర్కొన్నారు. ఈ మేరకు, దుర్గం చెరువు, సున్నం చెరువు, చిన్న దామెర చెరువు, మేడికుంట, గోసాయి కుంట, పెద్ద చెరువు, గంగారం పెద్ద చెరువు, పీర్జాయిగూడ పెద్ద చెరువు, మద్దెలకుంట, నల్ల చెరువు, అంబర్ చెరువు, చిన్న నారాయుని చెరువు, హస్మత్ పేట్ చెరువులను తక్షణమే పునరుద్దరించాలని ఆదేశించింది. 

©️ VIL Media Pvt Ltd.

2024-04-19T14:00:53Z dg43tfdfdgfd