Trending:


ఐకే రెడ్డి, శ్రీహరి రావు మధ్య సయోధ్య కుదిరేనా?

ఐకే రెడ్డి, శ్రీహరి రావు మధ్య  సయోధ్య కుదిరేనా? ఇద్దరి మధ్య సమన్వయంపై మంత్రి సీతక్క దృష్టి శ్రీహరి రావు ఇంట్లో సమావేశం కలిసిపోతే హస్తానికి చేకూరనున్న బలం నిర్మల్, వెలుగు: మాజీ మంత్రి ఇంద్రకరణ్​రెడ్డి ఎట్టకేలకు కాంగ్రెస్​లో చేరారు. ఆయన హస్తం గూటికి చేరుతారని కొద్దికాలం పాటు సాగిన సందిగ్ధతకు బుధవారం తెరపడింది. కాంగ్రెస్​రాష్ట్ర వ్యవహారాల ఇన్​చార్జి...


బెయిల్ మీదున్నోళ్లు దేశాన్ని ఉద్ధరిస్తరా?

బెయిల్ మీదున్నోళ్లు దేశాన్ని ఉద్ధరిస్తరా? ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ హైదరాబాద్, వెలుగు :  కాంగ్రెస్ స్టార్ క్యాంపెయినర్లు​ రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డి బెయిల్ మీద బయట ఉన్నారని, వాళ్లు దేశాన్ని ఏం ఉద్ధరిస్తారని బీజేపీ నేత ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ అన్నారు. వారిపై అవినీతి, పరువు నష్టం, ఏసీబీ, ఈడీ కేసులు ఉన్నాయన్నారు. పరువు నష్టం కేసులో రెండేండ్ల జైలు శిక్ష పడితే...


జొన్నల కొనుగోళ్ల పరిమితి పెంపు

జొన్నల కొనుగోళ్ల పరిమితి పెంపు హైదరాబాద్​, వెలుగు: జొన్నల కొనుగోళ్ల పరిమితిని రాష్ట్ర ప్రభుత్వం పెంచింది. ఎకరానికి 8.85 క్వింటాళ్లు కొనుగోలు చేసేలా గతంలో పరిమితులు ఉండగా.. ఈసారి డిమాండ్​ పెరగడంతో ఆ పరిమితిని పెంచాలని రైతులు డిమాండ్​ చేశారు. దీంతో ఆదిలాబాద్, నిర్మల్​ జిల్లాల్లో జొన్నల కొనుగోళ్ల పరిమితిని ఎకరాకు 12 క్వింటాళ్లకు పెంచామని వ్యవసాయ శాఖ  ...


Warangal : వరంగల్ శివారులో అమానుషం - పసికందును ప్రాణాలతోనే పాతిపెట్టారు..!

Warangal City News : వరంగల్ శివారులో అత్యంత అమానుషమైన ఘటన వెలుగు చూసింది. అప్పుడే పుట్టిన బిడ్డను బతికుండగానే మట్టిలో పాతిపెట్టారు. కాసేపటికే ఓ లారీ డ్రైవర్ గమనించటంతో ఆ నవజాత శిశువు ప్రాణాలతో బయటపడింది.


రేవంత్ సర్కార్‌ కూలిపోవాలని పూజలు చేయండి: అర్వింద్‌

రేవంత్ సర్కార్‌ కూలిపోవాలని పూజలు చేయండి: అర్వింద్‌ నవీపేట్, వెలుగు: తెలంగాణలో రేవంత్‌రెడ్డి సర్కార్ కూలిపోయి బీజేపీ ప్రభుత్వం రావాలని పూజలు చేయాలని నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్ కోరారు. నిజామాబాద్‌ జిల్లా నవీపేట్‌ మండలంలో శనివారం నిర్వహించిన కార్నర్‌ మీటింగ్‌లో ఆయన మాట్లాడారు. అక్షింతలతో అయోధ్య రాముడికి పూజలు చేసినట్లుగానే.. రేవంత్ సర్కార్ కూల...


ప్రజాసేవ చేసేందుకు రాజకీయాల్లోకి వచ్చా: గడ్డం వంశీకృష్ణ

ప్రజాసేవ చేసేందుకు రాజకీయాల్లోకి వచ్చా: గడ్డం వంశీకృష్ణ మంచిర్యాల: ఇప్పటివరకు విశాఖ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా అనేక సేవా కార్యక్రమాలు చేపట్టాను.. ఇప్పుడు ప్రజాసేవ చేసేందుకు రాజకీయాల్లోకి వచ్చానని పెద్దపల్లి పార్లమెంట్ కాంగ్రెస్ అభ్యర్థి గడ్డం వంశీకృష్ణ అన్నారు. తాను సొంతంగా సోలార్ బైక్ కంపెనీ ఏర్పాటు చేసి 500 మంది నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పిం...


కాంగ్రెస్ ​అన్ని వర్గాలను సమానంగా చూస్తుంది

కాంగ్రెస్ ​అన్ని వర్గాలను సమానంగా చూస్తుంది మైలార్ దేవ్ పల్లిలో చేవెళ్ల కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి రంజిత్ రెడ్డి ర్యాలీ శంషాబాద్, వెలుగు : కాంగ్రెస్​పార్టీ అన్ని మతాలను, కులాలను సమానంగా చూస్తుందని చేవెళ్ల ఎంపీ అభ్యర్థి రంజిత్ రెడ్డి చెప్పారు. కొన్ని పార్టీలు దేవుళ్లను అడ్డం పెట్టుకుని రాజకీయం చేస్తున్నాయని ఎద్దేవా చేశారు. శనివారం రాజేంద్ర నగర్ సర్కిల్...


42 ఎకరాల విల్లా.. ఉచితంగా ఇస్తామంటున్న ప్రభుత్వం.. రూపాయి కూడా కట్టక్కర్లేదు

ఏదైనా ఉచితంగా వస్తుందంటే చాలు జనం ఎగబడిపోతూ ఉంటారు. కానీ అక్కడి ప్రభుత్వం మాత్రం ఓ భారీ విల్లాను ఉచితంగా ఇస్తాం అంటున్నా ఎవరూ ముందుకు రావడం లేదు. అది కూడా 42 ఎకరాల్లో ఉన్న ఈ విల్లా ప్రభుత్వ అధీనంలో ఉండగా.. దాన్ని వదిలించుకోవాలని అక్కడి ప్రభుత్వం భావిస్తోంది. అందుకే దాన్ని ఫ్రీగా ఇచ్చేస్తాం అని తెలిపింది. ఇంతకీ ఆ విల్లా ఎవరిది. ప్రభుత్వ అధీనంలోకి ఎందుకు వచ్చింది. దాన్ని ప్రభుత్వం ఫ్రీగా ఇస్తాం అన్నా ఎందుకు ఎవరూ ముందుకు రావడం లేదు అనే విషయాలు ఈ...


కాంగ్రెస్​వి అబద్ధాలు.. బీజేపొళ్లు లంగలు.. ఆ రెండు పార్టీలను నమ్మొద్దు: కేటీఆర్

కాంగ్రెస్​వి అబద్ధాలు.. బీజేపొళ్లు లంగలు.. ఆ రెండు పార్టీలను నమ్మొద్దు: కేటీఆర్ రాజన్న సిరిసిల్ల/ జీడిమెట్ల, వెలుగు:  కాంగ్రెస్​వి పచ్చి అబద్ధాలు.. బీజేపొళ్లు లంగలు, ఆ రెండు పార్టీలను నమ్మి ప్రజలు మోసపొవద్దని కేటీఆర్ అన్నారు. శనివారం ఉదయం 7 గంటలకు సిరిసిల్లలోని రైతు బజార్, లేబర్ అడ్డా, బీవైనగర్, వెంకంపేట కాలనీల్లో పర్యటించారు. ఈ సందర్భంగా కేటీఆర్ మ...


సింహాచలం చందనోత్సవానికి వెళ్లే భక్తులకు ముఖ్య గమనిక.. ఆ దర్శనాలు ఉండవు, ఈ విషయాలు తెలుసుకోండి

Simhachalam Chandanotsavam: సింహాచలంలో ఈ నెల 10న జరగనున్న చందనోత్సవంలో భక్తులందరికీ అప్పన్న నిజరూప దర్శనం కల్పిస్తామంటున్నారు అధికారులు. ఈ ఏడాది ఎన్నికల కోడ్‌ అమలులో ఉండటంతో ప్రొటోకాల్‌ దర్శనాలు ఉండవని తెలిపారు. అంతేకాదు అంతరాలయ దర్శనాన్ని కూడా పూర్తిగా రద్దు చేయగా.. వైదిక కార్యక్రమాల అనంతరం వేకువజామున నాలుగు గంటల నుంచి గంటపాటు ధర్మకర్తల కుటుంబానికి, దేవాలయ దాతలకు మాత్రమే అంతరాలయ దర్శనం ఉంటుందని క్లారిటీ ఇచ్చారు. ఈ నెల 10న మధ్యాహ్నం 3 నుంచి 4...


Infants Death In Kochi: దిగ్భ్రాంతికర ఘటన.. బాత్రూమ్‌ లో డెలీవరీ.. బాల్కనీ నుంచి శిశువును విసిరేసిన ఎంబీఏ విద్యార్థిని..

Kerala news: ఎంబీఏ విద్యార్థిని బాత్రూమ్ లో డెలివరీ అయ్యింది. అంతేకాకుండా.. ఆ శిశువును ఒక కవర్ లో చుట్టేసి, బాల్కనీ నుంచి బైటకు పడేసింది. ఈ ఘటన ప్రస్తుతం దేశంలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. దీనిపై పోలీసులు విచారణ చేపట్టారు.


గెలుపు కోసం బీఆర్‌ఎస్‌ మెజార్టీపై కాంగ్రెస్‌ ఫోకస్‌

గెలుపు కోసం బీఆర్‌ఎస్‌ మెజార్టీపై కాంగ్రెస్‌ ఫోకస్‌ ఆసక్తికరంగా ఖమ్మం రాజకీయం అసెంబ్లీ ఎన్నికల్లో స్వీప్‌ చేసిన కాంగ్రెస్‌ ఎంపీ ఎన్నికల్లో భారీ మెజార్టీ సాధించేందుకు ప్రయత్నాలు సిట్టింగ్‌‌‌‌ స్థానాన్ని కాపాడుకునే పనిలో బీఆర్‌‌‌‌ఎస్‌‌‌‌ కూటమిలో భాగంగా కాంగ్రెస్‌‌‌‌కే సీపీఎం, సీపీఐ మద్దతు ఖమ్మం, వెలుగు :  ఖమ్మం పార్లమెంట్ సెగ్మెంట్‌‌‌‌లో కాంగ్రెస...


ఈ డాగ్ పోటీలకు దిగితే బహుమతుల పంట పండాల్సిందే..!!

మనుషులకు,గుర్రాలకు పోటీలు ఎలా ఉంటాయో... డాగ్స్ కూడా పోటీలు ఉంటాయి. ప్రస్తుత కాలంలో చాలా మంది ఇండ్లలో కుక్కలను పెంచుకోవడం ఫ్యాషన్ గా మారింది.అలాగే కరీంనగర్ కు చెందిన డాగ్ లవర్ రాజ్ కుమార్ అనే వ్యక్తి వివిధ జాతులకు చెందిన డాగ్స్ ను పెంచుతున్నాడు. ఐతే ఇతని దగ్గర అమెరికకు చెందిన బిగేల్ డాగ్ ఉంది. దీని పేరు రెమో. ఐతే దీనికి అన్ని రకాల ట్రైనింగ్ ఇచ్చి ఎక్కడ డాగ్స్ పోటీలు పెట్టిన అక్కడికి తీసుకెళ్తుంటారు. ఈ పోటీలో పాల్గొన బిగిల్ డాగ్ రెమో తప్పకుండ మొదటి బహుమతి తెస్తుంది.. తాజాగా మొన్న జరిగిన అల్ ఇండియా ఛాంపియన్ 113th,114th,డాగ్ షో లో హైదరాబాద్ లోని నాంపల్లిలోని ఎగ్జిబి షన్ గ్రౌండ్ లో జరిగిన ఆంద్రప్రదేశ్ కెనాల్ క్లబ్ హైదరాబాద్ నిర్వహించిన డాగ్ షో లో అల్ ఇండియా ఛాంపియన్ గా నిలిచి అందరి మన్నలను చూరగుంది. ఐతే ఇవే కాకుండా గతంలో నిర్వహించిన అనేక డాగ్స్ షో లో ఛాంపియన్ గా నిలిచింది డాగ్ (రేమో). గతంలో బిగిల్ డాగ్ తల్లి మూడు సార్లు అంతర్జాతీయ ఛాంపియన్ నిలిచింది..తరువాత ఇప్పుడు ఇది పోటీలో పాల్గొని నాలుగు సార్లు ఆల్ ఇండియా ఛాంపియన్ గా నిలిచింది. తరువాత ఇప్పుడు ఇది పోటీలో పాల్గొని నాలుగు సార్లు ఆల్ ఇండియా ఛాంపియన్ గా నిలిచింది. ఈ సందర్బంగా కోచ్ రాజు కుమార్ లోకల్ 18తో మాట్లాడుతు చిన్న నాటినుండే నాకు డాగ్స్ అంటే ఇష్టం. నా దగ్గర వచ్చేసి పోమేరియన్ పప్పీస్, గోల్డెన్ రేట్రివర్, జర్మన్ షేఫడ్ ఇలా వివిధ జాతికి చెందిన డాగ్స్ ను పెంచుతున్నాని అంటున్నాడు రాజ్ కుమార్. కొన్నిటికీ ప్రత్యేకమైన శిక్షణ ఇచ్చి వాటిని జాతీయ స్థాయి డాగ్స్ పోటీలకు తీసుకెళ్తానని అవి కూడా మంచి డాగ్స్ పోటీలలో పాల్గొని మంచి ఫార్ఫామేన్స్ కనబరుస్తాయని అంటున్నారు..ఇప్పటికే పది సార్లు నాదగ్గర ఉన్న డాగ్స్ పోటీలలో పాల్గొని పదికి పది ప్రైజెస్ సాధించినవి.. పోటీలో పాల్గొన్న డాగ్స్ కు ముఖ్యంగా దాని ఫిట్నెస్, అలాగే నడక, మెమొరీ పవర్ ను చూసి జడ్జెస్ సెలెక్ట్ చేస్తారని రాజ్ కుమార్ లొకేల్ 18కి వివరించారు.. కరీంనగర్ లో ఎవరికైనా డాగ్స్ కావాలంటే నన్ను సంప్రదిస్తే అన్ని జాతులకు చెందిన డాగ్స్ ను అమ్ముతానని తెలిపారు..


నేడు తెలంగాణకు రాహుల్ గాంధీ .. నిర్మల్, అలంపూర్​ సభలు

నేడు తెలంగాణకు రాహుల్ గాంధీ .. నిర్మల్, అలంపూర్​ సభలు హైదరాబాద్, వెలుగు: లోక్ సభ ఎన్నికల ప్రచారానికి కేవలం 7 రోజులే మిగిలి ఉండడంతో రాష్ట్రంలో ప్రచారం కోసం కాంగ్రెస్ అగ్ర నేతల షెడ్యూల్ ఖరారు అయింది. ఆదివారం రాహుల్ గాంధీ, సోమవారం ప్రియాంక గాంధీ తెలంగాణకు రానున్నారు. రాష్ట్రంలో ఏర్పాటు చేసిన ఎన్నికల సభల్లో పాల్గొననున్నారు. ఆదివారం ఉదయం 11 గంటలకు ఆదిలా...


ప్రజా ప్రభుత్వాన్ని పడగొట్టేందుకు కుట్రలు: సీఎం రేవంత్​రెడ్డి

ప్రజా ప్రభుత్వాన్ని పడగొట్టేందుకు కుట్రలు: సీఎం రేవంత్​రెడ్డి మహబూబ్​నగర్​/వనపర్తి/కొత్తకోట, వెలుగు: రాష్ట్రంలోని ప్రజా ప్రభుత్వాన్ని పడగొట్టేందుకు బీఆర్​ఎస్​, బీజేపీ నేతలు కుట్రలు పన్నుతున్నారని సీఎం రేవంత్​రెడ్డి మండిపడ్డారు. ‘‘మేం అధికారంలోకి వచ్చి 150 రోజులు కాలేదు. కాకులు, గద్దల్లాగా నువ్వు దిగిపో అంటున్నరు. నీ కడుపులో పొడుస్తం.. వీపులో పొడుస్...


ఏపీలో ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్‌న్యూస్.. పోలింగ్‌కు ముందే ఒక రోజు సెలవు, ఆదేశాలు వచ్చేశాయి

Ap Govt Employees Election Duty Leave: ఏపీ ఎన్నికల విధుల్లో ఉన్న ఉద్యోగులకు ఈసీ గుడ్‌న్యూస్ చెప్పింది. ఎన్నికల విధుల్లో ఉన్న ఉద్యోగులు తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు ఒకరోజు ప్రత్యేక సాధారణ సెలవును మంజూరు చేశారు. ఈ మేరకు రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్‌ కుమార్‌ మీనా శనివారం ఉత్తర్వులను జారీ చేశారు. భారత ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు జీవోఆర్టీ నెంబర్‌ 845ను జారీ అయ్యింది. సెక్రటేరియట్‌ విభాగాలు, విభాగాల అధిపతి, జిల్లా కలెక్టర్లు, ఇతర...


TS SET Notification 2024 : తెలంగాణ సెట్ నోటిఫికేషన్ విడుదల - మే 14 నుంచి దరఖాస్తులు, ముఖ్య తేదీలివే

TS SET Notification 2024 : తెలంగాణ సెట్ - 2024 నోటిఫికేషన్(TS SET Notification) విడుదలైంది. మే 14వ తేదీ నుంచి ఆన్ లైన్ దరఖాస్తులు ప్రారంభం కానున్నాయి. http://telanganaset.org లింక్ తో దరఖాస్తుల ప్రాసెస్ పూర్తి చేసుకోవాలి.


చేతబడి పేరుతో ఇద్దరి సజీవ దహనం, నిందితుల్లో బాధితురాలి భర్త, కొడుకు

‘‘మా బావ నా సోదరిని తీసుకొచ్చి మా ఇంట్లో విడిచి వెళ్లారు. ఆరోజు రాత్రి ఆమె మా ఇంట్లోనే ఉంది. మరుసటి రోజు దాదాపు 10-12 మంది గ్రామస్తులు వచ్చి బలవంతంగా ఆమెను మా ఇంటి నుంచి తీసుకెళ్లారు.’’


పార్ట్​టైం జాబ్ ​పేరుతో రూ.24లక్షలు కొట్టేసిన్రు

పార్ట్​టైం జాబ్ ​పేరుతో రూ.24లక్షలు కొట్టేసిన్రు బషీర్ బాగ్, వెలుగు : పార్ట్‌‌టైం జాబ్‌‌ పేరుతో సైబర్​నేరగాళ్లు ఓ మహిళ నుంచి రూ.24లక్షలు కొట్టేశారు. హైదరాబాద్ సైబర్‌‌ క్రైమ్‌‌ ఏసీపీ శివమారుతి తెలిపిన వివరాల ప్రకారం.. సిటీకి చెందిన మహిళ(35) టెలిగ్రామ్ అకౌంట్​కు పార్ట్‌‌ టైం జాబ్​పేరుతో ఓ మెసేజ్‌‌ వచ్చింది. స్పందించిన ఆమెకు యూట్యూబ్‌‌, ఇతర సోషల్‌‌ య...


ముగిసిన కాసరవేణి రవి అంత్యక్రియలు

ముగిసిన కాసరవేణి రవి అంత్యక్రియలు భీమదేవరపల్లి, వెలుగు: ఛత్తీస్‌‌‌‌గఢ్‌‌‌‌లోని అబూజ్‌‌‌‌మడ్‌‌‌‌ ప్రాంతంలో ఐదు రోజుల క్రితం జరిగిన ఎన్‌‌‌‌కౌంటర్‌‌‌‌లో చనిపోయిన కాసరవేణి రవి అలియాస్‌‌‌‌ వినయ్‌‌‌‌ అంత్యక్రియలు శనివారం ముగిశాయి. బెల్లంపల్లికి చెందిన రవి 33 ఏళ్ల క్రితం మావోయిస్టు ఉద్యమంలో చేరి అంచెలంచెలుగా దండకారణ్య డివిజన్‌‌‌‌ కమిటీ సభ్యుడి వరకు ఎదిగాడ...


నిప్పుల కుంపటిగా తెలంగాణ.. వడదెబ్బతో ఒక్కరోజే 19 మంది మృతి..!

తెలంగాణలో భానుడు ఉగ్రరూపం చూపిస్తున్నాడు. రికార్డు స్థాయి ఉష్ణోగ్రతలు ప్రజలు అల్లాడిపోతున్నారు. గతంలో ఎన్నడూ లేనంతగా ఎండలు మండిపోతున్నాయి. మే నెల మెుదటి వారంలోనే రికార్డు స్థాయిలో 46 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదు కాగా.. తెలంగాణ వ్యాప్తంగా శనివారం 19 మంది వడదెబ్బతో ప్రాణాలు కోల్పోయారు.


కేసీఆర్​..ముక్కు నేలకు రాస్తవా? : సీఎం రేవంత్​రెడ్డి

కేసీఆర్​..ముక్కు నేలకు రాస్తవా? : సీఎం రేవంత్​రెడ్డి ఈ నెల 8లోపు రైతు భరోసా పూర్తి చేస్తం.. లేకుంటే నేను ముక్కు నేలకు రాస్త సవాల్​కు సిద్ధమా?:  రాష్ట్ర ప్రజలపై నువ్వు మోపిన అప్పు రూ. 7 లక్షల కోట్లు ఇప్పటిదాకా రూ. 27 వేల కోట్లు మిత్తీలకే కట్టినం భట్టి గట్టోడు కాబట్టి ఆర్థిక పరిస్థితిని గాడిలో పెడ్తున్నడు పంద్రాగస్టులోపు రుణ మాఫీ చేసి తీరుతాం ప...


రూ.45 కాదు ఇక రూ.1,000 కట్టాల్సిందే.. తెలంగాణ వాసులకు భారీ షాక్!

ప్రజలకు ఝలక్. ఏంటని అనుకుంటున్నారా? అయితే మీరు కచ్చితంగా ఈ విషయం తెలుసుకోవాల్సిందే. ఫీజు భారీగా పెరిగింది. దీంతో తెలంగాణ ప్రజలపై ప్రతికూల ప్రభావం పడొచ్చు. ఇంతకి ఏ ఫీజు పెరిగింది? ఎంత పెరిగింది? వంటి అంశాలు మనం ఇప్పుడు తెలుసుకుందాం. భూ రికార్డుల సమీకృత నిర్వహణ కోసం రూపొందించిన ధరణి పోర్టల్‌లో డిజిటల్ సిగ్నేచర్ పెండింగ్‌కు రూ.45గా ఉన్న రుసుమును ప్రభుత్వం భారీగా పెంచేసింది. దీని వల్ల చాలా మందిపపై ప్రభావం పడుతుందని చెప్పుకోవచ్చు. ఇంతకీ కొత్త రుసుము ఏ స్థాయిలో ఉందో ఇప్పుడు చూద్దాం. ఇది వరకు రూ.45గా ఉన్న రుసుము ఇప్పుడు ఏకంగా రూ.1000కి చేరింది. అంటే ఫీజు భారీగా పెరిగిందని చెప్పుకోవచ్చు. ఏదైనా కారణం వల్ల పట్టాదారు పాస్ బుక్ రాకపోతే కొత్త పాస్ బుక్ జారీ కోసం పెట్టుకునే దరఖాస్తును డిజిటల్ సిగ్నేచర్ పెండింగ్ అంటారు. పోర్టల్ లో ఈ అంశం ఇంతకుముందు గ్రీవెన్స్ రిలేటెడ్ టూ ల్యాండ్ మ్యాటర్ పరిధిలో ఉండేది. తాజాగా టెక్నికల్ మాడ్యూల్-33 పరిధిలోకి మార్చారు. అందువల్ల ప్రజలు ఈ విషయాన్ని గమనించాలి. ఇది వరకు మాదిరిగా రూ.45 మాత్రమే ఉంటుందని భావించొద్దు. ఇప్పుడు రూ.1000కు చేరిందని గుర్తించుకోవాలి. రుసుము భారీ పెంపు వల్ల చాలా మందిపై ప్రతికూల ప్రభావం పడే ఛాన్స్ ఉంటుంది. అలాగే ధరణి పోర్టల్‌ను పునర్నిర్మించే ప్రక్రియలో భాగంగా పలు కీలక సిఫారసులు రూపొందుతున్నాయి. రాష్ట్రంలో అమల్లో ఉన్న రికార్డ్‌ ఆఫ్‌ రైట్స్‌ చట్టం–2020ని పూర్తి స్థాయిలో ప్రక్షాళన చేయాల్సిందేనని ధరణి పునర్నిర్మాణ కమిటీ భావిస్తున్నట్టు తెలుస్తోంది. ఈ చట్టంలో 12 సెక్షన్లు పొందుపరచగా అన్ని సెక్షన్లలో పెద్ద ఎత్తున సవరణలను ప్రతిపాదించాలని నిర్ణయించినట్లు సమాచారం. కాగా ధరణి పోర్టల్‌ పేరు మారాలన్నా, వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్లు, రికార్డుల నిర్వహణ, సమస్యల పరిష్కారంలో అధికార వికేంద్రీకరణ జరగాలన్నా కూడా చట్ట సవరణలు చేయడం లేదా కొత్త చట్టం అమల్లోకి తీసుకురావడం అనివార్యమని కమిటీ సిఫారసు చేయనుందనే సమాచారం వెలువడుతోంది. అంతేకాకుండా ప్రస్తుతానికి ధరణి సమస్యల పరిష్కార ప్రక్రియ ఎక్కువగా కలెక్టర్ల చేతిలో ఉంది. ఇటీవల జారీ చేసిన సర్క్యులర్‌ ప్రకారం ఈ అధికారాలు కొన్ని అదనపు కలెక్టర్లు, ఆర్డీవోలు, తహశీల్దార్లకు కట్టబెట్టారు. కానీ వీటికి చట్టబద్ధత కలగాలంటే మాత్రం ఆర్‌వోఆర్‌ చట్టంలో మార్పులు తప్పనిసరిగా చేయాలని కమిటీ భావిస్తోంది. తహసీల్దార్ల నుంచి ఈ అధికారాలను తప్పించాలనే యోచనలో ధరణీ కమిటీ ఉన్నట్టు తెలుస్తోంది. ధరణి పోర్టల్‌ బాధ్యతలను ప్రైవేట్‌ కంపెనీకి కాకుండా నేషనల్‌ ఇన్ఫర్మాటిక్స్‌ సెంటర్‌ లేదా సెంటర్‌ ఫర్‌ గుడ్‌ గవర్నెన్స్‌ కు అప్పగించాలని కమిటీ సిఫారసు చేయొచ్చు.


విద్యార్థులకు విజ్ఞానాన్ని పెంపొందించే దిశగా సైన్స్ సెంటర్..

వరంగల్ నగరంలోని హంటర్ రోడ్డులో అందమైన పులిగుట్ట కొండపై ఉన్న ఈ సైన్స్ సెంటర్ 2015లో అప్పటి విద్యా శాఖ మంత్రి కడియం శ్రీహరి ప్రారంభించారు. అప్పటి నుండి విద్యార్థులు, ఉపాధ్యాయులు, సైన్స్ ఆరాధకులను ఆకర్షిస్తోంది. ఇది తెలంగాణలో సుమారు రూ. 6 కోట్లతో అభివృద్ధి చేశారు. ఇక్కడ మొత్తం 69 సైన్స్ ఎగ్జిబిషన్స్ ఉంటాయి. ఫిజిక్స్, బయాలజీ, ఎన్విరాన్మెంట్ ఉంటాయి. ఇక్కడికి ప్రతి రోజు వందల సంఖ్యలో విద్యార్థులు వస్తుంటారు విద్యార్థులకు అన్ని విషయాలపై అవగాహన కల్పించేలా చేసేందుకే ఈ రీజనల్ సైన్స్ సెంటర్ ను ఏర్పాటు చేశారు. పాఠ్యపుస్తకాల్లోని క్లిష్టమైన అంశాలను స్కూల్‌ విద్యార్థులకు సులువుగా తెలియజేయడమే లక్ష్యంగా సైన్స్‌సెంటర్‌ ఏర్పాటైంది. శాస్త్ర, సాంకేతిక అంశాలపై విద్యార్థులకు అవగాహన కల్పించేందుకే సైన్స్‌ సెంటర్‌ ఏర్పాటైంది. అధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో వరంగల్‌ సైన్స్‌ సెంటర్‌ నిర్మాణమైంది.. స్కూల్‌ పిల్లలకు సైన్స్‌ ఆవిష్కరణలపై అవగాహన పెంచడం, వారి ఆలోచనలకు కార్యరూపం దాల్చడమే లక్ష్యంగా రీజినల్‌ సైన్స్‌ సెంటర్‌ ఏర్పాటైంది. మ్యాథ్స్‌, ఫిజిక్స్‌, కెమిస్ట్రీ, బయాలజీ సబ్జెక్టులోని అంశాలను పిల్లలకు సులభంగా అవగాహన కలిగించేలా సైన్స్‌ సెంటర్‌లో ఎగ్జిబిషన్ ఏర్పాటు చేశారు. సైన్స్‌ సెంటర్‌ భవనంలో ఏడు విశాలమైన హాళ్లు, స్పేస్‌ సోలార్‌ పవర్‌, 5డి థియేటర్‌, పర్యావరణ కాలుష్యం, మానవ శరీర నిర్మాణ నమూనాలు, ఎడ్యుకేషన్‌ త్రూ శాటిలైట్‌ హాల్‌ ఉన్నాయి.దేశవ్యాప్తంగా ఉన్న ప్రతిష్టాత్మక సాంకేతిక సంస్థల్లో జరిగే వైజ్ఞానిక సదస్సులను వరంగల్‌ రీజినల్‌ సైన్స్‌ సెంటర్‌లోని హాల్‌లో ప్రత్యక్షంగా చూడవచ్చు. చర్చల్లోనూ వరంగల్‌ సెంటర్‌ నుంచి పాల్గొనవచ్చు. ఈ సెంటర్‌లోనే తాజాగా ఇన్నోవేషన్‌ హబ్‌ నిర్మాణం జరుగుతోంది. తెలంగాణ రాష్ట్ర శాస్త్ర సాంకేతిక శాఖ ఆధ్వర్యంలోని టీఎస్‌కాస్ట్‌ దీన్ని నిర్వహిస్తుంది. ఇన్నోవేషన్ హబ్ వినూత్న ఆలోచనలను పెంపొందించడానికి, వాటిని అభివృద్ధి చేయడానికి విద్యార్థులకు ఆకర్షణీయమైన అభ్యాస పర్యావరణ వ్యవస్థను అందించడంతో పాటు ఆవిష్కరణ, సృజనాత్మకతను ప్రోత్సహిస్తుంది. ఇందులో ఆరవ తరగతి నుండి ఇంటర్ మీడియేట్ విద్యార్థులకు ఉపయోగపడే విధంగా సైన్స్ ప్రిన్సిపల్స్ డిజైన్ చేశారు. తెలంగాణ స్టేట్ కౌన్సిల్ అఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ రాష్ట్ర ప్రభుత్వ సంస్థ ఏర్పాటు చేసింది. గవర్నమెంట్ అఫ్ ఇండియాలో నిర్వహించే కార్యక్రమాలన్నీ ఇక్కడ నిర్వహిస్తారు. కాగా ఈ సైన్స్ సెంటర్‌కు నిత్యం ఉమ్మడి వరంగల్ జిల్లా నుంచి కాకుండా రాష్ట్ర నలుమూలల నుంచి కూడా వందలాది మంది విద్యార్థులు వస్తుంటారు. ఈ సైన్ సెంటర్ ను వీక్షించడం చాలా సంతోషంగా ఉందని విద్యార్థులు తెలిపారు. ఈ సైన్స్ సెంటర్ ను వీక్షించడం ద్వారా సైన్స్ పరిజ్ఞానంపై అవగాహన వచ్చిందన్నారు.


Revanth Reddy: రైతులకు సీఎం శుభవార్త.. ఎల్లుండే మీ ఖాతాల్లోకి రైతుబంధు డబ్బులు..

రైతు సంక్షేమమే ధ్యేయంగా ప్రభుత్వాలు ముందుకెళ్తున్నాయి. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల ఆర్ధిక పరిపుష్టి దృష్టి పెట్టి వారికి సాయం అందిస్తోంది. ఈ నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం మరోసారి గుడ్ న్యూస్ చెప్పింది. ఈ మేరకు సీఎం రేవంత్ రెడ్డి కీలక విషయం వెల్లడించారు. ఇప్పటివరకు మొత్తం 69 మంది లక్షల మంది లబ్ధిదారుల్లో 65 లక్షల మందికి రైతు భరోసా డబ్బు అందాయని అన్నారు సీఎం. రాష్ట్రంలో డబ్బు అందాల్సిన రైతులు ఇంకా మిగిలింది 4 లక్షల మందే అని చెప్పారు. వీళ్లందరి అకౌంట్లలోనూ డబ్బు జమ చేస్తామని అన్నారు. మే 8వ తేదీ లోగా రైతు డబ్బులు జమ చేస్తామని సీఎం స్పష్టం చేశారు. గతంలో 5 ఎకరాల లోపు పొలం ఉన్న రైతులు ఈ డబ్బు జమ చేయగా.. 5 ఎకరాల కంటే ఎక్కువ ఉన్న రైతులకు డబ్బులు జమ చేయలేదు. ఈ క్రమంలోనే మిగిలిన రైతులందరికీ రైతు భరోసా ఇచ్చే బాధ్యత తనదని హామీ ఇచ్చారు. రైతుబంధు డబ్బులు రావడం లేదని ప్రశ్నించిన వారు.. ఎవరికైనా బకాయి ఉందని నిరూపిస్తే.. అమరవీరుల స్థూపం ముందు ముక్కు నేలకు రాసి క్షమాపణ చెబుతానని అన్నారు. ఒకవేళ బకాయి ఉందని నిరూపించకపోతే కేసీఆర్ ముక్కు నేలకు రాసి క్షమాపణలు చెప్పాలన్నారు. భద్రాచలం రాములవారి సాక్షిగా తెలంగాణ రైతులకు ఆగస్టు 15వ తేదీ లోగా రుణమాఫీ చేసి రైతుల రుణం తీర్చుకుంటానని సీఎం తెలిపారు. రుణమాఫీ చేసే బాధ్యత తనది, భట్టి విక్రమార్కది, తుమ్మల నాగేశ్వరరావుది అని తెలిపారు. ప్రస్తుతం ఒక్క ఏడాదికి గాను ఎకరానికి అందుతున్న రూ. 10 వేల సాయాన్ని రూ. 15 వేలకు పెంచనుంది ప్రభుత్వం. ఈ స్కీమ్ కు సంబంధించిన విధి విధానాలు రెడీ చేసే పనిలో ఉంది కాంగ్రెస్ సర్కార్. ఎన్నికల ప్రచారంలో భాగంగా కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన 6 గ్యారెంటీలపై పూర్తి ఫోకస్ పెట్టింది రేవంత్ రెడ్డి ప్రభుత్వం. ప్రజా సంక్షేమం దిశగా వేగంగా అడుగులేస్తూ పలు కీలక పథకాల అమలుకు శ్రీకారం చుడుతోంది. దీంతో రాష్ట్రంలోని పేద, మధ్య తరగతి వర్గాలు ఆనందం వ్యక్తం చేస్తున్నాయి.


వెలుగు సక్సెస్: కరెంట్​ ఎఫైర్స్​

వెలుగు సక్సెస్: కరెంట్​ ఎఫైర్స్​ అంతర్జాతీయం సైనిక వ్యయంలో భారత్ నాల్గవ స్థానం అమెరికా (916 బిలియన్ డాలర్లు), చైనా (296 బిలియన్ డాలర్లు), రష్యా(109 బిలియన్ డాలర్లు) తర్వాత రక్షణ రంగానికి 83.6 బిలియన్ డాలర్లను కేటాయించడం ద్వారా భారత్ 2023లో ప్రపంచంలోనే నాల్గవ అతిపెద్ద సైనిక వ్యయం చేసే దేశంగా నిలిచింది. కాలుష్య నగరంగా ఖాట్మండు ప్రపంచవ్యాప్తంగా వాయు క...


అప్పుడు కాంగ్రెస్ సర్కార్ ఏడ్చేది..ఇప్పుడు పాక్​ ఏడుస్తున్నది

అప్పుడు కాంగ్రెస్ సర్కార్ ఏడ్చేది..ఇప్పుడు పాక్​ ఏడుస్తున్నది టెర్రర్​ దాడులకు మేం దీటుగా బదులిస్తున్నం: మోదీ మత రిజర్వేషన్లను నెహ్రూ వ్యతిరేకించారు  జార్ఖండ్, బిహార్ రాష్ట్రాల్లో ఎన్నికల ప్రచారంలో పీఎం పలాము(జార్ఖండ్)/ దర్భంగా(బిహార్): దేశ భద్రతపై గతంలో కాంగ్రెస్ ఆధ్వర్యంలోని యూపీఏ సర్కారు పిరికితనంతో వ్యవహరించిందని ప్రధాని నరేంద్ర మోదీ విమర్శిం...


ప్రధాని సభకు సాధువు.. నరేంద్ర మోదీకి రుద్రాక్ష గిఫ్ట్

లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దేశవ్యాప్తంగా పర్యటిస్తున్నారు. ఈ క్రమంలోనే శుక్రవారం పశ్చిమ బెంగాల్‌లోని బర్దమాన్‌లో నిర్వహించిన భారీ బహిరంగ సభలో ప్రసంగించారు. అయితే ప్రధానమంత్రి ప్రసంగింస్తుండగా.. అక్కడికి వచ్చిన జనాల్లో నుంచి ఓ సాధువు రుద్రాక్ష మాల పైకి ఎత్తి ప్రధాని మోదీని పిలవడం ప్రారంభించాడు. అది గమనించిన ప్రధాని మోదీ ఆ రుద్రాక్ష మాలను తన వద్దకు తీసుకురావాలని సూచించాడు. అయితే దాన్ని అక్కడ ఉన్న ఓ కెమెరామెన్‌కు ఇవ్వాలని.. ఆ సాధువును అక్కడే ఉండాలని పేర్కొన్నారు. వెంటనే స్పందించిన కెమెరామెన్ ఆ రుద్రాక్ష మాలను తీసుకువచ్చి ప్రధాని నరేంద్ర మోదీకి అందించారు. దీంతో ఆ సాధువుకు మోదీ నమస్కారం చేయగా.. తిరిగి ఆ సాధువు కూడా మోదీకి నమస్కారం చేశారు.


రైతులకు అలర్ట్.. భారీ ఆదాయం రావాలంటే పంట వేయడానికి ముందు ఇలా చేయండి!

భూమి సారాన్ని పరీక్షించి తెలుసుకొనే పద్ధతిని భూసార పరీక్ష అంటారు . నేల మానవునికి ప్రకృతి సిద్ధంగా లభించిన గొప్ప సంపద. పంటలకు కావాల్సిన అన్ని పోషకాలు కొంత పరిమాణంలో నేలలో సహజంగా ఉంటాయి. అయితే వీటిలో వ్యత్యా సాలు ఉండే అవకాశం ఉంది. కావునా నేలలో పోషకాలు ఎంత లభ్యమవుతున్నాయో, వేయదలచిన పైరుకు ఎంతఎరువు అవసరమో నిర్దారించి వాడాలి. కావునా భూసారాన్ని పరీక్షించాల్సిన అవసరం ఎంతైనా ఉందని శ్రీకాకుళం జిల్లా ఆముదాలవలస భూసార పరీక్షా కేంద్రం వ్యవసాయ సంచాలకులు సత్యవతి అన్నారు. భూమి మొక్కలకు కావాల్సిన పోషకాలను అందిస్తూ మొక్క పెరుగుదలకు, దిగుబడిని అందించడంలో ప్రధాన పాత్ర వహిస్తుందని చెప్పారు. రైతు నేల పోషక సామర్థ్యాన్ని తెలుసుకోవడం వలన ఏ నేలలో ఏ పంట వేస్తే బాగా పెరిగి మంచి దిగుబడులు వస్తాయో తెలుసుకొని మంచి దిగుబడులు ఇచ్చే పంటను పండించడానికి అవకాశం ఏర్పడుతుందని సత్యవతి లోకల్ 18తో వివరించారు. వేసిన పంటకు నేలలో తగు నిష్పత్తిలో పోషకాలు లేనపుడు భూసార పరీక్ష ద్వారా నేలలో ఏ పోషకాలు తగ్గినాయో ఆ పోషకాలను మాత్రమే నేలకు అందించడం వలన పంట మంచి దిగుబడిని అందించడమే కాక నేలకు అందించే పోషకాల ఖర్చును బాగా తగ్గించుకోవచ్చన్నారు. దీని ద్వారా పంటపై పెట్టే పెట్టుబడి తగ్గటమే కాక మంచి దిగుబడుల వలన మంచి ఆదాయం పొందవచ్చునన్నారు. పంట పండించడానికి నేలకు సరిపడ పోషకాలను అందించటం వలన నేల వాతావరణంలో ఏర్పడే దుష్పరిణామాలను అరికట్టడమేకాక భవిష్యత్ తరాలకు పంట పండించడానికి అనుకూలమైన మంచి నేలను అందించగలుగుతామని చెప్పారు. నేలలోని కొంత మట్టిని సేకరించి రసాయన పద్ధతుల ద్వారా లేదా ఇతర విశ్లేషణ పద్ధతుల ద్వారా పరీక్షించటం వలన నేలలో మొక్కకు కావాలసిన పోషక పదర్థాలు ఏయే పాళ్ళలో ఉన్నాయో తెలుసుకోవచ్చనని చెప్పారు.


విహారయాత్రలో విషాదం.. కారు లోయలో పడి ఐదుగురు విద్యార్థులు మృతి

విహారయాత్రలో విషాదం.. కారు లోయలో పడి ఐదుగురు విద్యార్థులు మృతి విహారయాత్రలో విషాదం చోటుచేసుకుంది. కారు అదుపుతప్పి లోతైన లోయలో పడిపోవడంతో ఐదుగురు విద్యార్తులు ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటన మే 4వ తేదీ శనివార  ఉదయం ఉత్తరాఖండ్‌లోని డెహ్రాడూన్ జిల్లాలో జరిగింది. సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ (ఎస్పీ) ప్రమోద్ కుమార్ తెలిపిన వివరాల ప్రకారం.. డెహ్రాడూన్ IMS కళాశా...


చల్లటి కబురు : సోమవారం నుంచి తెలంగాణలో ఐదు రోజులు వానలు

చల్లటి కబురు : సోమవారం నుంచి తెలంగాణలో ఐదు రోజులు వానలు పలు జిల్లాల్లో మాత్రం వడగాలులుంటాయన్న వాతావరణ శాఖ హైదరాబాద్, వెలుగు: ఎండలతో ఉక్కిరిబిక్కిరి అవుతున్న జనాలకు వాతావరణ శాఖ చల్లటి కబురు చెప్పింది. రాష్ట్రవ్యాప్తంగా సోమవారం నుంచి ఐదు రోజుల పాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని శనివారం వెల్లడించింది. ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడి...


అయ్యో బిడ్డా! .. ఆడ శిశువును బతికుండగానే పాతిపెట్టారు

అయ్యో బిడ్డా! .. ఆడ శిశువును బతికుండగానే పాతిపెట్టారు అరగంట పాటు మట్టిలో తల్లడిల్లిన పసిప్రాణం     కదలికలు గమనించి స్థానికులకు సమాచారం ఇచ్చిన ట్యాంకర్  డ్రైవర్     మట్టిని తోడి చిన్నారిని బయటకు తీసిన ఉపాధి కూలీలు     హనుమకొండ జిల్లా ఊరుగొండ శివారులో దారుణం     ఎంజీఎం ఆసుపత్రికి తరలించడంతో దక్కిన ప్రాణం ఆత్మకూరు(దామెర), వెలుగు:  పుట్టిన బిడ్డను ...


హైదరాబాద్​ను యూటీ చేసేందుకు బీజేపీ కుట్ర : ఆనంద భాస్కర్

హైదరాబాద్​ను యూటీ చేసేందుకు బీజేపీ కుట్ర : ఆనంద భాస్కర్ న్యూఢిల్లీ, వెలుగు: హైదరాబాద్ ను కేంద్రపాలిత ప్రాంతం(యూటీ) గా చేసేందుకు బీజేపీ కుట్ర చేస్తోందని రాజ్యసభ మాజీ సభ్యుడు రాపోలు ఆనంద భాస్కర్  ఆరోపించారు. ఈ విషయాన్ని బీఆర్ఎస్  చీఫ్​ కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లినా ఆయన పట్టించుకోలేదన్నారు. 2022 అక్టోబర్ లో తాను బీఆర్ఎస్ లో చేరినా.. గడపలోకి అడుగుపెట్ట...


Hyderabad : కాషాయ కండువా కప్పుకున్న అసదుద్దీన్ ఓవైసి

హైదరాబాద్ : దేశవ్యాప్తంగా లోక్ సభ ఎన్నికల జరుగుతున్నాయి... ఇప్పటికే పలు రాష్ట్రాల్లో పోలింగ్ కూడా ముగిసింది. నాలుగో విడతలో అంటే మే 13న తెలంగాణలోని 17 లోక్ సభ నియోజకవర్గాల్లో పోలింగ్ జరగనుంది. పోలింగ్ కు సమయం దగ్గరపడుతుండటంతో ప్రధాన రాజకీయ పార్టీలు, అభ్యర్థులు ప్రచార జోరు పెంచారు. ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు ఇంటింటి ప్రచారాన్ని కూడా ప్రారంభించారు... ఓట్ల కోసం పాట్లు పడుతున్నారు అభ్యర్థులు. ఇలా హైదరాబాద్ ఎంపీ అభ్యర్థి, మజ్లిస్ పార్టీ అధినేత...


రైతులకు భారీ శుభవార్త.. అకౌంట్‌లోకి రూ.లక్షా 60 వేలు, బ్యాంక్ అదిరే లోన్

రైతులకు తీపికబురు. అదిరే గుడ్ న్యూస్. అకౌంట్లలోకి ఏకంగా రూ. లక్షా 60 వేలు పొందొచ్చు. ఎలా అని అనుకుంటున్నారా. అయితే బ్యాంక్ అందిస్తున్న ఈ ఆఫర్ గురించి తెలుసుకోవాల్సందే. ప్రభుత్వ రంగానికి చెందిన యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అదిరే ఆప్షన్ అందుబాటులో ఉంచింది. డిజిటల్ కిసాన్ క్రెడిట్ కార్డులు అందిస్తోంది. దీని ద్వారా రైతులు ఇంట్లో నుంచే రుణాలు పొందొచ్చు. ఎలా అని అనుకుంటున్నారా? అయితే మీరు ఈ డిజిటల్ క్రెడిట్ కార్డుల ద్వారా లోన్ ఎలా పొందాలో తెలుసుకుందాం. స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ ఇప్పుడు చూద్దాం. ముందుగా బ్యాంక్ వెబ్‌సైట్‌లోకి వెళ్లాలి. అక్కడ డిజిటల్ కేసీసీ లోకి వెళ్లాలి. ఇక్కడ మీరు డిజిటల్ కిసాన్ క్రెడిట్ కార్డులకు సంబంధించిన పూర్తి వివరాలు పొందొచ్చు. https://www.unionbankofindia.co.in/english/digital-kcc-blog.aspx లింక్ ద్వారా నేరుగా పేజ్‌లోకి వెళ్లొచ్చు. రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇన్నోవేషన్ హబ్ భాగస్వామ్యంతో యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రైతులకు డిజిటల్ కేసీసీ లోన్ ఫెసిలిటీ తెచ్చింది. ఇందులో భాగంగా రైతుల రూ.1.6 లక్షల వరకు రుణం పొందొచ్చు. బ్యాంక్ వీవైఓఎం యాప్ అందిస్తోంది. దీని ద్వారా సులభంగానే డిజిటల్ కిసార్ క్రెడిట్ కార్డు పొందొచ్చు. ఎలాంటి డాక్యుమెంట్లు బ్యాంక్ బ్రాంచ్‌కు వెళ్లి సమర్పించాల్సిన పని లేదు. లోన్ అకౌంట్ ఓపెనింగ్ చాలా సులభంగానే నిమిషాల వ్యవధిలో అయిపోతుంది. ఆన్‌లైన్ ఫామ్ ల్యాండ్ వెరిఫికేషన్ జరుగుతుంది. శాటిలైట్ ఇమేజరీ, మ్యాపింగ్ వంటి వాటి ద్వారా క్రాపింగ్ ఇన్ఫర్మేషన్ వెరిఫై చేస్తారు. జియో ట్యాపింగ్ టెక్నాలజీ ఉపయోగిస్తారు. లోన్‌పై వెంటనే నిర్ణయం వెలువడుతుంది. ల్యాండ్ ఓనర్‌షిప్, క్రాపింగ్, బ్యూరో డేటా ఆధారంగా వెంటనే నిర్ణయం తీసుకుంటారు. ఆధార్ ఇసైన్ ద్వారా ప్రాసెస్ వేగంగా పూర్తి చేస్తారు. ముందుగా బ్యాంక్ యాప్‌ను ఫోన్‌లో ఇన్‌స్టాల్ చేసుకోవాలి. తర్వాత ఇందులోకి లాగిన్ అవ్వాలి. రిజిస్టర్ చేసుకన్న వారు వెంటనే లాగిన్ అవ్వొచ్చు. లేదంటే రిజిస్టర్ చేసుకోవాలి. తర్వాత లాగిన్ అయితే కిసాన్ క్రెడిట్ కార్డు ఆప్షన్ ఉంటుంది. దీని ద్వారా మీరు లోన్ పొందొచ్చు. లేదంటే బ్యాంక్ వెబ్‌సైట్‌లో డిజిటల్ కేసీసీ అప్లికేషన్ ఆప్షన్ ఉంటుంది. దానిపై కూడా క్లిక్ చేయొచ్చు. ఇంకా వెబ్‌సైట్‌లో బ్యానర్‌లో కూడా ఈ ఆప్షన్ పొందుపరిచారు. ఇలా కూడా కిసాన్ క్రెడిట్ కార్డు లోన్ కోసం అప్లై చేసుకోవచ్చు. https://kccnew.unionbankofindia.co.in/existing-customer ఈ లింక్ ద్వారా నేరుగా లోన్ అప్లై చేయొచ్చు. బ్యాంక్ బ్రాంచ్‌కు వెళ్లాల్సిన పని లేదు. అలాగే ఫిజికల్‌గా ఎలాంటి డాక్యుమెంట్లు సమర్పించాల్సిన పని లేదు. రూ.1,6 లక్షల వరకు లోన్ పొందొచ్చు. ప్రాసెసింగ్ ఫీజు ఉండదు. ఇంట్లో నుంచే లోన్ పొందొచ్చు. అప్లై నౌ అనే ఆప్షన్‌పై క్లిక్ చేయాలి. ఇప్పుడు సెల్ఫ్ సర్వీస్ ఆప్షన్ ఎంచుకోవాలి. ఇప్పుడు లోన్ వివరాలు మీరు పూర్తిగా చూడొచ్చు. అన్ని ఓకే అనుకుంటే కిందకు వచ్చి యాక్సెప్ట్‌పై క్లిక్ చేయాలి. మీకు బ్యాంక్‌లో అకౌంట్ ఉందా? లేదా? అనే ఆప్షన్ ఓకే చేయాలి. ఇప్పుడు అకౌంట్ నెంబర్ లేదా ఆధార్ నెంబర్ ఎంటర్ చేయాలి. తర్వాత ల్యాండ్ వెరిఫికేషన్ ఉంటుంది. అటుపైన క్రాప్ సెలక్షన్ చేయాలి. తర్వాత అర్హత ఆధారంగా శాంక్షన్ లభిస్తుంది. ఇప్పుడు ఇసైన్ చేయాలి. ఇక చివరిగా లోన్ అమౌంట్ మంజూరు అవుతుంది. ఇలా బ్యాంక్ బ్రాంచ్‌కు వెళ్లకుండానే ఇంట్లో నుంచే డబ్బులు పొందొచ్చు.


రోహిత్​ వేముల కేసులో సమగ్ర దర్యాప్తు

రోహిత్​ వేముల కేసులో సమగ్ర దర్యాప్తు పునర్విచారణకు ఆదేశిస్తం.. న్యాయం జరిగేలా చూస్తం రోహిత్​ తల్లికి సీఎం రేవంత్​రెడ్డి హామీ హైదరాబాద్​, వెలుగు: రోహిత్​ వేముల కేసులో సమగ్ర దర్యాప్తు చేపట్టాలని సీఎం రేవంత్​రెడ్డి ఆదేశించారు. ఆ కుటుంబానికి న్యాయం జరిగేలా చూస్తామని హామీ ఇచ్చారు. హైదరాబాద్‌ సెంట్రల్‌ వర్సిటీలో 2016లో రోహిత్‌ వేముల ఆత్మహత్య చేసుకోగా.. ...


టీడీపీ మద్దతు కోరిన ఖమ్మం బీఆర్ఎస్ క్యాండిడేట్‌‌‌‌ నామా నాగేశ్వరరావు

టీడీపీ మద్దతు కోరిన ఖమ్మం బీఆర్ఎస్ క్యాండిడేట్‌‌‌‌ నామా నాగేశ్వరరావు ఖమ్మం టౌన్, వెలుగు: ఖమ్మం లోక్​సభ బీఆర్ఎస్ అభ్యర్థి నామా నాగేశ్వరరావుకు ఖమ్మం టీడీపీ శ్రేణుల నుంచి నిరసన సెగ తగిలింది. శనివారం ఆయన తెలుగుదేశం పార్టీ కార్యకర్తల మద్దతు కోరుతూ ఖమ్మంలోని టీడీపీ జిల్లా ఆఫీసుకు వెళ్లారు. ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఎన్టీఆర్ స్ఫూర...


కూకట్పల్లిలో అగ్ని ప్రమాదం

కూకట్పల్లిలో అగ్ని ప్రమాదం హైదరాబాద్: కూకట్ పల్లిలోని స్క్రాప్ దుకాణంలో అగ్ని ప్రమాదం జరిగింది. కూకట్ పల్లి పరిధిలోని సాయినగర్ లో ఓ స్క్రాప్ దుకాణంలో నిల్వ ఉంచిన సిలిండర్ పేలి ఈ ప్రమాదం సంభవించింది. ఒక్కసారిగా మంటలు చెలరేగి.. పక్కనే ఉన్న స్క్రాప్ కు అంటుకుని మంటలు వ్యాపించాయి. గమనించిన స్థానికులు ఫైర్, పోలీసు లకు సమాచారం ఇచ్చారు. ఘటనా స్థలానికి చే...


10ఏళ్ల రికార్డ్ బ్రేక్ చేసిన ఎండలు.. మరో 4 రోజుల పాటు నగరవాసులపై నిప్పుల కుంపటే

సమ్మర్ వచ్చిందంటే ఎక్కడెక్కడి జనం హైదరాబాద్ (Hyderabad)లో మకాం వేస్తారు. వాతావరణం కాస్త చల్లగా ఉంటుందని..గాలితో తేమ శాతం తక్కువగా ఉండటంతో పాటు ఉక్కపోత తక్కువగా ఉంటుందని చాలా మంది వేసవి సెలవులకు హైదరాబాద్ లో తిష్ట వేస్తారు. కాని ఈసారి సీజన్ లో సీను మారిపోయింది. ఎండలు దేశ వ్యాప్తంగా దడ పుట్టిస్తున్నట్లుగానే తెలంగాణ(Telangana)లో అందులో హైదరాబాద్ నగరంలో రికార్డ్ బద్దలు కొడుతున్నాయి. గడిచిన పదేళ్లలో ఎన్నడూ చూడని స్థాయిలో వేసవి తీవ్రత మంటలు రేపుతోంది....


ఇందూర్ అర్బన్ లో పూర్ పోలింగ్.. పార్లమెంట్​ ఎన్నికల్లో నిరాశపరుస్తున్న పోలింగ్​ శాతం

ఇందూర్ అర్బన్ లో పూర్ పోలింగ్.. పార్లమెంట్​ ఎన్నికల్లో నిరాశపరుస్తున్న పోలింగ్​ శాతం పల్లెల్లో బెటర్.. పట్టణ ఓటర్లను కదిలిస్తేనే పోలింగ్​  పర్సెంటేజీలో పెరుగుదల నిజామాబాద్​, వెలుగు: ఇందూర్​ జిల్లాలోని అన్ని సెగ్మెంట్లలో ఏటా ఓటర్లు పెరుగుతున్నా ఓటింగ్​ శాతం మెరుగు పడటం లేదు.   పైగా ప్రతిసారి అర్బన్​లో మరీ తక్కువ ఓటింగ్​ నమోదు కావడం ఆఫీసర్లను కలవరపె...


వడదెబ్బతో తెలంగాణలో ఆరుగురు మృతి

వడదెబ్బతో తెలంగాణలో ఆరుగురు మృతి రాష్ట్రంలో  పెరుగుతున్న ఎండ తీవ్రత, వడదెబ్బతో శనివారం ఆరుగురు చనిపోయారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్​ మండలం బల్​నాయక్​తండాకు చెందిన లకావత్​ రామన్న(45) యాటకార్లపల్లెలోని ప్రభుత్వ ప్రైమరీ స్కూల్​లో  టీచర్​గా పనిచేస్తున్నాడు. పార్లమెంట్ ఎలక్షన్స్ ట్రైనింగ్​కోసం శుక్రవారం మధ్యాహ్నం బస్సులో హుస్నాబాద్​ నుంచి గజ్వేల్​వెళ్...


Maoist Kasaraveni Ravi : అస్తమించిన ‘రవి’ - ముగిసిన 33 ఏళ్ల ఉద్యమ ప్రస్థానం

Maoist Kasaraveni Ravi killed in Encounter : తెలంగాణకు చెందిన మావోయిస్టు ముఖ్య నేత కాశవేయిన రవి(55) ఎన్ కౌంటర్ లో మృతి చెందారు. చత్తీస్ గడ్(Chhattisgarh) అడవుల్లో జరిగిన ఎదురుకాల్పుల్లో ప్రాణాలు కోల్పోగా… ఆయన స్వగ్రామం వంగరలో శనివారం అంత్యక్రియలు జరిగాయి.


బీజేపీకి ఓటేస్తే బానిస బతుకులే..

బీజేపీకి ఓటేస్తే బానిస బతుకులే.. సంగారెడ్డి, వెలుగు: పార్లమెంట్‌‌‌‌ ఎన్నికల్లో బీజేపీకి ఓటు వేస్తే అందరూ బానిసలుగా బతకాల్సి వస్తుందని మంత్రి కొండా సురేఖ అన్నారు. ఓటు వేసే ముందు ఒక్కసారి ఆలోచించుకోవాలని పిలుపునిచ్చారు. సంగారెడ్డి పీఎస్‌‌‌‌ఆర్‌‌‌‌ గార్డెన్స్‌‌‌‌లో శనివారం నిర్వహించిన కాంగ్రెస్‌‌‌‌ విస్తృత స్థాయి సమావేశంలో ఆమె మాట్లాడారు. ప్రైవేటీకరణన...


కాంగ్రెస్​లోకి భారీగా చేరికలు

కాంగ్రెస్​లోకి భారీగా చేరికలు వికారాబాద్, వెలుగు : వికారాబాద్ లో కాంగ్రెస్​మరింత బలపడుతోంది. వికారాబాద్​మున్సిపాలిటీలోని ఐదుగురు బీఆర్ఎస్​కౌన్సిలర్లు కారు దిగి కాంగ్రెస్​పార్టీలో చేరారు. శనివారం సాయంత్రం స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ సమక్షంలో హస్తం కండువా కప్పుకున్నారు. కాంగ్రెస్​తీర్థం పుచ్చుకున్నవారిలో కౌన్సిలర్లు హీరేకార్ సురేశ్, నవీన్, లంకా పుష్...


ఎస్సీ, ఎస్టీ, బీసీలు ఏకం కావాలి : మధుయాష్కీ గౌడ్

ఎస్సీ, ఎస్టీ, బీసీలు ఏకం కావాలి : మధుయాష్కీ గౌడ్ బీజేపీ కుట్రను తిప్పి కొట్టాలి రాజ్యాంగాన్ని కాపాడుకోవాలి: చంద్రశేఖర్​ కుల గణన ఆధారంగా రిజర్వేషన్లు: మహేశ్ కుమార్ గౌడ్ కాంగ్రెస్​తోనే పేదలకు న్యాయం: బల్మూరి వెంకట్ గాంధీభవన్​లో ‘రాజ్యాంగ పరిరక్షణ దీక్ష’ ముగింపు హైదరాబాద్, వెలుగు: దేశవ్యాప్తంగా ఎస్సీ, ఎస్టీ, ఓబీసీలు ఏకం కావాల్సిన అవసరం ఉందని పీసీస...


ఇయ్యాల హైదరాబాద్ లో ట్రాఫిక్ ​ఆంక్షలు

ఇయ్యాల హైదరాబాద్ లో ట్రాఫిక్ ​ఆంక్షలు సికింద్రాబాద్, వెలుగు : సికింద్రాబాద్​పరేడ్​గ్రౌండ్​లో ఆదివారం సాయంత్రం నిర్వహిస్తున్న బీజేపీ ఎన్నికల సభకు కేంద్ర హోంమంత్రి అమిత్​షా హాజరవుతున్నారు. ఈ నేపథ్యంలో సికింద్రాబాద్​లోని పలు ప్రాంతాల్లో సాయంత్రం 5 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు ట్రాఫిక్ ఆంక్షలు అమలులో ఉంటాయని పోలీసులు తెలిపారు. పంజాగుట్ట -గ్రీన్​ల్యాండ...


మీటింగ్‌లోనే కాంగ్రెస్ కార్యకర్తని వెంటాడి చంపిండు

మీటింగ్‌లోనే కాంగ్రెస్ కార్యకర్తని వెంటాడి చంపిండు రంగారెడ్డి జిల్లా: రాజేంద్రనగర్ లో దారుణం చోటుచేసుకుంది. అత్తాపూర్ పోలీస్ స్టేషన్ పరిధి హసన్ నగర్ లో జరుగుతున్న కాంగ్రెస్ పార్టీ మీటింగ్ లో ఆ పార్టీ నాయకుడిని ఓ వ్యక్తి దాడి చేసి హత్య చేశాడు. మీటింగ్ కు వచ్చిన జనాలు అందరూ చూస్తుండగానే దుండగుడు గొంతు కోసి కిరాతకంగా హత్య చేశాడు. కళ్ల ముందే హత్య జరగడం...


మహిళలకు ఫ్రీగా బ్యుటీషియన్​ కోర్సు

మహిళలకు ఫ్రీగా బ్యుటీషియన్​ కోర్సు వికారాబాద్, వెలుగు : గ్రామీణ మహిళలు, యువతులకు ఫ్రీగా బ్యుటీషియన్ ​కోర్సు అందిస్తున్నామని వికారాబాద్​జిల్లా ఎస్​బీఐ లీడ్ మేనేజర్ రాంబాబు తెలిపారు. చిలుకూరు ఎస్​బీఐ గ్రామీణ స్వయం ఉపాధి శిక్షణ సంస్థ ద్వారా శిక్షణ ఇస్తున్నట్లు చెప్పారు. ఈ నెల 8 నుంచి శిక్షణ మొదలవుతుందని, 5 నుంచి 8వ తేదీలోపు సంస్థ డెరెక్టర్​రమేశ్( 8500...


పసి ప్రాణాలను చిదిమేస్తున్నారు..!

పసి ప్రాణాలను చిదిమేస్తున్నారు..! రోడ్లు, డ్రైన్లలో నవజాత శిశువుల మృతదేహాలు కండ్లు తెరవక ముందే కాటికెళ్తున్న పసిప్రాణాలు విచారణను గాలికొదిలేస్తున్న ఆఫీసర్లు కనీస చర్యలు లేక తరచూ ఇవే ఘటనలు హనుమకొండ, వెలుగు: తల్లి పొత్తిళ్లలో ఉండాల్సిన బిడ్డలు కండ్లు తెరవక ముందే కాటికి చేరుతున్నారు. ఆడ శిశువులనో.. లేదా ఆర్థిక భారమనుకునో.. మరే ఇతర కారణాలోగానీ పుట్ట...


హైదరాబాద్‌వాసులకు గుడ్‌న్యూస్.. నగరానికి హైస్పీడ్ రైల్ కారిడార్, వందే భారత్ మెట్రో

హైదరాబాద్‌వాసులకు గుడ్‌న్యూస్. నగరంలో హైస్పీడ్ రైల్ కారిడార్, వందే భారత్ మెట్రో పరుగులు పెట్టనుంది. ఈ మేరకు ప్రధాని నరేంద్ర మోదీ కీలక కామెంట్స్ చేశారు. ఈ ప్రాజెక్టులు ప్రతిపాదిత దశలో ఉన్నాయని.. కచ్చితంగా వాటిని పట్టాలెక్కిస్తామని వెల్లడించారు. తాము మూడోసారి అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లోనే పసుపు బోర్డును ఏర్పాటు చేయనున్నట్లు ప్రధాని స్పష్టం చేశారు.