నిర్లక్ష్యంతో జరిగే అగ్ని ప్రమాదాలే ఎక్కువ .. అవేంటో తెలుసుకోండి మరి!

వేసవి నేపథ్యంలో పట్టణాలతో పాటు గ్రామీణ ప్రాంతాల్లో కూడా అధికంగా అగ్ని ప్రమాదాలు జరిగే ఆస్కారం ఉంది. అయితే అగ్ని ప్రమాదాలు జరగకుండా ఉండాలంటే ఏం చేయాలి.. ప్రమాదాలు జరిగినప్పుడు ఎలాంటి ప్రాణనష్టాలు, ఆస్తి నష్టం జరగకుండా ఉండాలంటే ఏం చేయాలనే అంశాలపై లోకల్ 18 ప్రత్యేక కథనం మీకోసం అందిస్తోంది. రాజన్న సిరిసిల్ల జిల్లాలోని సిరిసిల్ల పట్టణంతో పాటు వేములవాడ పట్టణంలో కూడా ఫైర్ స్టేషన్ ఆధ్వర్యంలో అగ్నిమాపక వారోత్సవాలు నిర్వహించామని వేములవాడ ఫైర్ స్టేషన్ ఆఫీసర్ బి.కమలాకర్ అన్నారు. లోకల్18తో ప్రత్యేకంగా మాట్లాడుతూ.. ప్రజలందరూ అగ్ని ప్రమాదాల నివారణకు కృషి చేయాలని కోరారు. మీ మీ ప్రాంతాల్లో ఎక్కడైనా అగ్ని ప్రమాదాలు జరిగినప్పుడు విధిగా ఫైర్ స్టేషన్ కు సమాచారం ఇవ్వాలని సూచించారు. అగ్ని ప్రమాదాల నివారణకు అగ్నిమాపక శాఖ ఆధ్వర్యంలో అనేక అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నట్లు పేర్కొన్నారు.

రాజన్న సిరిసిల్ల జిల్లా వ్యాప్తంగా ఉన్న సిరిసిల్ల వేములవాడ ఫైర్ స్టేషన్ పరిధిల్లోని జనాల రద్దీ ప్రాంతాలతో పాటు ప్రధాన కూడళ్లతో పాటు పాఠశాలలు బస్టాండ్ ప్రాంతాల్లో అగ్ని ప్రమాదాల నివారణ.. ప్రమాదాలు జరిగితే ఎలా తప్పించుకోవాలనే అంశాలపై పూర్తిస్థాయిలో అవగాహన కల్పించేందుకు మాక్ డ్రిల్స్ చేస్తున్నట్లు చెప్పారు. 24 గంటలు వేములవాడ ఫైర్ స్టేషన్లో ఫైర్ సిబ్బంది అనునిత్యం అందుబాటులో ఉంటారని.. ఏ సమయంలోనైనా అగ్ని ప్రమాదాలు జరిగాయని సమాచారం అందిస్తే నిమిషాల్లో మీ ముందు ఉంటామని వారు చెబుతున్నారు.

ఇంద్రవెల్లి ఘటనకు 43 ఏళ్లు…

మరి ముఖ్యంగా గృహాలు, రైస్ మిల్స్, ఆఫీస్, షాప్స్ ల్లో అధికంగా ప్రమాదాలు జరిగే అవకాశం ఉన్న నేపథ్యంలో.. నాణ్యమైన కరెంట్ ఫిటింగ్ చేసుకోవాలని, షార్ట్ సర్క్యూట్ జరగకుండా ఉండాలంటే.. తమ తమ ఆఫీస్ ప్రాంతాల్లో, ఇండ్లలో లేని సమయంలో మెయిన్ ఆఫ్ చేసి ఉంటే ప్రమాదాలు జరిగే ఆస్కారం ఉండదని చెప్పారు. ఇండ్లలో వినియోగించే గ్యాస్ సిలిండర్ కు సంబంధించిన పైప్స్ నాణ్యమైనవి వినియోగించాలని సూచించారు.

రాష్ట్రస్థాయి ఇండియన్ టాలెంట్ ఒలింపియాడ్‌లో పారమిత విద్యార్థుల ప్రతిభ

రైతులు కూడా తమ పంట పొలాలను కోసిన తర్వాత కొయ్యకళ్ళను, గడ్డిని కాల్చే సమయంలో నిర్లక్ష్యం వహించకూడదని, కాలం నిర్లక్ష్యం వహించిన సందర్భాల్లోనే అధికంగా అగ్ని ప్రమాదాల జరిగిన సంఘటనలు ఉన్నాయని గుర్తు చేశారు. అదేవిధంగా వాహనదారులైతేనేమి, కొందరు నిర్లక్ష్యంగా ధూమపానం మద్యపానం చేసేవారు. వరి పంట పూర్తిగా ఎండి కోసే సమయానికి సిద్ధంగా ఉన్న సమయంలో పంట పొలాలు అగ్నికి ఆహుతి ఆస్కారం అధికంగా ఉంటుందని, ప్రతి ఒక్కరు నిర్లక్ష్యం వహించకుండా అగ్ని ప్రమాదాల నివారణకు కృషి చేయాలని అగ్నిమాపక సిబ్బంది కోరుతున్నారు.

2024-04-24T02:27:10Z dg43tfdfdgfd