Trending:


చిన్న వయస్సులో రజస్వలకు కారణాలివే!

ప్రస్తుతం చాలా మంది బాలికలు చిన్న వయస్సులోనే రజస్వల అవుతున్నారు. చిన్న వయస్సులో రజస్వల అవ్వడానికి గల కారణాలను ఇక్కడ వివరించాం.


అహోబిలంలో ఘనంగా వసంతోత్సవాలు....

ఉమ్మడి కర్నూలు జిల్లా పవిత్ర పుణ్యక్షేత్రం సాక్ష్యాత్తు ఆ శ్రీ మహా విష్ణువు స్వయంబుగా ఉగ్రనరసింహ అవతారంలో వెలసిన క్షేత్రం అహోబిలం. అహోబిలం దేవస్థానంలో లక్ష్మి నరసింహాస్వామికి ప్రతి యేటా నిర్వహించే వసంతోత్సవం కనులపండువగా కొనసాగుతుంది. ఇటీవల అహోబిలం లక్ష్మినరసింహాస్వామి వారి కళ్యాణం అంగరంగ వైభవంగా జరగగా మరో నాలుగు రోజులపాటు స్వామి వారి వసంతోత్సవాలు జరగనున్నాయి.వసంతోత్సవాల్లో భాగంగా దిగువ అహోబిలం క్షేత్రంలో తిరుమంజన సేవ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. అహోబిలం లక్ష్మి నరసింహాస్వామి వసంతోత్సవాల సందర్భంగా అహోబిలం క్షేత్రానికి భక్తులు భారీగా తరలి వెళ్తున్నారు. ఒకవైపు ఆధ్యాత్మిక కేంద్రం మరోవైపు పర్యాటక కేంద్రంగా ప్రసిద్ధి చెందిన అహోబిలంలో ఈ 5 రోజాలపాటు వసంతోత్సవాలు జరగనున్నాయి... అహోబిలం లక్ష్మి నరసింహాస్వామి క్షేత్రంలో స్వామి వారి వసంతోత్సవం సందర్బంగా దిగువ అహోబిలంలో స్వామి అమ్మవార్ల ఉత్సవ మూర్తలకు తులసి దళం, కనకంబ్రాల పూలతో ప్రత్యేకంగా అలంకరించారు ఆలయ అర్చకులు. అహోబిలం లక్ష్మి నరసింహాస్వామి వసంతోత్సవం సందర్భంగా 2వ రోజులో భాగంగా దిగువ అహోబిలం ఆలయంలో సాంప్రదాయ పద్దతిలో సంగీత కచేరి నిర్వహించారు ఆలయ అర్చకులు. ఆలయానికి వచ్చిన భక్తులను ప్రత్యేకంగా ఈ సంగీత కచేరి ఆకట్టుకుంది


YS Sharmila Case: వైఎస్‌ షర్మిలకు షాక్‌.. వివేకా హత్య వ్యాఖ్యలపై కేసు నమోదు

Case Filed Against YS Sharmila In Badvel: ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల ప్రధానంగా తన బాబాయి వైఎస్‌ వివేకా హత్యకేసుపై వ్యాఖ్యలు చేస్తుండడం వివాదాస్పదమైంది. ఈ సందర్భంగా బద్వేలులో ఆర్‌వో ఫిర్యాదు మేరకు షర్మిలపై కేసు నమోదైంది. హత్య కేసు విషయంలో ఆమె చేస్తున్న వ్యాఖ్యలు నిబంధనలకు విరుద్ధమని ఫిర్యాదు అందింది.


బీజేపీని ఓడించేందుకు అన్నివర్గాలు ఏకమవ్వాలి : ప్రొ.సింహాద్రి

బీజేపీని ఓడించేందుకు అన్నివర్గాలు ఏకమవ్వాలి : ప్రొ.సింహాద్రి బషీర్ బాగ్, వెలుగు: లోక్ సభ ఎన్నికల్లో మతతత్వ బీజేపీని ఓడించేందుకు అన్ని వర్గాలు ఏకతాటిపైకి రావాలని సమాజ్ వాదీ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ప్రొ.సింహాద్రి పిలుపునిచ్చారు. ‘లోక్ సభ ఎన్నికలు, రాజ్యాంగ పరిరక్షణ’ అనే అంశంపై సోమవారం సింహాద్రి అధ్యక్షతన బషీర్ బాగ్ ప్రెస్ క్లబ్ లో సమాజ్ వాదీ పార్టీ...


చనిపోయిన వ్యక్తి వస్తువులను ఇతరులు వాడొచ్చా..? గరుడ పురాణం ఏం చెబుతోంది?

భూమి మీద మరణం ఒక్కటే శాశ్వతం. ఈ లోకంలో పుట్టిన వాళ్లు ఏదో ఒకరోజు చనిపోవాల్సిందే, ఈ భూలోకంలో తన జీవనయానం ముగించుకుని భౌతిక దేహాన్ని విడిచిపెట్టాల్సిందే. మరణానంతరం ఆ వ్యక్తి జ్ఞాపకాలు, వారికి సంబంధించిన వస్తువులు మాత్రమే మనతో ఉంటాయి. భూమిపై జీవించి ఉన్నప్పుడు అందరూ మంచి జీవితాన్ని గడపడానికి అవసరమైన వస్తువులను కొనుగోలు చేస్తారు. మరి వారు చనిపోయిన తర్వాత ఆ వ్యక్తి భౌతిక వస్తువులను ఏం చేయాలి? దీనికి సంబంధించి ప్రజలకు చాలా సందేహాలు ఉంటాయి. చనిపోయిన...


లారీ ఓనర్స్ సమస్యల పరిష్కారానికి కృషి

లారీ ఓనర్స్ సమస్యల పరిష్కారానికి కృషి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి  కాంగ్రెస్ కు లారీ ఓనర్స్ అసోసియేషన్ మద్దతు  లారీ ఓనర్స్ అసోసియేషన్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు సయ్యద్ సాదిక్ షాద్ నగర్,వెలుగు: రాష్ట్రంలోని లారీ యజమానుల సమస్యలను పరిష్కరిస్తామని, రవాణా రంగం మెరుగుదల కోసం లారీ ఓనర్స్ అసోసియేషన్ ప్రధాన సమస్యలు మేనిఫెస్టోలో పెట్టడం జరిగిందని రాష్ట్ర ముఖ్యమంత్...


రైతు భరోసా డబ్బులు వేస్తుంటే బీజేపీ, బీఆర్ఎస్ అడ్డుకున్నాయి : అద్దంకి దయాకర్

రైతు భరోసా డబ్బులు వేస్తుంటే బీజేపీ, బీఆర్ఎస్ అడ్డుకున్నాయి : అద్దంకి దయాకర్ బీఆర్ఎస్ బీజేపీ పార్టీలపై ఫైర్ అయ్యారు కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి అద్దంకి దయాకర్. బీఆర్ఎస్, బీజేపీ నాయకులు రైతు భరోసా డబ్బులు వేస్తుంటే అడ్డుకున్నారని విమర్శించారు.ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇచ్చిన మాట ప్రకారం రైతు భరోసా డబ్బులు ఎకౌంట్లో వేస్తుంటే అక్కసుతో ఈసీ కి పిర...


గాంధీలో బాలికకు అరుదైన సర్జరీ

గాంధీలో బాలికకు అరుదైన సర్జరీ చికిత్సను సక్సెస్ చేసిన పీడియాట్రిక్ విభాగ డాక్టర్లు పద్మారావునగర్, వెలుగు: గాంధీ ఆస్పత్రి డాక్టర్లు అరుదైన, క్లిష్టమైన సర్జరీని చేసి బాలిక​ ప్రాణాలు కాపాడారు.  ఆస్పత్రి సూపరింటెండెంట్ ప్రొ.రాజారావు సోమవారం సర్జరీ వివరాలను మీడియాకు  వెల్లడించారు.  మహారాష్ట్రలోని నాందేడ్​కు చెందిన11 ఏండ్ల బాలిక సంధ్య కొంతకాలంగా బ్లడ్​ ప...


ఆర్ఎస్ఎస్ ముసుగులో బీజేపీ దేశాన్ని దోచుకుంటుంది: గడ్డం వంశీకృష్ణ


వంశీ గెలుపు కోసం విస్తృత ప్రచారం

వంశీ గెలుపు కోసం విస్తృత ప్రచారం పెద్దపల్లి, వెలుగు : పెద్దపల్లి, మంథని, రామగుండం నియోజకవర్గాల్లో కాంగ్రెస్​ నాయకులు సోమవారం ఎంపీ అభ్యర్థి వంశీకృష్ణ గెలుపు కోసం ఇంటింటి ప్రచారం చేశారు.  పెద్దపల్లి మండలం బోజన్నపేట గ్రామంలో బాలసాని సతీశ్‌‌ ఆధ్వర్యంలో లీడర్లు ఇంటింటికి వెళ్లి ప్రచారం చేశారు. మంథని నియోజకర్గంలోని కమాన్​పూర్​ గ్రామంలో కాంగ్రెస్​ నాయకుడు...


అక్షయ తృతీయ నాడు ఈ తప్పులు చేస్తే.. దరిద్రం మీ జీవితంతో డిస్కో ఆడుకుంటుంది..!

హిందూ ధర్మం ప్రకారం.. అక్షయ తృతీయ అనేది బంగారం కొనడానికి మాత్రమే కాకుండా దానం చేయడానికి కూడా ఉత్తమమైన రోజు. అక్షయ తృతీయ నాడు పేదలకు మీకు చేతనైనంత దానం చేయడం ఉత్తమమని చెపుతారు. ఇక ఈ రోజున బంగారం కొనలేని వారు దానం చేయవచ్చు. ఇది వారికే కాకుండా భవిష్యత్తు తరాల వారికీ ఎంతో ప్రయోజన కరంగా ఉంటుంది. అక్షయ తృతీయను ప్రతి సంవత్సరం ఘనంగా నిర్వహిస్తుంటారు. అత్సయం అంటే తగ్గనిది. ఈ ఏడాది తృతీయ తిథి మే 10వ తేదీ ఉదయం 4.17 గంటలకు ప్రారంభమవుతుంది. ఇది మే 11 మధ్యాహ్నం 2:50 గంటలకు ముగుస్తుంది. ఆభరణాలు కొనడానికి అనుకూలమైన సమయం : మే 10 మరియు 11వ తేదీ ఉదయం 5:33 నుండి మధ్యాహ్నం 12:18 వరకు బంగారం, వెండి మొదలైన వాటిని కొనుగోలు చేసే సమయం సంవత్సరం పొడవునా లక్ష్మీ దేవి అనుగ్రహాన్ని కలిగిస్తుంది. ఏవి తినకూడదంటే: అక్షయ తృతీయ మహావిష్ణువు, శ్రీ మహాలక్ష్మికి అత్యంత ప్రీతికరమైన పండుగ కాబట్టి.. ఆరోజు పొరపాటున కూడా మాంసాహారం తినకూడదు. మద్యం సేవించవద్దు. అక్షయ తృతీయ నాడు మద్యం సేవిస్తే లక్ష్మీ దేవి ఆగ్రహానికి గురవుతారని పండితులు అంటున్నారు. అలాగే ఉల్లిపాయలు, వెల్లుల్లితో కూడిన ఆహారాన్ని తినకూడదని అంటున్నారు. ఈ పనులు చేయకండి: అంతేకాదు అక్షయ తృతీయ నాడు.. ఇంటిని మురికిగా ఉంచవద్దు. లక్ష్మి దేవి తన ఇంటిని శుభ్రంగా ఉంచుకోవడానికి ఇష్టపడుతుంది. మురికి ఇంట్లోకి లక్ష్మి ప్రవేశించదు. కాబట్టి అక్షయ తృథి నాడు ఇంటిని శుభ్రంగా ఉంచుకోండి. అక్షయ తృతీయ రోజు విష్ణుమూర్తికి ప్రీతికరమైన రోజు కాబట్టి, విష్ణువుకు ఇష్టమైన తులసి ఆకులను తెంపకూడదు.. ఇలా చేస్తే లక్ష్మీ ఆగ్రహానికి గురవుతారు. ఏం చేయాలి: అక్షయ తృతీయ రోజున భక్తిశ్రద్ధలతో అమ్మవారిని పూజించాలనుకునే వారు తమ శరీరాన్ని, మనసును పరిశుభ్రంగా ఉంచుకోవాలి. ఎవరి పట్లా కోపం, ద్వేషం లేదా అసూయ భావాలు కలిగి ఉండకండి. ఎంతో భక్తితో, పవిత్రతతో అమ్మవారికి పూజలు నిర్వహించాలి. బంగారం కొనే సమయంలో శ్రద్ధ: అక్షయ తృతీయ నాడు బంగారం కొనే వారు ఈ విషయాలను గుర్తుంచుకోవాలి. చాలామంది బంగారం కొన్న వెంటనే ధరిస్తారు. అయితే అది తప్పు.. బంగారాన్ని కొనుగోలు చేసిన వారు పెద్దల చేతుల మీదుగా పవిత్రం చేసిన తర్వాతే ధరించాలి. ఈ నియమాలను పాటించడం ద్వారా మాత్రమే మీరు అక్షయ తృతీయను ఐశ్వర్యవంతులవుతారు. లేకుంటే పేదరికం తాండవిస్తుంది. గమనిక: ఈ కథనంలో అందించిన సమాచారం మరియు సూచనలు జ్యోతిష్కుడు అందించిన సాధారణ జ్ఞానం మరియు మత విశ్వాసాలపై ఆధారపడి ఉన్నాయి. స్థానిక 18 దానిని ఆమోదించదు.)


రాజ్యాంగాన్ని మార్చేందుకే 400 సీట్లు అడుగుతున్రు:సీతక్క

రాజ్యాంగాన్ని మార్చేందుకే 400 సీట్లు అడుగుతున్రు:సీతక్క కొత్తగూడ, వెలుగు: రాజ్యాంగాన్ని మార్చేందుకే బీజేపీ 400 సీట్లు అడుగుతుందని మంత్రి సీతక్క విమర్శించారు. మహబూబాబాద్‌‌‌‌ పార్లమెంట్‌‌‌‌ క్యాండిడేట్‌‌‌‌ పోరిక బలరాం నాయక్‌‌‌‌కు మద్దతుగా సోమవారం మహబూబాబాద్‌‌‌‌ జిల్లా కొత్తగూడ, గంగారం మండలాల్లో ప్రచారం చేశారు. ఈ సందర్భంగా గుంజేడు నుంచి కొత్తగూడ వరకు ...


Weather Report: ఏపీ, తెలంగాణకు పిడుగులతో వర్ష సూచన.. 5 రోజులు ఇంతే!

ఈ సంవత్సరం ఎల్‌నినో వల్ల ఎండలు దంచేశాయి. ఐతే.. మే నెల మొదలవ్వగానే.. ఎండల వల్ల నీటి ఆవిరి బాగా పెరిగి.. ఆకాశంలో మేఘాలు ఎక్కువయ్యాయి. దాంతో.. వాతావరణం ఒక్కసారిగా మారింది. తమిళనాడులో ద్రోణి ఏర్పడి.. అది తెలుగు రాష్ట్రాలపై చాలా బలంగా విస్తరించింది. ప్రస్తుతం రాయలసీమ అంతటా ద్రోణి బలంగా ఉంది. కాబట్టి.. ఇవాళ కూడా తెలుగు రాష్ట్రాలకు వర్షం తప్పదు. భారత వాతావరణ విభాగం (IMD) లేటెస్ట్ బులిటెన్ ప్రకారం.. ద్రోణి కొనసాగుతోంది. దాని వల్ల తెలంగాణ, కోస్తాంధ్ర, యానాం, రాయలసీమలో ఇవాళ్టి నుంచి 5 రోజుల పాటూ.. అక్కడక్కడా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయి. ఐతే.. వానతోపాటూ.. ఉరుములు, మెరుపులు, పిడుగులు కూడా పడతాయి. గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయి. ఇవాళ ముఖ్యంగా కోస్తాంధ్ర, యానాం, రాయలసీమలో అక్కడక్కడా భారీ వర్షాలు కురిసే అవకాశం చాలా ఎక్కువగా ఉంది అని IMD విడిగా ప్రత్యేకంగా చెప్పింది. అంటే.. ఆ ప్రాంతాల్లో వారు జాగ్రత్తగా ఉండటం మంచిది. అసలే ఈ వానలు మామూలుగా లేవు. దంచేస్తున్నాయి. నిన్న వానల వల్ల ఏడుగురు చనిపోయారంటేనే.. పరిస్థితి ఎంత తీవ్రంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. శాటిలైట్ అంచనాలను చూద్దాం. వాటి ప్రకారం ఇవాళ ఉదయం వేళ తెలుగు రాష్ట్రాల్లో చాలాచోట్ల మేఘాలు ఉన్నాయి. హైదరాబాద్ చుట్టుపక్కల, గుంటూరు, నంద్యాల, అనంతపురం వంటి చోట్ల వాన పడుతుంది. ఉదయం 10 తర్వాత రాయలసీమలో మేఘాలు మరింత పెరుగుతాయి. మధ్యాహ్నం 2 తర్వాత విశాఖలో భారీ వర్షం కురిసే ఛాన్స్ ఉంది. సాయంత్రం 4 తర్వాత మళ్లీ హైదరాబాద్‌లో భారీ వర్షం పడేలా కనిపిస్తోంది. అలాగే.. విశాఖ, ఉత్తరాంధ్ర నుంచి కాకినాడ వరకూ మోస్తరు వర్షం పడేలా ఉంది. హైదరాబాద్‌లో వాన రాత్రి 8 గంటల వరకూ పడే అవకాశం కనిపిస్తోంది. అర్థరాత్రి వరకూ హైదరాబాద్‌పై మేఘాలు ఉంటాయి. రాయలసీమలో రాత్రి 8 తర్వాత మేఘాలు ఉండకపోవచ్చు. గాలి వేగం.. ఉదయం, సాయంత్రం తర్వాత విపరీతంగా పెరుగుతోంది. బంగాళాఖాతంలో ఇవాళ గాలి వేగం గంటకు 17 నుంచి 21 కిలోమీటర్లుగా ఉంటుంది. ఏపీలో గాలి వేగం గంటకు 9 నుంచి 14 కిలోమీటర్లు, తెలంగాణలో గంటకు 9 నుంచి 14 కిలోమీటర్లుగా ఉంటుంది. ఐతే.. వాన పడే సమయంలో గాలి వేగం బాగా పెరుగుతుంది. ఈదురు గాలులు వస్తాయి. ఉష్ణోగ్రత ఇవాళ మరింత తగ్గనుంది. ఏపీలో పగటివేళ 34 నుంచి 38 డిగ్రీల సెల్సియస్ ఉంటుంది. తెలంగాణలో 35 నుంచి 38 డిగ్రీల సెల్సియస్ ఉంటుంది. ఇవాళ తూర్పు రాయలసీమలో కొంత వేడి ఉండేలా కనిపిస్తోంది. మే నెలలో తొలిసారి తెలుగు రాష్ట్రాల్లో కొంత తేమ కనిపిస్తోంది. ఈ తేమ 40 నుంచి 80 శాతం దాకా ఉంటోంది. అంటే.. ఇవాళ చాలా ప్రాంతాల్లో వర్షాలు పడే ఛాన్స్ ఉంది. ముఖ్యంగా హైదరాబాద్, కోస్తాంధ్ర, ఉత్తరాంధ్ర, శ్రీశైలం, దేవరకొండలో కొంత ఎక్కువ వాన పడే ఛాన్స్ ఉంది. (All Images credit - IMD)


హైదరాబాద్ చేరుకున్న ప్రధాని మోదీ

హైదరాబాద్ చేరుకున్న ప్రధాని మోదీ తెలంగాణ పర్యటనలో భాగంగా ప్రధాని నరేంద్ర మోదీ  హైదరాబాద్ లోని  బేగంపేట విమానాశ్రయానికి చేరుకున్నారు.  అక్కడినుంచి నేరుగా రాజ్‌భవన్‌ వెళ్లారు. ఇవాళ రాత్రి రాజ్‌భవన్‌లోనే బస చేయనున్న మోదీ.. రేపు (బుధవారం) ఉదయం వేములవాడకు వెళ్లనున్నారు.  ఉదయం 8 గంటలకు వేములవాడ ఆలయంలోని శ్రీ రాజరాజేశ్వర స్వామివారిని ఆయన దర్శించుకోనున్నార...


కల్వకుర్తి ఎమ్మెల్యే కారును ఢీకొట్టిన బైక్ .. ఒకరు మృతి

కల్వకుర్తి ఎమ్మెల్యే కారును ఢీకొట్టిన బైక్ .. ఒకరు మృతి స్వల్ప గాయాలతో బయటపడ్డ ఎమ్మెల్యే కసిరెడ్డి ఆమనగల్లు, వెలుగు: రంగారెడ్డి జిల్లా తలకొండపల్లి మండలం వెంకటాపూర్ శివారులోని మూలమలుపు వద్ద సోమవారం మధ్యాహ్నం కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణ రెడ్డి కారు, మరో బైక్ ఢీకొట్టుకున్నాయి. ఈ ప్రమాదంలో ఒకరు చనిపోగా..మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. ఎమ్మెల్యే న...


కోవిడ్ సర్టిఫికెట్ నుంచి మోదీ ఫొటో ఎందుకు తొలగించారు?.. ఇదీ కారణం!

కోవిడ్ వ్యాక్సినేషన్ సర్టిఫికెట్ల నుంచి ప్రధాని నరేంద్ర మోదీ చిత్రాన్ని తొలగించడం ఇప్పుడు పెద్ద చర్చనీయాంశమైంది. కోవిషీల్డ్ వ్యాక్సినేషన్ వల్ల కలిగే దుష్ప్రభావాల కారణంగా ఫొటోను తొలగించినట్లు కూడా విస్తృతంగా ప్రచారం జరుగుతోంది.(malayalam.indiatoday.in టీమ్ ఫ్యాక్ట్ చెక్ చేసిన స్టోరీ ఇది)"బస్సు ప్రమాదానికి గురైనప్పుడు, డ్రైవర్ సాధారణంగా దిగి పారిపోతాడు. కోవిషీల్డ్ తీవ్రమైన దుష్ప్రభావాలకు కారణమవుతుందని తయారీదారులు కోర్టులో అంగీకరించవలసి వచ్చింది....


నా గెలుపు చాలా ఈజీ.. అందుకు కాంగ్రెస్ పార్టీ పెద్ద హెల్ప్ చేసింది: కొండా విశ్వేశ్వర్ రెడ్డి

లోక్ సభ ఎన్నికలు సమీపిస్తున్న వేళ.. చేవెళ్ల బీజేపీ ఎంపీ అభ్యర్థి కొండా విశ్వేశ్వర్ రెడ్డి (Konda Vishweshwar Reddy ) సంచలన వ్యాఖ్యలు చేశారు. తనకు బలమైన పోటీదారులు ఎవరూ లేరని.. తన గెలుపు చాలా సులభమని ధీమా వ్యక్తం చేస్తున్నారు కొండా. అయితే.. తన గెలుపు అంత సులువు కావడానికి కాంగ్రెస్ పార్టీ చాలా హెల్ప్ చేసిందని చెప్పుకొచ్చారు. ఇటీవల ఓ మీడియా ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేయటం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.


13 ఏళ్ల బాలికకు 70 ఏళ్ల ముసలోడితో పెళ్లి.. ఎక్కడో తెలుసా?

Child Marriage: మూడు ముళ్లు, ఏడు అడుగులతో ఇద్దరు మనుషులు, రెండు కుటుంబాలు ఏకమయ్యేదే పెళ్లి. ఈ పెళ్లి అనేది ప్రతి ఒక్కరి జీవితంలో చాలా ముఖ్యమైనది. ఇంతటి అమోఘమైన ఘట్టాన్ని ఎవరైనా సంబరాలతో జరుపుకోవాలనుకుని కలలు కంటుంటారు. అలాగే ఆడపిల్లల తల్లిదండ్రులు తమ కూతురికి వివాహం జరిపించి మెట్టినింటికి సాగనంపాలని ఆశతో ఎదురుచూస్తుంటారు. కొంతమంది తల్లిదండ్రులకు తమ కూతురికి మంచి సంబంధం చూసి వివాహం జరిపిస్తారు. \ మరికొంతమంది వరుడు ఎలా ఉన్నా పర్వాలేదు కూతురి...


హైదరాబాద్కు మోడీ..ట్రాఫిక్ ఆంక్షలు ఎక్కడెక్కడంటే.?

హైదరాబాద్కు మోడీ..ట్రాఫిక్ ఆంక్షలు ఎక్కడెక్కడంటే.? లోక్ సభ ఎన్నికలకు పార్టీలు ప్రచారాన్ని స్పీడప్ చేశాయి. ఈ క్రమంలోనే  జాతీయ పార్టీల నేతలు తెలంగాణలో ప్రచారం చేయడానికి క్యూ కట్టారు. ప్రధాని మోదీ ఇవాళ(మే 7న) హైదరాబాద్ కు రానున్నారు.ఈ క్రమంలో  బేగంపేట్ నుంచి రాజ్ భవన్ మార్గంలో మే 7న రాత్రి , మే 8న ఉదయం వరకు ట్రాఫిక్ ఆంక్షలు విధించనున్నట్లు హైదరాబాద్ ...


సీఎం రేవంత్‌ రెడ్డి కరీంనగర్‌ పర్యటన రద్దు

సీఎం రేవంత్‌ రెడ్డి కరీంనగర్‌ పర్యటన రద్దు వర్షం కారణంగా సీఎం రేవంత్‌ రెడ్డి కరీంనగర్‌ పర్యటన రద్దు అయింది. అయితే యథావిధిగా సీఎం రేవంత్‌ రెడ్డి వరంగల్‌ పర్యటన కొనసాగనుంది.  ఈ విషయాన్ని  అధికారులు తెలిపారు. హైదరాబాద్‌ నుంచి రోడ్డు మార్గంలో వరంగల్‌ బయలుదేరారు సీఎం రేవంత్ రెడ్డి.  వరంగల్‌ తూర్పు, వరంగల్‌ పశ్చిమలో రేవంత్‌ రెడ్డి రోడ్‌ షోలలో ఆయన పాల్గొన...


US Student Visa Slots: అమెరికా వెళ్లాలనుకునే విద్యార్ధులకు గుడ్ న్యూస్, వీసా స్లాట్స్ విడుదల

US Student Visa Slots: అమెరికాలో ఉన్నత విద్యాభ్యాసం కోసం ఎదురు చూస్తోన్న విద్యార్ధులకు తీపి కబురు అందింది. స్టూడెంట్ వీసా స్లాట్ బుకింగ్స్‌ ప్రారంభమయ్యాయి.


ప్లీజ్ మా దేశానికి రండి..భారత్ ను బతిమాలుకుంటున్న మాల్దీవుల టూరిజం శాఖ మంత్రి

మాల్దీవుల అధ్యక్షుడు భారత్ వ్యతిరేక వైఖరితో ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలు దారుణంగా దెబ్బతిన్న విషయం తెలిసిందే. ఈ ఏడాది జనవరిలో ప్రధాని నరేంద్ర మోదీ లక్షద్వీప్‌ పర్యటన సందర్భంగా భారత్‌పై అక్కసును వెళ్లగక్కుతూ మాల్దీవుల మంత్రులు సోషల్ మీడియాలో పెట్టిన పోస్టులతో భారతీయులకు మండి బాయ్‌కాట్ మాల్దీవులకు పిలుపునిచ్చారు. మాల్దీవులకు వెళ్లే భారత పర్యాటకుల సంఖ్య భారీగా తగ్గిపోవడంతో ఆదేశ ఆదాయం కూడా పడిపోయింది. ఆ దేశానికి టూరిజం ప్రధాన ఆర్ధిక వనరుకావడంతో మాల్దీవులు ఇబ్బందులను ఎదుర్కొంటోంది. దీంతో తమ తప్పు తెలుసుకున్న మాల్దీవులు కాళ్లబేరానికి వచ్చింది. భారతీయులు మళ్లీ మాల్దీవులకు రావాలని, పర్యాటకంపైనే ఆధారపడిన తమ దేశ ఆర్థిక వ్యవస్థకు సహకరించాలని మాల్దీవుల టూరిజం శాఖ మంత్రి ఇబ్రహీం ఫైజల్‌ అభ్యర్థించారు.[caption id="" align="alignnone" width="1024"] పర్యటకశాఖ గణాంకాల ప్రకారం.. ఈ ఏడాదిలో మే 4 నాటికి 43,991 మంది భారతీయులు మాల్దీవులకు వెళ్లారు. గతేడాది జనవరి - ఏప్రిల్‌ మధ్య ఈ సంఖ్య 73,785గా ఉంది.[/caption] మాల్దీవులలో ముయిజ్జు అధికారంలోకి వచ్చిన తర్వాత ఇరు దేశాల మధ్య దౌత్య సంబంధాలు దెబ్బతినడమే దీనికి కారణమని నివేదిక తెలిపింది. చైనాకు సన్నిహితంగా వ్యవహరిస్తున్న ముయిజ్జు భారత దళాలను వెనక్కి పంపి కయ్యానికి కాలుదువ్వారు. అంతకుముందు మాల్దీవుల వ్యవహారాల్లో భారత్‌ జోక్యం ఎక్కువవుతోందంటూ ప్రచారం చేసి సెప్టెంబరులో జరిగిన ఎన్నికల్లో గెలుపొందిన విషయం తెలిసిందే.


వైఎస్ జగన్ గురించి పులివెందుల ప్రజలు ఏమంటున్నారు?

వైఎస్ జగన్ గురించి పులివెందుల ప్రజలు ఏమంటున్నారు?


News Live updates: ఏపీ, తెలంగాణ, లోక్‌సభ వార్తలు.. లైవ్ అప్ డేట్స్

News Live updates: తెలుగు రాష్ట్రాల్లో నిన్న వానలు దంచేశాయి. ఇవాళ కూడా అదే పరిస్థితి ఉంటుందని తెలిసింది. మరో 5 రోజులు వానలు పడతాయని అధికారులు అంచనా వేశారు. నిన్న వానల వల్ల ఏడుగురు చనిపోగా.. ఏపీలో పిడుగులు పడి ఇద్దరు చనిపోయారు. నిన్న ఏపీలో కొన్ని ప్రాంతాల్లో వడగళ్ల వాన కూడా పడింది. నిన్న మూడో దశలో 61 శాతం పోలింగే నమోదైంది. ఇప్పటివరకూ జరిగిన మూడు దశల్లో కూడా పోలింగ్ తక్కువగానే నమోదవుతోంది. మరి 13న జరిగే నాలుగో దశ ఎలా ఉంటుందో. నిన్న తెలంగాణకు...


కాంగ్రెస్ అరచేతిలో వైకుంఠం చూపించి మోసం చేసింది : కేసీఆర్


ఏ అధికారంతో ఢిల్లీ పోలీసులు రాష్ట్రానికి వచ్చారు : రేణుకా చౌదరి

ఏ అధికారంతో ఢిల్లీ పోలీసులు రాష్ట్రానికి వచ్చారు : రేణుకా చౌదరి తెలంగాణ  తడాఖా ఏంటో చూపిస్తం పెద్ద ఛాతీ ఉండడం కాదు, అందులో మనసు ఉండాలని ప్రధానిపై ఫైర్​ హైదరాబాద్, వెలుగు: ఏ అధికారంతో ఢిల్లీ పోలీసులు తెలంగాణలో దిగారని కాంగ్రెస్ సీనియర్ నేత, రాజ్యసభ సభ్యురాలు రేణుకా చౌదరి ప్రశ్నించారు. తెలంగాణ తడాఖా ఏంటో చూపిస్తామని హెచ్చరించారు. సోమవారం గాంధీ భవన్ ...


Amavasya: రేపు అమావాస్య.. ఈ మూడు రాశులవారికి దశ తిరుగుతోంది..!

వైదిక పంచాంగం ప్రకారం, వైశాఖ మాసంలోని అమావాస్య రేపు అంటే మే 8, మంగళవారం. పంచాంగ్ ప్రకారం, వైశాఖ మాసం అమావాస్య ఈ రోజు రాత్రి 11 గంటలకు ప్రారంభమైంది. ఇది రేపు ( బుధవారం) రాత్రి 8:41 గంటలకు ముగుస్తుంది. కానీ హిందూమతంలో రోజు ఉదయ తిథితో ప్రారంభమవుతుంది, కాబట్టి వైశాఖ అమావాస్య రేపు మే 8 న ఉంటుంది. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం అమావాస్య నాడు ఎన్నో అరుదైన యోగాలు జరుగుతున్నాయి. అమావాస్య రోజున ఈ సంయోగం సంభవించడం భూమిపై ఉన్న అన్ని జీవులపై ప్రభావం చూపుతుంది....


ప్రధానిని విమర్శించడం పద్ధతి కాదు : రాందాస్​అథవాలె

ప్రధానిని విమర్శించడం పద్ధతి కాదు : రాందాస్​అథవాలె రాహుల్ అసత్య ఆరోపణలు చేస్తున్నరు ఖైరతాబాద్, వెలుగు: కాంగ్రెస్ మాజీచీఫ్ రాహుల్ గాంధీ పదేపదే ప్రధాని మోదీని విమర్శిస్తున్నారని, అది మంచి పద్ధతి కాదని  కేంద్రమంత్రి ,రిపబ్లికన్​  పార్టీ ఆఫ్​ ఇండియా జాతీయ అధ్యక్షుడు రాందాస్​ అథవాలె అన్నారు. సోమావారం ప్రెస్​క్లబ్​లో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడార...


కేరళలో ఘోర రోడ్డుప్రమాదం.. ముగ్గురు స్పాట్

కేరళలో ఘోర రోడ్డుప్రమాదం.. ముగ్గురు స్పాట్ కేరళలో ఘోర రోడ్డుప్రమాదం జరిగింది. కాసర్ గోడ్ లోని మంజేశ్వరం దగ్గర కారును ఢీకొట్టింది అంబులెన్స్. ప్రమాదంలో ముగ్గురు చనిపోయారు. పలువురుకి గాయాలయ్యాయి. ఘటనలో కారు నుజ్జునుజ్జయింది. సమాచారం అందుకుని ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు.. మృతదేహాలను వెలికితీశారు. తర్వాత క్రేన్ సాయంతో బోల్తా పడిన అంబులెన్స్ ను పో...


పిల్లలకు స్కూల్ లో చేర్పించే ముందు ఇవి నేర్పించాల్సిందే...!

ఏదైనా తినే ముందు హ్యాండ్ వాష్ చేసుకోవాలి అనే విషయాన్ని కూడా నేర్పించాలి. చిన్న పిల్లలు కదా ఏం నేర్చుకుంటారు అనుకుంటాం. కానీ.. వారు ఈ వయసులోనే ఎక్కువగా నేర్చుకుంటారు. ఈ రోజుల్లో పిల్లలను స్కూల్లో చేర్పించే ముందు.. కచ్చితంగా ప్రీ స్కూల్ లో చేర్పిస్తున్నారు. ఎందుకు అంటే... చదువుకంటే ముందు.. ప్రీ స్కూల్ లో పిల్లలు స్కూల్ కి అలవాటు పడతారు. అంతేకాదు... చాలా విషయాలు ప్రీ స్కూల్ లోనే నేర్చుకుంటారు. అయితే... మీరు మీ పిల్లలను ప్రీ స్కూల్ లో చేర్పించే...


Mlc Kavitha : ప్రజ్వల్ రేవణ్ణను దేశం దాటించారు, నన్ను అన్యాయంగా అరెస్టు చేశారు- ఎమ్మెల్సీ కవిత

Mlc Kavitha : దిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఎమ్మెల్సీ కవితకు మరో వారం కస్టడీ విధించింది కోర్టు. ఈ నెల 14 వరకు ఆమె జైలులోనే ఉండనున్నారు. అయితే ప్రజల్వ్ రేవణ్ణను దేశం దాటించారని, తనను అన్యాయంగా అరెస్టు చేశారని ఆరోపించారు.


Haryana: మెజార్టీ కోల్పోయిన హర్యానా బీజేపీ సర్కార్.. ముగ్గురు ఎమ్మెల్యేలు కాంగ్రెస్‌కు మద్దతు

Haryana: హర్యానాలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం కూలిపోయే సూచనలు కనిపిస్తున్నాయి. నాయబ్ సింగ్ సైనీ సర్కార్ ప్రస్తుతం మెజారిటీని కోల్పోవడంతో ఆ రాష్ట్రంలో రాజకీయ సంక్షోభం నెలకొంది. అధికారంలో ఉన్న బీజేపీకి ఇప్పటివరకు మద్దతు ప్రకటించిన ముగ్గురు ఇండిపెండెంట్ ఎమ్మెల్యేలు.. తమ మద్దతును ఉపసంహరించుకుని.. ప్రతిపక్షంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ వైపు మొగ్గారు. దీంతో నాయబ్ సింగ్ సైనీ ప్రభుత్వం మెజారిటీని కోల్పోయింది. ఈ పరిణామాలపై స్పందించిన కాంగ్రెస్ పార్టీ...


మూడో దశలో మహారాష్ట్రలో లోక్ సభ ఎన్నికల ఓటింగ్- HT Telugu #genelia #loksabhaelection2024

భారతదేశం, May 7 -- మూడో దశలో మహారాష్ట్రలో లోక్ సభ ఎన్నికల ఓటింగ్- HT Telugu #genelia #loksabhaelection2024


హైదరాబాద్ - బెంగాల్ రైలును జీహాదీలు.. ముస్లిం ఎక్స్‌ప్రెస్‌గా మార్చారా?

Claim: హైదరాబాద్ నుంచి బెంగాల్ వెళ్తున్న రైలును.. జీహాదీలు, ముస్లిం ఎక్స్‌ప్రెస్‌గా మార్చారు.Fact: హైదరాబాద్ నుంచి కర్ణాటకలోని వాడిలో ఉన్న హల్‌కట్టా షరీఫ్‌కు వెళ్లే యాత్రికుల కోసం రైల్వేశాఖ ప్రత్యేక రైళ్లను నడిపింది.(newschecker.in టీమ్ ఫ్యాక్ట్ చెక్ చేసిన స్టోరీ ఇది)పచ్చని మసీదు గోపురం, బంగారు పక్షులతో అలంకరించిన రైలు వీడియో ఒకటి ఫేస్‌బుక్‌లో వైరల్ అయ్యింది."హైదరాబాద్ నుంచి పశ్చిమ బెంగాల్ వెళ్లే రైలును జిహాదీలు ముస్లిం ఎక్స్‌ప్రెస్‌గా మార్చారు....


కొవిషీల్డ్ వ్యాక్సిన్ తో దుష్ప్రభావం

కొవిషీల్డ్ వ్యాక్సిన్ తో దుష్ప్రభావం కేంద్రం, తయారీ సంస్థ నష్టపరిహారం ఇవ్వాలి అవేకెన్​ ఇండియా మూమెంట్ ప్రతినిధుల డిమాండ్ ఖైరతాబాద్​,వెలుగు: కరోనా సమయంలో​ఎమర్జెన్సీ పేరుతో క్లినికల్​ట్రయిల్స్​ లేకుండానే కొవిషీల్డ్ వ్యాక్సిన్ కు కేంద్రం అనుమతి ఇచ్చిందని, దీంతో వ్యాక్సిన్​ వేసుకున్న వారిలో దుష్ప్రభావం ఇప్పటికీ ఉందని అవేకెన్​ ఇండియా మూమెంట్ సలహాదారు ద...


కాంగ్రెస్ గెలిస్తే రామ మందిరం స్థానంలో మళ్లీ మసీదు నిర్మిస్తారు: రఘునందన్ రావు

లోక్ సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా మెదక్ బీజేపీ ఎంపీ అభ్యర్థి రఘునందన్ రావు సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రచారంలో భాగంగా తమిళనాడు బీజేపీ అధ్యక్షుడు అన్నామలైతో కలిసి సంగారెడ్డిలో బైక్ ర్యాలీలో పాల్గొన్న రఘునందన్.. ర్యాలీ అనంతరం మాట్లాడుతూ సెన్సెషనల్ కామెంట్స్ చేశారు. దేశంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే.. అయోధ్యలో నిర్మించిన రామాలయం స్థానంలో మళ్లీ బాబ్రీ మసీదు కడుతుందంటూ కీలక వ్యాఖ్యలు చేశారు.


వేములవాడకు మోదీ.. బండి సంజయ్కు మద్దతుగా ప్రచారం

వేములవాడకు మోదీ.. బండి సంజయ్కు మద్దతుగా ప్రచారం ప్రధాని నరేంద్ర మోదీ రేపు అనగా మే 08వ తేదీ బుధవారం రోజున వేములవాడలో పర్యటించనున్నారు.  ఉదయం 8 గంటలకు వేములవాడ ఆలయంలోని శ్రీ రాజరాజేశ్వర స్వామివారిని ఆయన దర్శించుకోనున్నారు.  అనంతరం  పార్లమెంట్ ఎన్నికల క్రమంలో కరీంనగర్ ఎంపీ అభ్యర్థి బండి సంజయ్ కి మద్దతుగా  పట్టణంలోని బైపాస్ రోడ్డులో ఏర్పాటు చేసిన బహిర...


కంగన మానసిక రుగ్మతతో బాధ పడుతోంది: రాకేశ్ కుమార్ సింగ్

కంగన మానసిక రుగ్మతతో బాధ పడుతోంది: రాకేశ్ కుమార్ సింగ్ మండి (హిమాచల్ ప్రదేశ్): సినీ నటి, మండి బీజేపీ అభ్యర్థి కంగనా రనౌత్ మానసిక రుగ్మతతో బాధపడుతోందని కాంగ్రెస్ నేత రాకేశ్ కుమార్ సింగ్ అన్నారు. భారత మొదటి ప్రధాని సుభాష్ చంద్రబోస్ అని ఇటీవల ఆమె చెప్పిందని గుర్తుచేశారు. దేశ తొలి ప్రధాని నెహ్రూ అని రెండో తరగతి విద్యార్థి కూడా చెబుతారని పేర్కొ న్నారు. ...


అందరూ ఓటు వేయండి.. ఓటు విలువ ఏంటో తెలుసుకోండి..

ప్రజాస్వామ్యంలో ఎన్నికలకు ప్రక్రియ చాలా కీలకంగా ఉంది. ఎన్నికల్లో ప్రతి ఒక్కరు ఓటు వేయాలని, ఇది అందరూ హక్కుగా చెబుతూ ఉంటారు. ప్రత్యేకించి ఓట్లు వేయడం కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కోరుతూ ఉంటారు.‌ అందరూ ఓటెయ్యాలి - ఎవరూ ఓటు అమ్ముకోరాదు అని పీపుల్స్ పవర్ ఎన్ జి ఒ సెక్రటరీ నిమ్మకాయలు భాస్కర్ కోరారు. ఈ మేరకు విశాఖపట్నం బీచ్ లో సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. అనకాపల్లి, గాజువాక, భీమిలిలో, మురళీ నగర్, మాధవధార , సీతమ్మధార, ఆరిలోవ, హనుమంతవాక, ఎంవిపి...


Kejriwal Bail: కేజ్రీవాల్‌ బెయిల్‌పై సుప్రీం ఆంక్షలు.. బెయిల్ వచ్చినా సీఎంగా విధులు నిర్వర్తించొద్దని వెల్లడి

Delhi Excise Policy Case: ఢిల్లీ లిక్కర్ కేసు.. ఆమ్ ఆద్మీ పార్టీని, ఢిల్లీ ప్రభుత్వాన్ని షేక్ చేస్తోంది. ఇప్పటికే ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ సహా కీలక నేతలు జైలులో ఉండటంతో సార్వత్రిక ఎన్నికల్లో ఆప్ తరఫున ప్రచారం చేయడానికి వారు దూరం అయ్యారు. ఈ క్రమంలోనే ఎన్నికల్లో ప్రచారం చేసుకునేందుకు మధ్యంతర బెయిల్ ఇవ్వాలన్న కేజ్రీవాల్ పిటిషన్‌పై విచారణ జరిపిన సుప్రీంకోర్టు.. పలు ఆంక్షలు విధించింది. ఒక వేళ మధ్యంతర బెయిల్ వస్తే.. సీఎంగా అధికారిక విధులు...


Hyderabad Metro: హైదరాబాద్‌లో భారీ వర్షానికి మెట్రో రైళ్లు నిలిచిపోయాయా?

హైదరాబాద్‌లో గంటన్నర పాటు ఎడతెరిపి లేకుండా వర్షం పడింది. ఈ భారీ వర్షానికి... జన జీవన అస్తవ్యస్తమయ్యింది. భారీగా ట్రాఫిక్ జామ్ అయ్యింది. వర్షానికి ఈదురు గాలులు తోడవ్వడంతో... హోర్డింగులు, చెట్లు కూలిపోయాయి. లోతట్టు ప్రాంతాలన్నీ జలమయం అయ్యాయి. నగరంలో దాదాపుగా అన్ని ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. జనం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. అయితే.. భారీ వర్షానికి కరెంట్ కూడా లేకపోవడంతో... మెట్రో సర్వీసులు నిలిచిపోయాయని వార్తలు వచ్చాయి. ఇంకొంత మంది...


గాలి వాన బీభత్సం.. బీజేపీ సభా ప్రాంగణంలో కొట్టుకపోయిన కుర్చీలు, టెంట్లు

గాలి వాన బీభత్సం.. బీజేపీ సభా ప్రాంగణంలో కొట్టుకపోయిన కుర్చీలు, టెంట్లు మండుతున్న ఎండలకు బ్రేక్ పడింది. రాష్ట్ర వ్యాప్తంగా పలు జిల్లాల్లో భారీ వర్షం పడుతోంది.  పెద్దపల్లి, సిరిసిల్ల జిల్లాలో ఉరుముల మెరుపులతో కూడిన భారీ వర్షం కురుస్తోంది. పెద్దపల్లి జిల్లా ధర్మపురి,పెద్దపల్లి,మంథని, నియోజకవర్గాల్లో ఉరుములు ఈదురు గాలులతో కూడిన వర్షం పడుతోంది. పలు చోట...


పంట పెట్టబడి సాయం ఆపండి.. రైతుభరోసాపై ఈసీ ఆంక్షలు

పంట పెట్టబడి సాయం ఆపండి.. రైతుభరోసాపై ఈసీ ఆంక్షలు రైతు భరోసాపై ఎన్నికల కమిషన్ ఆంక్షలు విధించింది. ఈ నెల 13న పోలింగ్ ముగిసిన తర్వాతే పంట పెట్టుబడి సాయం పంపిణీ చేయాలని ఆదేశించింది.  మొత్తం 69 లక్షల మంది లబ్ధిదారులకు గాను 65 లక్షల మందికి ఇది వరకే పంట పెట్టుబడి సాయాన్ని ప్రభుత్వం ఇది వరకే అందజేసింది. ఈ నెల 8వ తేదీ లోపు అందరికీ రైతు భరోసా వేస్తామని ఈ నె...


Army Recruitment Rally: సికింద్రాబాద్‌లో ఆర్మీ రిక్రూట్‌మెంట్‌ ర్యాలీ, పలు విభాగాల్లో అగ్నివీర్‌ ఎంపికలు

Army Recruitment Rally: సికింద్రాబాద్‌లో మే 20 నుంచి అగ్నివీర్ రిక్రూట్ మెంట్ ర్యాలీ ప్రారంభం కానుంది. యూనిట్ హెడ్ క్వార్టర్స్ కోటా కింద అగ్నివీర్ రిక్రూట్ మెంట్ ర్యాలీ ఈ నెల 20 నుంచి సికింద్రాబాద్‌లోని 1 ఈఎంఈ సెంటర్‌లో నిర్వహిస్తారు.


3rd Phase Lok Sabha Polls 2024 : మూడో దశలో భాగంగా దేశ వ్యాప్తంగా 92 లోక్ సభ స్థానాలకు ప్రారంభమైన పోలింగ్.. బరిలో అమిత్ షా సహా పలువురు ప్రముఖులు..

3rd Phase Lok Sabha Polls 2024: సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా మూడో విడత భాగంగా గుజరాత్‌లోని 25 స్థానాలతో పాటు కర్ణాటకలోని 14 స్థానాలు.. గోవాలోని 2 లోక్ సభ సీట్లతో పాటు మొత్తంగా 92 సీట్లకు పోలింగ్ ప్రారంభమైంది.


చంద్రబాబు బెయిల్ రద్దు పిటిషన్.. సుప్రీం కోర్టు కీలక ఆదేశాలు

Chandrababu Naidu: స్కిల్ డెవలప్ మెంట్ కేసులో చంద్రబాబు బెయిల్ రద్దు చేయాలన్న పిటిషన్ పై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. ఈ పిటిషన్ ను వేసవి సెలవుల తర్వాత విచారిస్తామని జస్టిస్ బేలా ఎం త్రివేది, జస్టిస్ పంకజ్ మిట్టల్ ధర్మాసనం తెలిపింది. ఈ పిటిషన్‌పై తదుపరి విచారణ 10 వారాల తర్వాత ఉంటుందని న్యాయమూర్తులు తెలిపారు. సెలవుల తర్వాత కూడా వెంటనే విచారణ చేపట్టాల్సిన అవసరమేమీ లేదని ద్విసభ్య ధర్మాసనం అభిప్రాయపడింది.


Voter List: SMS ద్వారా ఓటరు జాబితాలో మీ పేరు ఉందో లేదో ఇలా తెలుసుకోండి!

Voter List: SMS ద్వారా ఓటరు జాబితాలో మీ పేరు ఉందో లేదో ఇలా తెలుసుకోండి!


బీజేపీలో పైరవీలకు చోటు లేదు..పనిచేసే వారికే గుర్తింపు : ధర్మపురి అర్వింద్​

బీజేపీలో పైరవీలకు చోటు లేదు..పనిచేసే వారికే గుర్తింపు : ధర్మపురి అర్వింద్​ నిజామాబాద్​ ఎంపీ అభ్యర్థి ధర్మపురి అర్వింద్​ ఆర్మూర్, వెలుగు:  బీజేపీలో పైరవీలకు చోటు లేదని పని చేసే వారికే గుర్తింపు ఉంటుందని ఎంపీ అర్వింద్ అన్నారు. సోమవారం ఆర్మూర్ మండలం అంకాపూర్‌‌లో ఎమ్మెల్యే పైడి రాకేశ్ రెడ్డి, రైతులతో అర్వింద్ చాయ్ పే చర్చలో పాల్గొన్నారు.  ఈ సందర్భంగా ఆ...


రాజ్యాంగాన్ని కాపాడాలంటే బీజేపీని ఓడించాల్సిందే : కూనంనేని

రాజ్యాంగాన్ని కాపాడాలంటే బీజేపీని ఓడించాల్సిందే : కూనంనేని రాజ్యాంగాన్ని కాపాడాలంటే బీజేపీని ఓడించాల్సిందే అని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివ రావు అన్నారు. రాష్ట్రంలో బీఆర్ఎ స్ ఎగ్జాస్ట్ అయ్యిందని.. ఆపార్టీకి ఇప్పుడు తెలంగాణ సెంటిమెంట్ లేదని అన్నారు. బషీర్ బాగ్ ప్రెస్ క్లబ్ లో జరిగిన మీట్ ది ప్రెస్ లో కూనంనేని మాట్ల...


దారుణం.. భార్య ఆస్పత్రి ఖర్చులు భరించలేక ఐసీయూలోనే చంపేసిన భర్త

అనారోగ్యంతో ఆస్పత్రి పాలైన భార్యను కాపాడుకోవడం మానేసి.. ఆ భర్త దారుణానికి ఒడిగట్టాడు. ఆస్పత్రిలో చేర్పించి చికిత్స అందించిన తర్వాత.. చికిత్సకు అయిన డబ్బులు కట్టలేక ఆమె ప్రాణాలను తనే స్వయంగా తీసేశాడు. ఈ ఘటనను పోలీసుల ముందు ఒప్పుకోవడంతో అతడ్ని అరెస్ట్ చేశారు. అయితే ఆస్పత్రి మెడికల్ బిల్లులు చెల్లించలేక.. భార్యను చంపుకోవడం సంచలనంగా మారింది. ఇంతకీ ఈ దారుణ సంఘటన ఎక్కడ జరిగిందో ఈ స్టోరీలో తెలుసుకుందాం.