ఘాటెక్కింది : మన మసాలాలపై అమెరికా ఫుడ్ అథారిటీ నిఘా.. వివరాల సేకరణ

ఘాటెక్కింది : మన మసాలాలపై అమెరికా ఫుడ్ అథారిటీ నిఘా.. వివరాల సేకరణ

ప్రపంచవ్యాప్తంగా భోజన ప్రియులు ఎవరంటే నిస్సందేహంగా భారతీయులు, ముఖ్యంగా మన దక్షిణ భారతీయులని చెప్పచ్చు. సౌత్ ఇండియాలో టిఫిన్స్ మొదలుకొని భోజనాలు స్నాక్స్ వరకు ఉన్నన్ని వెరైటీ ఆఫ్ ఐటమ్స్, టేస్ట్ లు బహుశా ఎక్కడా ఉండవన్నది చాలా మంది అభిప్రాయం.ఇందుకు కారణం మన దగ్గర దొరికే స్పైసెస్ అని చెప్పాలి. మన మసాలాలకు ఉన్న యూనిక్ టేస్ట్ ఇంకెక్కడా  దొరకదు. అలాంటి మన మసాలా విదేశాల్లో కూడా ఘాటు రేపుతోంది. అమెరికాలో మన బ్రాండ్ మసాలాల మీద ఫుడ్ అథారిటీ నిఘా పెట్టింది.

ఇటీవల హాంగ్ కాంగ్, సింగపూర్ లలో బ్యాన్ విధించిన సంఘటన తర్వాత అమెరికా ప్రభుత్వం ఎవరెసస్ట్ ఫిష్ కర్రీ మసాలా, ఎమ్ డీహెచ్ సాంబార్ మసాలల మీద నిఘా పెట్టింది అమెరికా ఫుడ్ అథారిటీ. ఈ బ్రాండ్స్ యొక్క మాసాలలో ఇథేలైన్ ఆక్సైడ్ ఎక్కువగా ఉండటమే కారణంగా తెలుస్తోంది. వీటిలో పరిమితికి మించి ఇథేలైన్ ఆక్సైడ్ ఉన్నట్లు అధికారులు గుర్తించారు. విదేశాలకు ఈ బ్రాండ్స్ యొక్క ఫిష్ కర్రీ మసాల, సాంబార్ మసాలాల అమ్మకాలు నిలిపివేయాలని ఆదేశించింది ప్రభుత్వం. 

©️ VIL Media Pvt Ltd.

2024-04-27T14:41:41Z dg43tfdfdgfd