Trending:


యుక్రెయిన్ వాసుల ప్రాణాలు తీస్తున్న ఉత్తర కొరియా ఆయుధాలు, అసలేం జరుగుతోంది?

లోహపు వస్తువులు, వైర్ల మధ్య, కొరియా అక్షరాలు ఉన్న ఒక చిన్న వస్తువు క్రిస్టినా కంటికి కనిపించింది. మరిన్ని వివరాలను ఇది తెలియజేస్తుందని ఆమెకు అర్థమైంది.


Lok Sabha Elections: మూడో విడతలో ఓటేసిన ప్రముఖులు.. మోదీ, షా, ఖర్గే, కేంద్రమంత్రులు, మాజీ సీఎంలు

Lok Sabha Elections: 7 దశల్లో నిర్వహిస్తున్నా లోక్‌సభ ఎన్నికల్లో మంగళవారం మూడో విడత ఎన్నికల పోలింగ్ జరుగుతోంది. ఈ క్రమంలోనే పలువురు ప్రముఖులు పోలింగ్ స్టేషన్లకు పోటెత్తారు. సామాన్య ఓటర్ల నుంచి మొదలుకుని దేశ ప్రధాని వరకు ఓటు వేసేందుకు తెల్లవారుజామునుంచే ఉత్సాహంగా పోలింగ్ బూత్‌లకు క్యూ కట్టారు. ఈ సందర్భంగా ప్రజలు పెద్ద సంఖ్యలో తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని పిలుపునిచ్చారు.


చిన్న వయస్సులో రజస్వలకు కారణాలివే!

ప్రస్తుతం చాలా మంది బాలికలు చిన్న వయస్సులోనే రజస్వల అవుతున్నారు. చిన్న వయస్సులో రజస్వల అవ్వడానికి గల కారణాలను ఇక్కడ వివరించాం.


AP EAP CET Hall Tickets: ఏపీ ఈఏపీ 2024 సెట్‌ హాల్‌ టిక్కెట్లు విడుదల చేసిన జేఎన్‌టియూ కాకినాడ

AP EAP CET Hall Tickets: ఏపీ ఈఏపీ సెట్‌ 2024 హాల్‌ టిక్కెట్లు విడుదలయ్యాయి. ఏపీ ఉన్నత విద్యామండలి నేతృత్వంలో జేఎన్‌టియూ కాకినాడ ఈ ఏడాది ఈఏపీ సెట్‌ పరీక్షల్ని నిర్వహిస్తోంది.


కొవిషీల్డ్ వ్యాక్సిన్ తో దుష్ప్రభావం

కొవిషీల్డ్ వ్యాక్సిన్ తో దుష్ప్రభావం కేంద్రం, తయారీ సంస్థ నష్టపరిహారం ఇవ్వాలి అవేకెన్​ ఇండియా మూమెంట్ ప్రతినిధుల డిమాండ్ ఖైరతాబాద్​,వెలుగు: కరోనా సమయంలో​ఎమర్జెన్సీ పేరుతో క్లినికల్​ట్రయిల్స్​ లేకుండానే కొవిషీల్డ్ వ్యాక్సిన్ కు కేంద్రం అనుమతి ఇచ్చిందని, దీంతో వ్యాక్సిన్​ వేసుకున్న వారిలో దుష్ప్రభావం ఇప్పటికీ ఉందని అవేకెన్​ ఇండియా మూమెంట్ సలహాదారు ద...


హైదరాబాద్కు మోడీ..ట్రాఫిక్ ఆంక్షలు ఎక్కడెక్కడంటే.?

హైదరాబాద్కు మోడీ..ట్రాఫిక్ ఆంక్షలు ఎక్కడెక్కడంటే.? లోక్ సభ ఎన్నికలకు పార్టీలు ప్రచారాన్ని స్పీడప్ చేశాయి. ఈ క్రమంలోనే  జాతీయ పార్టీల నేతలు తెలంగాణలో ప్రచారం చేయడానికి క్యూ కట్టారు. ప్రధాని మోదీ ఇవాళ(మే 7న) హైదరాబాద్ కు రానున్నారు.ఈ క్రమంలో  బేగంపేట్ నుంచి రాజ్ భవన్ మార్గంలో మే 7న రాత్రి , మే 8న ఉదయం వరకు ట్రాఫిక్ ఆంక్షలు విధించనున్నట్లు హైదరాబాద్ ...


చల్లబడిన వాతావరణం.. మూడు రోజుల పాటు తెలంగాణలో వర్షాలు..

చల్లబడిన వాతావరణం.. మూడు రోజుల పాటు తెలంగాణలో వర్షాలు.. తెలంగాణలోని వాతావరణం చల్లబడింది. ఎండల నుంచి ప్రజలకు కాస్త ఉపశమనం లభించింది. హైదరాబాద్ సహా పలు జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. హైదరాబాద్ లోని కొంపల్లి, నిజాంపేట్, కూకట్ పల్లి, మియాపూర్, చందానగర్, గచ్చిబౌలి, రాయదుర్గం, శే...


తిరుమల తరహాలో తిరుపతిలోనూ ఉచితంగా నిత్యాన్నదానం.. ఎక్కడెక్కడంటే?

తిరుమల శ్రీవారిని నిత్యం వేలాది మంది భక్తులు దర్శించుకుంటూ ఉంటారు. తిరుమలలో శ్రీవారి దర్శనం పూర్తైన తర్వాత శ్రీవారి అన్నప్రసాదాన్ని స్వీకరించి తరిస్తూ ఉంటారు. అలాగే శ్రీవారి పాదాల చెంత కొలువైన తిరుపతిలోని నిత్యాన్నదానం నిర్వహిస్తూ ఉన్నారు. తిరుమలలోని పలుచోట్ల యాత్రికులు, భక్తుల కోసం టీటీడీ ఆధ్వర్యంలో నిత్యాన్నదాన కార్యక్రమం జరుగుతూ ఉంది.


కామక్య ఆలయంలో బాలయ్య భామ శిల్పాశెట్టి ప్రత్యేక పూజలు..

Shilpa Shetty: శిల్పాశెట్టి.. ఈ పేరులో ఉన్నట్టుగానే శిల్పి ఉలి పట్టుకొని అందమైన శిల్పాన్ని చెక్కినట్టు ఉంటుంది శిల్పాశెట్టి శరీర సౌష్ఠవం. ఇప్పటికీ యోగాలసనాలతో అభిమానులకు టచ్‌లో ఉంటుంది. ఈ భామకు 48 యేళ్లు. అయినా చెక్కుచెదరని సౌందర్యంతో ఆకట్టుకుంటోంది ఈ మంగుళూరు భామ. తాాజాగా ఈమె తెలుగులో రీ ఎంట్రీ ఇవ్వనున్నట్టు టాలీవుడ్ వర్గాల్లో వినిపిస్తోంది. ఇక అది అలా ఉంటే నటి శిల్పాశెట్టి తాజాగా అస్సాంలోని గౌహతిలోని కామాఖ్య ఆలయంలో అక్కడి సంప్రదాయ పద్దతిలో ప్రార్థనలు చేసింది. దీనికి సంబందించిన పిక్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇక శిల్పా శెట్టి సినిమాల విషయానికి వస్తే.. బాలీవుడ్ భామ అయిన శిల్పా శెట్టికి తెలుగు సినిమాలతో మంచి అనుబంధమే ఉంది. ఈమె త్వరలో ఓ ప్యాన్ ఇండియా తెలుగు ప్రాజెక్ట్‌తో పలకరించబోతున్నట్టు సమాచారం. (Image: Instagram) బాలీవుడ్ నటి శిల్పాశెట్టి గురించి సెపెరేట్‌గా చెప్పాల్సిన పనిలేదు. చేతిలో సినిమాలు లేకున్నా.. ఈ మంగళూరు భామ.. తనదైన యోగాసనాలతో ఎపుడు అభిమానులతో టచ్‌లో ఉంటుంది. (Photo: www.instagram.com/theshilpashetty) శిల్పాశెట్టికి కేవలం హిందీ ఇండస్ట్రీతోనే కాదు.. తెలుగులోనూ ఈ భామ పలు చిత్రాల్లో నటించి ఇక్కడ ప్రేక్షకులను కూడా పలకరించింది. తెలుగు విషయానికొస్తే.. ఈమె మొదటిసారి వెంకటేష్ హీరోగా కే.రాఘవేంద్రరావు దర్శకత్వంలో తెరకెక్కిన ‘సాహసవీరుడు సాగరకన్య’ సినిమాతో తొలిసారి తెలుగు తెరపై కనిపించింది. ఈ చిత్రం బాక్సాఫీస్ దగ్గర మంచి విజయాన్నే నమోదు చేసింది. (Photo: www.instagram.com/theshilpashetty) తాజాగా ఈ భామ.. తెలుగులో నటించబోతున్నట్టు టాలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి. ఇప్పటికే శిల్పా శెట్టి... ఓ బడా హీరో సినిమాలో ఓ ఇంపార్టెంట్ చేయబోతున్నట్టు సమాచారం. ఈమెకు సోషల్ మీడియాలో 30 మిలియన్స్ పైగా ఫాలోవర్స్ ఉన్నారు. (Photo: www.instagram.com/theshilpashetty) మోహన్ బాబు హీరోగా ఇవివి సత్యనారాయణ దర్శకత్వంలో తెరకెక్కిన ‘వీడెవడండీ బాబు’ సినిమాలో నటించింది. ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర యావరేజ్‌గా నిలచింది. (Instagram/Credit) చివరగా బాలకృష్ణ హీరోగా నటించిన ‘భలే వాడివి బాసూ’ సినిమాలోకనిపించింది శిల్పాశెట్టి. ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర డిజాస్టర్‌గా నిలిచింది. ఆ తర్వాత తన కన్న చిన్నవాడైన రాజ్ కుంద్రాను పెళ్లాడి ఇద్దరు పిల్లకు తల్లైంది. ప్రస్తుతం నటిగా రీ ఎంట్రీ ఇవ్వడంతో పాటు కొన్ని రియాలిటీ షోలకు హోస్ట్‌గా వ్యవహరిస్తోంది. (Instagram/Credit)


Army Recruitment Rally: సికింద్రాబాద్‌లో ఆర్మీ రిక్రూట్‌మెంట్‌ ర్యాలీ, పలు విభాగాల్లో అగ్నివీర్‌ ఎంపికలు

Army Recruitment Rally: సికింద్రాబాద్‌లో మే 20 నుంచి అగ్నివీర్ రిక్రూట్ మెంట్ ర్యాలీ ప్రారంభం కానుంది. యూనిట్ హెడ్ క్వార్టర్స్ కోటా కింద అగ్నివీర్ రిక్రూట్ మెంట్ ర్యాలీ ఈ నెల 20 నుంచి సికింద్రాబాద్‌లోని 1 ఈఎంఈ సెంటర్‌లో నిర్వహిస్తారు.


లారీ ఓనర్స్ సమస్యల పరిష్కారానికి కృషి

లారీ ఓనర్స్ సమస్యల పరిష్కారానికి కృషి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి  కాంగ్రెస్ కు లారీ ఓనర్స్ అసోసియేషన్ మద్దతు  లారీ ఓనర్స్ అసోసియేషన్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు సయ్యద్ సాదిక్ షాద్ నగర్,వెలుగు: రాష్ట్రంలోని లారీ యజమానుల సమస్యలను పరిష్కరిస్తామని, రవాణా రంగం మెరుగుదల కోసం లారీ ఓనర్స్ అసోసియేషన్ ప్రధాన సమస్యలు మేనిఫెస్టోలో పెట్టడం జరిగిందని రాష్ట్ర ముఖ్యమంత్...


Voter List: SMS ద్వారా ఓటరు జాబితాలో మీ పేరు ఉందో లేదో ఇలా తెలుసుకోండి!

Voter List: SMS ద్వారా ఓటరు జాబితాలో మీ పేరు ఉందో లేదో ఇలా తెలుసుకోండి!


గాంధీలో బాలికకు అరుదైన సర్జరీ

గాంధీలో బాలికకు అరుదైన సర్జరీ చికిత్సను సక్సెస్ చేసిన పీడియాట్రిక్ విభాగ డాక్టర్లు పద్మారావునగర్, వెలుగు: గాంధీ ఆస్పత్రి డాక్టర్లు అరుదైన, క్లిష్టమైన సర్జరీని చేసి బాలిక​ ప్రాణాలు కాపాడారు.  ఆస్పత్రి సూపరింటెండెంట్ ప్రొ.రాజారావు సోమవారం సర్జరీ వివరాలను మీడియాకు  వెల్లడించారు.  మహారాష్ట్రలోని నాందేడ్​కు చెందిన11 ఏండ్ల బాలిక సంధ్య కొంతకాలంగా బ్లడ్​ ప...


ఆరోజు కేసీఆర్ చేసిన పనికి వాళ్లిద్దరూ బాధపడ్డారు.. తెరవెనుక విషయాన్ని బయటపెట్టిన ఈటల రాజేందర్

KCR Behaviour: బీజేపీ నేత, మల్కాజిగిరి ఎంపీ అభ్యర్థి ఈటల రాజేందర్ కీలక కామెంట్లు చేశారు. సోమాజిగూడ ప్రెస్ క్లబ్‌లో నిర్వహించిన మీట్ ది ప్రెస్ కార్యక్రమంలో.. బీఆర్ఎస్ ప్రభుత్వంలో మంత్రుల పట్ల కేసీఆర్ ఎలా వ్యవహరించేవారు అన్న విషయాన్ని ఈటల ప్రస్తావించారు. అందుకు సంబంధించిన తెర వెనుక జరిగిన ఓ సంఘటనను ఉదాహరణగా వివరించారు ఈటల రాజేందర్.


బీజేపీలో పైరవీలకు చోటు లేదు..పనిచేసే వారికే గుర్తింపు : ధర్మపురి అర్వింద్​

బీజేపీలో పైరవీలకు చోటు లేదు..పనిచేసే వారికే గుర్తింపు : ధర్మపురి అర్వింద్​ నిజామాబాద్​ ఎంపీ అభ్యర్థి ధర్మపురి అర్వింద్​ ఆర్మూర్, వెలుగు:  బీజేపీలో పైరవీలకు చోటు లేదని పని చేసే వారికే గుర్తింపు ఉంటుందని ఎంపీ అర్వింద్ అన్నారు. సోమవారం ఆర్మూర్ మండలం అంకాపూర్‌‌లో ఎమ్మెల్యే పైడి రాకేశ్ రెడ్డి, రైతులతో అర్వింద్ చాయ్ పే చర్చలో పాల్గొన్నారు.  ఈ సందర్భంగా ఆ...


Akshaya Tritiya : అక్షయ తృతీయ రోజు బంగారం ఎందుకు కొనాలి.. మోసాలు ఇలా జరుగుతాయి..?

Akshaya Tritiya : అక్షయ తృతీయ రోజు బంగారం ఎందుకు కొనాలి.. మోసాలు ఇలా జరుగుతాయి..? అక్షయ తృతీయ వస్తే చాలు... ఎక్కువ మంది నగల కొట్టుకి క్యూ కడతారు. ఇవ్వాళ కనీసం ఒక గ్రాము బంగారం అయినా కొనాలి అనుకుంటారు. అందుకు తగ్గట్టే నగల షాపుల వాళ్లు డిస్కౌంట్లు, ఆఫర్లు పెడుతుంటారు. బంగారు పండుగ పది వేలు విలువ చేసే వస్తువు కొంటే పది శాతం డిస్కౌంట్, పది గ్రాముల బంగా...


సీఎం రేవంత్‌ రెడ్డి కరీంనగర్‌ పర్యటన రద్దు

సీఎం రేవంత్‌ రెడ్డి కరీంనగర్‌ పర్యటన రద్దు వర్షం కారణంగా సీఎం రేవంత్‌ రెడ్డి కరీంనగర్‌ పర్యటన రద్దు అయింది. అయితే యథావిధిగా సీఎం రేవంత్‌ రెడ్డి వరంగల్‌ పర్యటన కొనసాగనుంది.  ఈ విషయాన్ని  అధికారులు తెలిపారు. హైదరాబాద్‌ నుంచి రోడ్డు మార్గంలో వరంగల్‌ బయలుదేరారు సీఎం రేవంత్ రెడ్డి.  వరంగల్‌ తూర్పు, వరంగల్‌ పశ్చిమలో రేవంత్‌ రెడ్డి రోడ్‌ షోలలో ఆయన పాల్గొన...


ప్రతి ఒక్కరూ ఓటుహక్కును వినియోగించుకోవాలి

ప్రతి ఒక్కరూ ఓటుహక్కును వినియోగించుకోవాలి మహబూబాబాద్, వెలుగు: ప్రతి ఒక్కరూ ఓటు హక్కు వినియోగించుకోవాలని జిల్లా స్విఫ్ నోడల్ ఆఫీసర్​ మరియన్న అన్నారు. జిల్లా కేంద్రంలోని ధర్మన్నకాలనీలో జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్ ఆదేశాల మేరకు సోమవారం పురపాలక సంఘాలు, గ్రామ పంచాయతీలు, కాలేజీలు, రైల్వే, బస్ స్టేషన్ల పరిధిలో ఓటుహక్కుపై విస్తృత ప...


AP Land titling Act: ల్యాండ్ టైటిల్ యాక్ట్ పై ప్రతిపక్షాల ఆరోపణల్లో నిజం ఎంత.. ? నిపుణులు ఏం చెబుతున్నారు..?

AP Land titling Act: ల్యాండ్ టైటిల్ యాక్ట్ వల్ల ప్రజలకు భూ హక్కులపై లేని పోని సమస్యలు వస్తాయని ప్రతిపక్షాలు ప్రధానంగా ఎన్నికల్లో ప్రచారాస్త్రంగా వాడుతున్నారు. అసలు ఈ ల్యాండ్ టైటిల్ యాక్ట్ నిజంగానే భూములపై హక్కులు కోల్పోవాల్సి వస్తుందా.. ? నిపుణులు ఏం చెబుతున్నారంటే.. ?


పంట పెట్టబడి సాయం ఆపండి.. రైతుభరోసాపై ఈసీ ఆంక్షలు

పంట పెట్టబడి సాయం ఆపండి.. రైతుభరోసాపై ఈసీ ఆంక్షలు రైతు భరోసాపై ఎన్నికల కమిషన్ ఆంక్షలు విధించింది. ఈ నెల 13న పోలింగ్ ముగిసిన తర్వాతే పంట పెట్టుబడి సాయం పంపిణీ చేయాలని ఆదేశించింది.  మొత్తం 69 లక్షల మంది లబ్ధిదారులకు గాను 65 లక్షల మందికి ఇది వరకే పంట పెట్టుబడి సాయాన్ని ప్రభుత్వం ఇది వరకే అందజేసింది. ఈ నెల 8వ తేదీ లోపు అందరికీ రైతు భరోసా వేస్తామని ఈ నె...


CM Jagan | కోరుకొండ బహిరంగ సభలో సీఎం జగన్ పూర్తి ప్రసంగం

కోరుకొండ బహిరంగ సభలో సీఎం జగన్ పూర్తి ప్రసంగం.


దారుణం.. భార్య ఆస్పత్రి ఖర్చులు భరించలేక ఐసీయూలోనే చంపేసిన భర్త

అనారోగ్యంతో ఆస్పత్రి పాలైన భార్యను కాపాడుకోవడం మానేసి.. ఆ భర్త దారుణానికి ఒడిగట్టాడు. ఆస్పత్రిలో చేర్పించి చికిత్స అందించిన తర్వాత.. చికిత్సకు అయిన డబ్బులు కట్టలేక ఆమె ప్రాణాలను తనే స్వయంగా తీసేశాడు. ఈ ఘటనను పోలీసుల ముందు ఒప్పుకోవడంతో అతడ్ని అరెస్ట్ చేశారు. అయితే ఆస్పత్రి మెడికల్ బిల్లులు చెల్లించలేక.. భార్యను చంపుకోవడం సంచలనంగా మారింది. ఇంతకీ ఈ దారుణ సంఘటన ఎక్కడ జరిగిందో ఈ స్టోరీలో తెలుసుకుందాం.


రైతు బంధు పంపిణీ నిలిపివేత.. బ్యాంక్ ఖాతాల్లో పడతాయనుకుంటే ట్విస్టు

Rythu Bandhu Scheme: లోక్ సభ ఎన్నికలు సమీపిస్తున్న వేళ.. రేవంత్ రెడ్డి (Anumula Revanth Reddy) ప్రభుత్వానికి ఈసీ షాక్ ఇచ్చింది. నిన్ననే ఐదెకరాల పైబడి వ్యవసాయ భూమి ఉన్న రైతులందరికీ పెట్టుబడి సాయం అందించేందుకు నిదులు విడుదల చేసినట్టుగా రేవంత్ రెడ్డి ప్రభుత్వం ప్రకటించింది. ఇంతలోనే.. రైతుభరోసా ప్రక్రియను ఆపేయాలంటూ ఈసీ కీలక ఆదేశాలు జారీ చేసింది. సీఎం రేవంత్ రెడ్డి ఎన్నికల నిబంధనలను ఉల్లంఘించారంటూ పేర్కొంది. పోలింగ్ తర్వాతే నిధులు విడుదల చేయాలని...


‘డియర్ మిస్ పారికా... మీ రహస్య సమాచారం నా దగ్గరుంది...’

సంప్రదాయ ఆవిరి స్నానం చేసి సేద తీరుతున్న సమయంలో ఆమె ఫోన్‌కు ఒక మెయిల్ వచ్చింది. అది కూడాగానే ఆమె షాక్ అయ్యారు. ఒక దేశాన్నే కుదిపేసిన ఆ ఘటన వెనుక పాతికేళ్ల కుర్రాడు ఉన్నాడని తేలింది.


చనిపోయిన వ్యక్తి వస్తువులను ఇతరులు వాడొచ్చా..? గరుడ పురాణం ఏం చెబుతోంది?

భూమి మీద మరణం ఒక్కటే శాశ్వతం. ఈ లోకంలో పుట్టిన వాళ్లు ఏదో ఒకరోజు చనిపోవాల్సిందే, ఈ భూలోకంలో తన జీవనయానం ముగించుకుని భౌతిక దేహాన్ని విడిచిపెట్టాల్సిందే. మరణానంతరం ఆ వ్యక్తి జ్ఞాపకాలు, వారికి సంబంధించిన వస్తువులు మాత్రమే మనతో ఉంటాయి. భూమిపై జీవించి ఉన్నప్పుడు అందరూ మంచి జీవితాన్ని గడపడానికి అవసరమైన వస్తువులను కొనుగోలు చేస్తారు. మరి వారు చనిపోయిన తర్వాత ఆ వ్యక్తి భౌతిక వస్తువులను ఏం చేయాలి? దీనికి సంబంధించి ప్రజలకు చాలా సందేహాలు ఉంటాయి. చనిపోయిన...


పోస్టల్ బ్యాలెట్ పోలింగ్.. ఎన్నికల సంఘం కీలక సూచనలు

ఏపీ ఎన్నికలకు సంబంధించి ప్రస్తుతం పోస్టల్ బ్యాలెట్ పోలింగ్ ప్రక్రియ జరుగుతోంది. అక్కడక్కడా అవాంతరాలు కూడా కలుగుతున్నాయి. ఈ క్రమంలోనే ఏపీ ఎన్నికల ప్రధానాధికారి ముకేష్ కుమార్ మీనా కీలక వివరాలు వెల్లడించారు. పోస్టల్ బ్యాలెట్ పోలింగ్‌కు సంబంధించి ఇప్పటివరకూ 70 శాతం పోలింగ్ పూర్తైందన్నారు. అవసరమైతే మే 9వ తేదీ కూడా పోస్టల్ బ్యాలెట్ ఓటు వేసేందుకు అవకాశం కల్పిస్తామని చెప్పారు.


కుల వృత్తి ఒక వైపు.. అర్చక వృత్తి మరో వైపు.. ఇతని గురించి తెలుసుకోవాల్సిందే..!!

కుల వృత్తి ఒక వైపు.. అర్చక వృత్తి మరో వైపు.. ఇతని గురించి తెలుసుకోవాల్సిందే.. వారి కుటుంబ ఆర్థిక సమస్యల వల్ల పదవ తరగతి లోనే చదువును ఆపివేసి తన కులవృత్తిని ఎంచుకొని తన తండ్రికి చేదోడు వాదోడుగా వుంటూ జీవనం సాగిస్తూ ఉండేవాడు. సిద్దిపేట జిల్లా కోహెడ మండలం శనిగరం గ్రామం తల్లి సింగిరాల అనసూర్య తండ్రి సింగిరాల ఎల్లయ్య గారి ప్రథమ పుత్రుడు నాయి బ్రాహ్మణ కుటుంబానికి చెందిన సింగిరాల శ్రీనివాస్. చిన్నప్పటి నుంచి తన తండ్రి నేర్పించిన సంస్కారంతో ఆధ్యాత్మికత వైపు ఆకర్షితుడై 8వ తరగతి నుంచి ఆధ్యాత్మిక గ్రంథాలు చదువుతూ గురువుల దగ్గర ఇంకా విలువైన గ్రంథాలకు సంబంధించిన విషయాలు నేర్చుకుంటూ వాటికీ ఆకర్షితుడై గురువులు సూచించిన మార్గంలో నడుచుకునేవాడు. వారి కుటుంబ ఆర్థిక సమస్యల వల్ల పదవ తరగతి లోనే చదువును ఆపివేసి తన కులవృత్తిని ఎంచుకొని తన తండ్రికి చేదోడు వాదోడుగా వుంటూ జీవనం సాగిస్తూ ఉండేవాడు. అదే సమయంలో ఒక దేవాలయం కు వెళ్ళినప్పుడు నీవు ఒక నాయి బ్రాహ్మణుడు గర్భగుడిలోనికి రావద్దు నీకు జంజరం లేదని ఒక దగ్గర తను అవమానానికి గురయ్యాడు. ఈ అవమానం తనని చాలా కలచివేసింది. అప్పుడే తాను మనసులో దృఢంగా నిశ్చయించుకున్నాడు. తాను అర్చకుడిగా కొనసాగాలని.. చిన్నప్పటి నుండి నేర్చుకున్న ఈ ఆధ్యాత్మిక జ్ఞానాన్ని ఇతరులకు పంచుకోవాలని ఏదైనా మనం పట్టుదలతో సంస్కారవంతంగా ఉంటే సాధించాలని, తపన ఉంటే కచ్చితంగా సాధిస్తామని మనసులో దృఢంగా అనుకున్నాడు. అలాంటి సమయంలో ఒక గురువు వీరి లోపల ఉన్న ఆధ్యాత్మిక జ్ఞానాన్ని గుర్తించి కుల మతాలకు అతీతంగా భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్మ చెప్పిన జన్మనా జయతే శుద్రః కర్మణా జయతేజః ద్విజహ అనే శ్లోకం ఆధారంగా పరమాత్మ చెప్పిన సూక్తులతో అతనికి దేవాలయంలో అవకాశం కల్పించినారు. అప్పటినుండి తనకు ఉన్న జ్ఞానంతో ఎన్నో కీర్తి ప్రతిష్టలను సంపాదించి ఆ దేవాలయంలో అర్చకుడి కొనసాగుతున్నారు. అర్చకుడిగా కొనసాగుతున్న సమయంలో ఆర్థికంగా చాలా ఇబ్బంది రావడంతో దేవాలయంలో పూజలు చేస్తూ తన షాప్ కు వెళ్లి తన నాయి బ్రాహ్మణ వృత్తిని చేసేవారు. కొన్ని ప్రైవేట్ సంస్థలు తన ప్రతిభను గుర్తించి అవార్డులు కూడా ప్రకటించారు. తనకు ఇతర సంస్థలో మంచి అవకాశాలు లభించినా తాను ఇంకా నేర్చుకోవాల్సింది చాలా ఉందని తిరస్కరించాడు. తన జీవిత ఆశయాలు ఏమిటని లోకల్ 18 ప్రతినిధి కేశవేణి ప్రవీణ్ అడగ్గా భూమ్మీదికి వచ్చిన ప్రతి మనిషి కి ఏదో ఒకటి సాధించాలనే తపన ఉంటుంది. మనం నిష్టతో ఉంటే మనం అనుకున్నది ఏదైనా సాధించవచ్చు. మనిషి కష్టపడితే దేనినైనా పొందగలడని వివరించారు.


ఏపీలో పథకాల అమలుకు అడ్డు తగులుతున్నది మీరంటే మీరంటూ.. పార్టీల విమర్శల జోరు !

ఎలక్షన్ కోడ్ అమలులోకి వచ్చాక.. ప్రవేశపెట్టిన పథకాలు కాదు. మొన్నటి మొన్న అమలు చేసిన పథకాలు కానే కాదు.. కానీ ఇదేందయ్యా మీ గోల అంటూ వైసీపీ నాయకులు గగ్గోలు పెడుతున్న పరిస్థితి. ఇందుకు ప్రధాన కారణం వైసిపి ప్రవేశపెట్టిన పథకాలు సామాన్య ప్రజానీకానికి చేరకుండా.. టిడిపి అడ్డుతగులుతుందని వైసీపీ ఆరోపిస్తోంది. కానీ తాము ఎన్నికల నియమావళి మేరకే ఈసీ కి ఫిర్యాదులు ఇస్తున్నట్లు మరో వైపు టిడిపి చెబుతోంది. ఇది ఏపీలో ఎన్నికల సంధర్భంగా ఉన్న అనిశ్చితి.వైసిపి ప్రభుత్వ...


Fact Check: ఆంధ్రా ప్రజలు తెలంగాణ ప్రజల కన్నా తెలివైన వారు అని KTR అన్నారా?

ఆంధ్రా ప్రజలు తెలంగాణ ప్రజల కన్నా తెలివైన వారు అని KTR అన్నది ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ప్రశ్నకుBRS వర్కింగ్ ప్రెసిడెంట్ KTR తెలంగాణ ప్రజలను అవమానించాడంటూ ఒక వీడియో సోషల్ మీడియాలో విస్తృతంగా షేర్ అవుతోంది. ‘ఆంధ్రా వాళ్ళు తెలంగాణ వాళ్ళ కంటే ఎక్కువ తెలివైన వాళ్ళని, అందుకే వారు ఎక్కువగా ఉండే హైదరాబాద్ ప్రాంతంలో తమను ఎక్కువ సీట్లలో గెలిపించారని, తమ ప్రత్యర్థి కాంగ్రెస్ పార్టీకి ఇక్కడ ఒక్క సీటు రాలేదని’ KTR వ్యాఖ్యానించినట్టు ఈ...


గడ్చిరోలి అడవుల్లో పేలుడు పదార్థాలు స్వాధీనం

గడ్చిరోలి అడవుల్లో పేలుడు పదార్థాలు స్వాధీనం భద్రాచలం, వెలుగు : మహారాష్ట్రలోని గడ్చిరోలి అడవుల్లో మావోయిస్టులు డంప్‌ చేసిన పేలుడు పదార్థాలను సోమవారం పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. గడ్చిరోలి జిల్లా టిఫాగడ్‌ అడవుల్లో మావోయిస్టులు పేలుడు పదార్థాలు డంప్​ చేశారన్న సమాచారంతో సీ-60, సీఆర్‌పీఎఫ్‌ బలగాలు అడవిలోకి వెళ్లాయి. పేలుడు పదార్థాలు నింపిన ఆరు ప్రెష...


Duvvada Srinivas| జగన్ లేకుంటే ఈ దువ్వాడ లేడు

సీఎం జగన్ పై దువ్వాడ శ్రీనివాస్ వ్యాఖ్యలు.


బండి సంజయ్‌‌పై ఎన్నికల అధికారులకు ఫిర్యాదు

బండి సంజయ్‌‌పై ఎన్నికల అధికారులకు ఫిర్యాదు కరీంనగర్ సిటీ, వెలుగు: బీజేపీ అభ్యర్థి బండి సంజయ్ కుమార్ పై సోమవారం కాంగ్రెస్ నాయకులు ఎన్నికల అధికారికి ఫిర్యాదు చేశారు. ప్రచారంలో భాగంగా హిందువుల ఆరాధ్య దైవమైన శ్రీరాముడి పేరుతో ప్రజలను రెచ్చగొడుతున్నాడని, కాంగ్రెస్‌‌ పార్టీ రాముడిని అవమానిస్తున్నదంటూ తప్పుడు ప్రచారం చేస్తూ ఎన్నికల్లో లబ్ధి పొందే ప్రయత్నం...


Kejriwal Bail: కేజ్రీవాల్‌ బెయిల్‌పై సుప్రీం ఆంక్షలు.. బెయిల్ వచ్చినా సీఎంగా విధులు నిర్వర్తించొద్దని వెల్లడి

Delhi Excise Policy Case: ఢిల్లీ లిక్కర్ కేసు.. ఆమ్ ఆద్మీ పార్టీని, ఢిల్లీ ప్రభుత్వాన్ని షేక్ చేస్తోంది. ఇప్పటికే ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ సహా కీలక నేతలు జైలులో ఉండటంతో సార్వత్రిక ఎన్నికల్లో ఆప్ తరఫున ప్రచారం చేయడానికి వారు దూరం అయ్యారు. ఈ క్రమంలోనే ఎన్నికల్లో ప్రచారం చేసుకునేందుకు మధ్యంతర బెయిల్ ఇవ్వాలన్న కేజ్రీవాల్ పిటిషన్‌పై విచారణ జరిపిన సుప్రీంకోర్టు.. పలు ఆంక్షలు విధించింది. ఒక వేళ మధ్యంతర బెయిల్ వస్తే.. సీఎంగా అధికారిక విధులు...


ఈవీఎంల రెండో ర్యాండమైజేషన్ పూర్తి

ఈవీఎంల రెండో ర్యాండమైజేషన్ పూర్తి జిల్లా ఎన్నికల అధికారి,  కలెక్టర్​ రాహుల్​రాజ్​ మెదక్​టౌన్, వెలుగు: మెదక్​ పార్లమెంట్​కు సంబంధించి అడిషనల్​ఈవీఎంల రెండో ర్యాండమైజేషన్​ప్రక్రియను జనరల్​అబ్జర్వర్​సమీర్ మాధవ్ కుర్కోటి, రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో పూర్తి చేసినట్లు జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్​రాహుల్​రాజ్​తెలిపారు. సోమవారం ఆయన మీడియాతో మాట్ల...


రాజ్యాంగాన్ని మార్చేందుకే 400 సీట్లు అడుగుతున్రు:సీతక్క

రాజ్యాంగాన్ని మార్చేందుకే 400 సీట్లు అడుగుతున్రు:సీతక్క కొత్తగూడ, వెలుగు: రాజ్యాంగాన్ని మార్చేందుకే బీజేపీ 400 సీట్లు అడుగుతుందని మంత్రి సీతక్క విమర్శించారు. మహబూబాబాద్‌‌‌‌ పార్లమెంట్‌‌‌‌ క్యాండిడేట్‌‌‌‌ పోరిక బలరాం నాయక్‌‌‌‌కు మద్దతుగా సోమవారం మహబూబాబాద్‌‌‌‌ జిల్లా కొత్తగూడ, గంగారం మండలాల్లో ప్రచారం చేశారు. ఈ సందర్భంగా గుంజేడు నుంచి కొత్తగూడ వరకు ...


పనిమనిషి ఇంట్లో గుట్టలుగా నోట్ల కట్టలు

ఝార్ఖండ్‌ రాజధాని రాంచీలోని ఓ ఫ్లాట్‌‌లో.. ఈడీ అధికారుల సోదాల్లో నోట్ల కట్టలు గుట్టలు గుట్టలుగా బయటపడ్డాయి. ఆరు కౌంటింగ్ మెషీన్ల సాయంతో లెక్కించగా.. ఆ ఫాట్లో ఉన్న నగదు రూ.32 కోట్లు అని తేలింది. అనుమానం వచ్చి మరో రెండు చోట్ల సోదాలు నిర్వహిస్తే.. మరో రూ.3 కోట్ల నగదు దొరికింది. ఈ డబ్బంతా దొరికింది ఓ పనిమనిషి ఇంట్లో కావడం గమనార్హం. ఝార్ఖండ్ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఆలంగీర్‌ ఆలం పర్సనల్ సెక్రటరీ సంజీవ్‌ లాల్‌ పని మనిషి జహంగీర్‌ ఆలం డబుల్ బెడ్‌రూం ఫ్లాట్‌లో ఈడీ అధికారులు ఈ సోదాలు జరిపారు.


లాతూరులో భర్తతో కలిసి ఓటేసిన నటి జెనీలియా

లోక్‌సభ ఎన్నికల్లో భాగంగా 93 నియోజకవర్గాలకు మంగళవారం మూడో దశ పోలింగ్ మొదలైంది. మహారాష్ట్రలోని లాతూర్‌లో సినీనటి జెనీలియా ఓటు హక్కు వినియోగించుకున్నారు. తన భర్త, నటుడు రితేశ్ దేశ్‌ముఖ్‌తో కలిసి పోలింగ్ బూత్‌కు వచ్చి ఓటేశారు. అనంతరం ఆమె మాట్లాడుతూ.. ప్రజాస్వామ్యంలో ఇవాళ అతి ముఖ్యమైన రోజు అని వ్యాఖ్యానించారు. ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కను వినియోగించుకోవాలని జెనీలియా కోరారు. రితేశ్ సోదరుడు, ధీరజ్‌ దేశ్‌ముఖ్‌ లాతూర్‌ నియోజకవర్గం ఎమ్మెల్యే. ఆయన గత ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి గెలిచారు. రితేశ్, ధీరజ్, జెనీలియా ముగ్గురూ తమ సొంత ఊరులో ఓటేయడానికి వచ్చారు.


ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్‌‌‌‌ దుష్ర్పచారం : నడ్డా

ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్‌‌‌‌ దుష్ర్పచారం : నడ్డా ముస్లిం రిజర్వేషన్లు రద్దు చేస్తం తెలంగాణలో మెజార్టీ ఎంపీ సీట్లు గెలుచుకుంటం.. అభివృద్ధిలో భారత్‌‌‌‌ను అగ్రగామిగా నిలబెట్టాం నల్గొండ, చౌటుప్పల్, పెద్దపల్లి సభల్లో బీజేపీ నేషనల్​ చీఫ్ నల్గొండ/ యాదాద్రి/ పెద్దపల్లి, వెలుగు: బీజేసీ మరోసారి అధికారంలోకి వస్తే కాంగ్రెస్​ ప్రభుత్వం ముస్లింలకు ఇచ్చి...


Indelible Ink: ఓటరుకు రెండు చేతులు లేకపోతే.. సిరా గుర్తు ఎక్కడ వేస్తారో తెలుసా?

Indelible Ink: దేశవ్యాప్తంగా ఎన్నికల హడావిడి కొనసాగుతోంది. నేటితో మూడో దశ ఎన్నికల ప్రక్రియ కూడా ముగిసింది. ఇక తెలుగు రాష్ట్రాలలో నాలుగో దశలో ఎన్నికలు జరగనున్నాయి. ఈనెల 13న జరిగే నాలుగో దశ ఎన్నికల పోలింగ్ కోసం ప్రధాన పార్టీలు జోరుగా ప్రచారాన్ని నిర్వహిస్తున్నాయి. ఢీ అంటే ఢీ అన్నట్లుగా ఒక్కరి పై ఒక్కరూ విమర్శ ప్రతి విమర్శలు గుప్పించుకుంటున్నారు. అలాగే అధికారాన్ని ఎలాగైనా చేజిక్కించుకోవాలని అటు అధికార పార్టీలు, ఇటు ప్రతిపక్ష పార్టీలు...


కంగన మానసిక రుగ్మతతో బాధ పడుతోంది: రాకేశ్ కుమార్ సింగ్

కంగన మానసిక రుగ్మతతో బాధ పడుతోంది: రాకేశ్ కుమార్ సింగ్ మండి (హిమాచల్ ప్రదేశ్): సినీ నటి, మండి బీజేపీ అభ్యర్థి కంగనా రనౌత్ మానసిక రుగ్మతతో బాధపడుతోందని కాంగ్రెస్ నేత రాకేశ్ కుమార్ సింగ్ అన్నారు. భారత మొదటి ప్రధాని సుభాష్ చంద్రబోస్ అని ఇటీవల ఆమె చెప్పిందని గుర్తుచేశారు. దేశ తొలి ప్రధాని నెహ్రూ అని రెండో తరగతి విద్యార్థి కూడా చెబుతారని పేర్కొ న్నారు. ...


కేరళలో ఘోర రోడ్డుప్రమాదం.. ముగ్గురు స్పాట్

కేరళలో ఘోర రోడ్డుప్రమాదం.. ముగ్గురు స్పాట్ కేరళలో ఘోర రోడ్డుప్రమాదం జరిగింది. కాసర్ గోడ్ లోని మంజేశ్వరం దగ్గర కారును ఢీకొట్టింది అంబులెన్స్. ప్రమాదంలో ముగ్గురు చనిపోయారు. పలువురుకి గాయాలయ్యాయి. ఘటనలో కారు నుజ్జునుజ్జయింది. సమాచారం అందుకుని ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు.. మృతదేహాలను వెలికితీశారు. తర్వాత క్రేన్ సాయంతో బోల్తా పడిన అంబులెన్స్ ను పో...


స్విట్జర్లాండ్‌లో అషు రెడ్డి.. చలిలో సెగలు రేపుతోంది!

ఈ సమ్మర్‌ని అషురెడ్డి స్విట్జర్లాండ్‌లో ఎంజాయ్ చేస్తోంది. ఇండియాలో ఎండల దెబ్బకి తట్టుకోలేక అక్కడ రిలాక్స్ అవుతోంది.


గాలి వాన బీభత్సం.. బీజేపీ సభా ప్రాంగణంలో కొట్టుకపోయిన కుర్చీలు, టెంట్లు

గాలి వాన బీభత్సం.. బీజేపీ సభా ప్రాంగణంలో కొట్టుకపోయిన కుర్చీలు, టెంట్లు మండుతున్న ఎండలకు బ్రేక్ పడింది. రాష్ట్ర వ్యాప్తంగా పలు జిల్లాల్లో భారీ వర్షం పడుతోంది.  పెద్దపల్లి, సిరిసిల్ల జిల్లాలో ఉరుముల మెరుపులతో కూడిన భారీ వర్షం కురుస్తోంది. పెద్దపల్లి జిల్లా ధర్మపురి,పెద్దపల్లి,మంథని, నియోజకవర్గాల్లో ఉరుములు ఈదురు గాలులతో కూడిన వర్షం పడుతోంది. పలు చోట...


ప్లీజ్ మా దేశానికి రండి..భారత్ ను బతిమాలుకుంటున్న మాల్దీవుల టూరిజం శాఖ మంత్రి

మాల్దీవుల అధ్యక్షుడు భారత్ వ్యతిరేక వైఖరితో ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలు దారుణంగా దెబ్బతిన్న విషయం తెలిసిందే. ఈ ఏడాది జనవరిలో ప్రధాని నరేంద్ర మోదీ లక్షద్వీప్‌ పర్యటన సందర్భంగా భారత్‌పై అక్కసును వెళ్లగక్కుతూ మాల్దీవుల మంత్రులు సోషల్ మీడియాలో పెట్టిన పోస్టులతో భారతీయులకు మండి బాయ్‌కాట్ మాల్దీవులకు పిలుపునిచ్చారు. మాల్దీవులకు వెళ్లే భారత పర్యాటకుల సంఖ్య భారీగా తగ్గిపోవడంతో ఆదేశ ఆదాయం కూడా పడిపోయింది. ఆ దేశానికి టూరిజం ప్రధాన ఆర్ధిక వనరుకావడంతో మాల్దీవులు ఇబ్బందులను ఎదుర్కొంటోంది. దీంతో తమ తప్పు తెలుసుకున్న మాల్దీవులు కాళ్లబేరానికి వచ్చింది. భారతీయులు మళ్లీ మాల్దీవులకు రావాలని, పర్యాటకంపైనే ఆధారపడిన తమ దేశ ఆర్థిక వ్యవస్థకు సహకరించాలని మాల్దీవుల టూరిజం శాఖ మంత్రి ఇబ్రహీం ఫైజల్‌ అభ్యర్థించారు.[caption id="" align="alignnone" width="1024"] పర్యటకశాఖ గణాంకాల ప్రకారం.. ఈ ఏడాదిలో మే 4 నాటికి 43,991 మంది భారతీయులు మాల్దీవులకు వెళ్లారు. గతేడాది జనవరి - ఏప్రిల్‌ మధ్య ఈ సంఖ్య 73,785గా ఉంది.[/caption] మాల్దీవులలో ముయిజ్జు అధికారంలోకి వచ్చిన తర్వాత ఇరు దేశాల మధ్య దౌత్య సంబంధాలు దెబ్బతినడమే దీనికి కారణమని నివేదిక తెలిపింది. చైనాకు సన్నిహితంగా వ్యవహరిస్తున్న ముయిజ్జు భారత దళాలను వెనక్కి పంపి కయ్యానికి కాలుదువ్వారు. అంతకుముందు మాల్దీవుల వ్యవహారాల్లో భారత్‌ జోక్యం ఎక్కువవుతోందంటూ ప్రచారం చేసి సెప్టెంబరులో జరిగిన ఎన్నికల్లో గెలుపొందిన విషయం తెలిసిందే.


Jharkhand: రూ.10 వేల లంచం కేసులో తీగ లాగితే.. రూ.35 కోట్ల గుట్టురట్టు!

పనిమనిషి ఇంట్లో గుట్టలు గుట్టలుగా నోట్ల కట్టలు చూసి అధికారులే విస్తుపోయారు. వాటిని లెక్కించే కొద్దీ లెక్క పెరుగుతూ పోయింది. అధికారుల సాయంతో పలువురు అధికారులు 12 గంటల పాటు శ్రమిస్తే కానీ ఓ కొలిక్కి రాలేదు. ఝార్ఖండ్‌లో సోమవారం ఓ మంత్రి వ్యక్తిగత కార్యదర్శి ఇంట్లో పని చేసే వ్యక్తి వద్ద భారీ ఎత్తున నగదు పట్టుబడిన విషయం తెలిసిందే ఇది దాదాపు రూ.34 కోట్లని చివరకు తేల్చారు.


కోవిడ్ సర్టిఫికెట్ నుంచి మోదీ ఫొటో ఎందుకు తొలగించారు?.. ఇదీ కారణం!

కోవిడ్ వ్యాక్సినేషన్ సర్టిఫికెట్ల నుంచి ప్రధాని నరేంద్ర మోదీ చిత్రాన్ని తొలగించడం ఇప్పుడు పెద్ద చర్చనీయాంశమైంది. కోవిషీల్డ్ వ్యాక్సినేషన్ వల్ల కలిగే దుష్ప్రభావాల కారణంగా ఫొటోను తొలగించినట్లు కూడా విస్తృతంగా ప్రచారం జరుగుతోంది.(malayalam.indiatoday.in టీమ్ ఫ్యాక్ట్ చెక్ చేసిన స్టోరీ ఇది)"బస్సు ప్రమాదానికి గురైనప్పుడు, డ్రైవర్ సాధారణంగా దిగి పారిపోతాడు. కోవిషీల్డ్ తీవ్రమైన దుష్ప్రభావాలకు కారణమవుతుందని తయారీదారులు కోర్టులో అంగీకరించవలసి వచ్చింది....


ప్రధానిని విమర్శించడం పద్ధతి కాదు : రాందాస్​అథవాలె

ప్రధానిని విమర్శించడం పద్ధతి కాదు : రాందాస్​అథవాలె రాహుల్ అసత్య ఆరోపణలు చేస్తున్నరు ఖైరతాబాద్, వెలుగు: కాంగ్రెస్ మాజీచీఫ్ రాహుల్ గాంధీ పదేపదే ప్రధాని మోదీని విమర్శిస్తున్నారని, అది మంచి పద్ధతి కాదని  కేంద్రమంత్రి ,రిపబ్లికన్​  పార్టీ ఆఫ్​ ఇండియా జాతీయ అధ్యక్షుడు రాందాస్​ అథవాలె అన్నారు. సోమావారం ప్రెస్​క్లబ్​లో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడార...


రాజ్యాంగాన్ని కాపాడాలంటే బీజేపీని ఓడించాల్సిందే : కూనంనేని

రాజ్యాంగాన్ని కాపాడాలంటే బీజేపీని ఓడించాల్సిందే : కూనంనేని రాజ్యాంగాన్ని కాపాడాలంటే బీజేపీని ఓడించాల్సిందే అని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివ రావు అన్నారు. రాష్ట్రంలో బీఆర్ఎ స్ ఎగ్జాస్ట్ అయ్యిందని.. ఆపార్టీకి ఇప్పుడు తెలంగాణ సెంటిమెంట్ లేదని అన్నారు. బషీర్ బాగ్ ప్రెస్ క్లబ్ లో జరిగిన మీట్ ది ప్రెస్ లో కూనంనేని మాట్ల...


హైదరాబాద్‌‌లో ఒక్కసారిగా కుండపోత వర్షం.. ఎక్కడికక్కడ నిలిచిపోయిన ట్రాఫిక్

హైదారాబాద్‌లో సాయంత్రం వరకు భానుడు తన ప్రతాపం చూపిస్తే.. సాయంత్రం ఐదింటి సమయంలో ఒక్కసారిగా వరుణుడు మాస్ ఎంట్రీ ఇచ్చాడు. సూర్యున్ని కారు మబ్బులు కమ్మేసి.. చిమ్మని చీకట్లు అలుముకోగా.. మేఘం విరిగిపడిందా అన్నట్టుగా వరుణుడు తన ప్రతాపాన్ని చూపించాడు. ఉరుములు, మెరుపులు, ఈదురు గాలులతో కుండపోతగా వర్షం కురిసింది. దీంతో.. నగరంలోని పలు ప్రాంతాల్లో విద్యుత్ అంతరాయం ఏర్పడగా.. చాలా చోట్ల పెద్ద ఎత్తున ట్రాఫిక్ జామ్ అయ్యింది.


వంశీ గెలుపు కోసం విస్తృత ప్రచారం

వంశీ గెలుపు కోసం విస్తృత ప్రచారం పెద్దపల్లి, వెలుగు : పెద్దపల్లి, మంథని, రామగుండం నియోజకవర్గాల్లో కాంగ్రెస్​ నాయకులు సోమవారం ఎంపీ అభ్యర్థి వంశీకృష్ణ గెలుపు కోసం ఇంటింటి ప్రచారం చేశారు.  పెద్దపల్లి మండలం బోజన్నపేట గ్రామంలో బాలసాని సతీశ్‌‌ ఆధ్వర్యంలో లీడర్లు ఇంటింటికి వెళ్లి ప్రచారం చేశారు. మంథని నియోజకర్గంలోని కమాన్​పూర్​ గ్రామంలో కాంగ్రెస్​ నాయకుడు...