Trending:


సామాన్యులకు అదిరే గుడ్ న్యూస్.. అకౌంట్లలోకి స్కీమ్ డబ్బులపై ప్రభుత్వం కీలక నిర్ణయం

ఎన్నికల ప్రచారం పీక్ స్టేజ్‌కు చేరుకుంటోంది. ఎందుకుంటే పోలింగ్ డేట్ దగ్గరకు వస్తుండటంతో నాయకులు ఎత్తుకు పై ఎత్తులు వేసుకుంటూ జనాలను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఏపీలో చూస్తే ఈ హడావిడి అంతా ఇంతా కాదు. రాజకీయ నాయకులు ఎవరికి ఎవరు తగ్గడం లేదు. పెన్షన్ల పంపిణీ, వాలంటీర్, స్కీమ్స్ ఇలా వీటి చుట్టూనే ఏపీ ఎన్నికల ప్రచారం కొనసాగుతోంది. పెన్షన్ పంపిణీ పెద్ద అంశంగానే మారింది. అవ్వా తాతలు చాలా ఇబ్బందులు పడుతున్నారు. పెన్షన్ డబ్బులు గత నెలలో సచివాలయాల వద్ద అందించారు. ఈ నెల బ్యాంక్ అకౌంట్లలోనే డబ్బులు విడుదల చేశారు. సచివాలయం వెళ్లి తీసుకున్నా, బ్యాంక్ అకౌంట్‌లో పెన్షన్ డబ్బులు పడినా.. మొత్తానికి అయితే పెన్షన్ దారులు మాత్రం ఇబ్బందులు పడుతున్నారు. గత కొన్ని రోజులుగా మనం ఈ ఘటనలు చూస్తూనే ఉన్నాం. అక్కడక్కడ అయితే పెన్షన్ కోసం వెళ్లిన వారు కొందరు మరణించారు కూడా. ఈ క్రమంలోనే స్కీమ్ డబ్బులు పంపిణీ అంశంపై వైఎస్ జగన్ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. డీబీటీ చెల్లింపులపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఫోకస్ పెట్టింది. గత పథకాలకు డీబీటీ పద్ధతులో చెల్లింపులు కొనసాగించేందుకు సిద్ధమవుతోంది. అయితే ఇందుకు ఎన్నికల సంఘం అనుమతి కోరింది. గతంలో నుంచి అంటే ఐదేళ్ల నుంచి అమలవుతున్న పథకాలికే అనుమతివ్వాలని ఎన్నికల సంఘాన్ని విజ్ఞప్తి చేసింది. టీడీపీ ఒత్తిళ్లతోనే ఇప్పటివరకూ అనుమతివ్వడం లేదని ప్రభుత్వం ఆరోపించింది. ఇప్పుడు ఎలాగైతే పెన్షన్ అందిస్తున్నామో.. అలాగే అదే తరహాలోనే డీబీటీ చెల్లింపులకు అనుమతి ఇవ్వాలని ప్రభుత్వం కోరింది. ఈ మేరకు ఎన్నికల సంఘానికి లేఖ రాసింది. అయితే స్కీమ్ బెనిఫిట్స్ పంపిణీకి టీడీపీ నాయకులు అడ్డుకుంటున్నారని ఎన్నికల సంఘానికి తెలిపింది. ఏపీ ప్రభుత్వం గత ఐదేళ్లుగా సంక్షేమ పథకాలను ప్రత్యక్షంగా నగదు బదిలీ చేసింది. దీంతో లబ్ధిదారులకు భారీగా ప్రయోజనం చేకూరింది. కోవిడ్ సమయంలోనూ సంక్షేమ పథకాలకు డీబీటీ ద్వారా చెల్లింపులు చేసింది. దాదాపు 58 నెలల్లో వివిధ సంక్షేమ పథకాలను డీబీటీ స్కీమ్స్ ద్వారా నగదు చెల్లించడంతో పురుషుల కంటే మహిళలకే ఎక్కువ ఆర్థిక ప్రయోజనాలు అందాయని తెలిసిందే. ఇప్పుడు ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చింది. దీంతో చాలా ఇబ్బందులు తలెత్తాయి. స్కీమ్స్ అమలు స్తంభించిపోయింది. పెన్షన్ దారులకు నగదు పంపిణీలో చోటు చేసుకున్న ఘటనల దృష్ట్యా ప్రభుత్వం డీబీటీ ద్వారా సంక్షేమ పథకాలకు నగదు చెల్లించేలా అనుమతి ఇవ్వాలని ఎన్నికల సంఘాన్ని కోరింది. మరి ఏం జరుగుతోందో చూడాలి. అనుమతి వస్తే మాత్రం.. సామాన్యులకు ఊరట లభిస్తుందని చెప్పుకోవచ్చు. స్కీమ్స్ డబ్బులు మళ్లీ బ్యాంక్ అకౌంట్లలో జమ అవుతాయి.


Guinness World Record : కేవలం 2.88 సెకన్లలోనే 'Z నుంచి A' వరకు టైపింగ్ - గిన్నిస్‌ రికార్డు సాధించిన హైదరాబాదీ

S K Ashraf Guinness World Record : ఇంగ్లీష్‌ అక్షరాలను Z నుంచి A వరకు అతి తక్కువ సెకన్లలో టైప్‌ చేసి ఓ హైదరాబాదీ గిన్నిస్ రికార్డు సృష్టించాడు. కేవలం 2.88 సెకన్లలోనే ఈ ప్రక్రియను పూర్తి చేశాడు.


దొంగను వెంబడిస్తుండగా రోడ్డు ప్రమాదం.. ముగ్గురు భారతీయులు మృతి

దొంగను వెంబడిస్తుండగా రోడ్డు ప్రమాదం.. ముగ్గురు భారతీయులు మృతి కెనడాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో భారత్ కు చెందిన ఇద్దరు వృద్ధ దంపతులు, వారి బాలుడు సహా నలుగురు వ్యక్తులు అక్కడిక్కడే  మృతి చెందారు. అసలేం జరిగిందంటే.. కెనడాలో ని ఒంటారియో స్టేట్ లోని బోమన్‌విల్లేలో ఓ దొంగ లిక్కర్ షాపులో చోరీకి పాల్పడ్డాడు.  స్థానికుల సమాచరంతొ ఘటనా స్థలానికి ...


అమిత్ షాపై కేసు నమోదు.. చిన్నారులతో ఆ పని చేపించినందుకే.. ఆ నలుగురిపై కూడా..!

Lok Sabha Elections 2024: తెలంగాణలో రాజకీయాలు రసవత్తరంగా మారుతున్నాయి. మొన్న సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసులు నోటీసులిస్తే.. నిన్న మాజీ సీఎం కేసీఆర్ ప్రచారం మీద 48 గంటల నిషేధం విధించారు. కాగా.. ఈరోజు ఏకంగా కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షాపైనే కేసు నమోదైంది. కేవలం అమిత్ షా మీదనే కాదు.. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి, ఎమ్మెల్యే రాజాసింగ్, హైదరాబాద్ ఎంపీ అభ్యర్థి మాధవీలత, యమాన్ సింగ్ మీద పోలీసులు కేసులు నమోదు చేశారు.


Modi Vs Rahul: భయపడకు.. పారిపోకు: రాహుల్ గాంధీకి ప్రధాని మోదీ వ్యంగ్యాస్త్రాలు

Don't Fear Don't Go PM Modi Reacts On Rahul Raebareli Contest: లోక్‌సభ ఎన్నికల్లో రాహుల్‌ గాంధీ పోటీ స్థానం మారడంపై ప్రధాని మోదీ తీవ్ర విమర్శలు చేశారు. ఈ సందర్భంగా సోనియా గాంధీ, రాహుల్‌పై వ్యంగ్యాస్త్రాలు సంధించారు.


కుగ్రామంగా మొదలై అసెంబ్లీ నియోజకవర్గంగా.. ఇప్పుడు ఏకంగా ఏడు నియోజకవర్గాలు

Visakhapatnam Political History: ఆంధ్రప్రదేశ్‌లో విశాఖఫట్నానికి ప్రత్యేక గుర్తింపు ఉంది. రాజకీయంగా ఎంతో చైతన్యం కలిగిన ఈ ప్రాంతం చిన్న కుగ్రామంగా ప్రస్థానం ప్రారంభించగా.. ఇప్పుడు పెద్ద నగరంగా ఎదిగింది. మొదట అసెంబ్లీ నియోజకవర్గంగా ఏర్పడగా.. ఆ తర్వాత మరింతగా విస్తరించింది. ఇప్పుడు విశాఖపట్నం ఏకంగా ఏడు నియోజకవర్గాలుగా మారింది. ప్రారంభంలో 68వేలుగా ఉన్న ఓటర్ల సంఖ్య ఇప్పుడు 20 లక్షల వరకు ఉంది. విశాఖ మహానగరంగా విస్తరించిన తీరు ఇలా ఉంది.


Manifesto: 23 అంశాలతో తెలంగాణకు ప్రత్యేక మేనిఫెస్టో.. ఎన్నికల్లో కాంగ్రెస్‌ గెలుస్తుందా?

Congress Party Special Manifesto For Telangana: లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్‌ పార్టీ మరో మేనిఫెస్టోను తీసుకొచ్చింది. రాష్ట్ర స్థాయిలో తెలంగాణకు ప్రత్యేకంగా మేనిఫెస్టోను విడుదల చేయడం గమనార్హం.


ఆపరేషన్​ పాలమూరు.. రెండు పార్లమెంట్​ స్థానాలను దక్కించుకునేలా ప్రధాన పార్టీల వ్యూహాలు

ఆపరేషన్​ పాలమూరు.. రెండు పార్లమెంట్​ స్థానాలను దక్కించుకునేలా ప్రధాన పార్టీల వ్యూహాలు నేడు కొత్తకోటకు సీఎం రేవంత్​ రెడ్డి రేపు ఎర్రవల్లి చౌరస్తాకు రాహుల్​ గాంధీ 10న నారాయణపేటకు ప్రధాని మోదీ మహబూబ్​నగర్, వెలుగు: ఉమ్మడి మహబూబ్​నగర్​ జిల్లాలోని రెండు లోకసభ స్థానాలపై ప్రధాన పార్టీలు ఫుల్​ ఫోకస్​ పెట్టాయి. ఈ రెండు స్థానాలను కైవసం చేసుకోవాలని అధికార పా...


ముసలోడే కానీ మహానుభావుడు.. స్కూటీలోనే దుకాణమెట్టేశాడు.. పోలీసులే షాక్!

Old man Transports 100 liquor bottles in Scooty: ఏపీలో ఎన్నికల పోలింగ్ వేళ.. పోలీసులు తనిఖీలు ముమ్మురం చేశారు. ఎన్నికల్లో నగదు, మద్యం పంపిణీని అడ్డుకునేందుకు ఎక్కడికక్కడ సోదాలు చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఎన్టీఆర్ జిల్లా నందిగామలో ఓ వృద్ధుడి స్కూటీని చెక్ చేసిన పోలీసులు షాక్ తిన్నారు. ఒకటీ రెండు కాదు ఏకంగా వంద బాటిళ్లను స్కూటీలో దాచి తరలిస్తూ పోలీసులకు చిక్కాడు గోపయ్య అనే వృద్ధుడు. దీంతో ముసలాయన ప్లాన్ చూసి పోలీసులే విస్తుపోయారు.


Vizag | ఈ సమ్మర్ కి ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్న భీమిలి బీచ్..!!

విశాఖ అంటేనే ప్రకృతి అందాలకు నిలయం. వేసకాలం వచ్చిందంటే రాష్ట్రం నలుమూలల నుంచి పర్యాటకులు విశాఖ వస్తారు. విశాఖలో సుందర సాగర తీరాలు కనువిందు చేసే ఉద్యానవనాలు ఎన్నో ఉన్నాయి. వీటన్నిటిని సరదాగా ఎంజాయ్ చేసేందుకు పర్యాటకులు వచ్చి వెళ్తారు. విశాఖలో పర్యాటకులు చూడదగ్గ ప్రదేశాల్లో భీమిలి బీచ్ ఒకటి. భీమిలి బీచ్ విశాఖపట్నం కి 30 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది.


ఎందుకంటే : ఈ ఆస్పత్రి నర్సుకు 760 ఏళ్ల జైలు శిక్ష

ఎందుకంటే : ఈ ఆస్పత్రి నర్సుకు 760 ఏళ్ల జైలు శిక్ష ఏదైనా నేరం చేసి జైలుకు వెళితే నేరం తీవ్రతను బట్టి ఏడాది, నాలుగేళ్లు మహా అయితే 14ఏళ్ళ యావజ్జీవ శిక్ష పడుతుంది. కొన్ని సందర్భాల్లో అధిక నేరాలు ఒకేసారి రుజువైతే కోర్టులు 20ఏళ్ళు, 30ఏళ్ళు శిక్ష విధిస్తూ నిర్ణయం తీసుకున్న సందర్భాలు కూడా ఉన్నాయి. కానీ, ఏకంగా 760ఏళ్ళ జైలు శిక్ష పడటం విన్నారా ఎప్పుడైనా... అ...


Arvind Kejriwal: ఢిల్లీ లిక్కర్ కేసులో అరవింద్ కేజ్రీవాల్‌కు భారీ ఊరటనిచ్చే వార్త.. ఎన్నికల వేళ బెయిల్?

Arvind Kejriwal: ఢిల్లీ లిక్కర్ కేసులో గత కొన్ని రోజులుగా జైలులో ఉంటున్న ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌కు లోక్‌సభ ఎన్నికల ముందు సుప్రీంకోర్టు భారీ ఊరటనిచ్చే వార్తను చెప్పింది. ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో కేజ్రీవాల్ దాఖలు చేసిన మధ్యంతర బెయిల్‌ పిటిషన్‌పై వాదనలు వింటామని సుప్రీంకోర్టు పేర్కొంది. ఈ నెల 7 వ తేదీన కేజ్రీవాల్ బెయిల్ పిటిషన్‌పై విచారణ జరుపుతామని సుప్రీంకోర్టు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్-ఈడీకి తెలిపింది.


కేంద్ర హోంమంత్రి అమిత్​షాపై కేసు

కేంద్ర హోంమంత్రి అమిత్​షాపై కేసు పిల్లలతో ప్రచారం చేయించడంపై కాంగ్రెస్​ నేత నిరంజన్​ ఫిర్యాదు సెక్షన్ 188 ఐపీసీ కింద కేసు నమోదు చేసిన మొఘల్ పురా పోలీసులు హైదరాబాద్, వెలుగు: కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా పై హైదరాబాద్​లో కేసు నమోదయ్యింది. ఈ నెల ఒకటో తేదీన హైదరాబాద్​లోని పాతబస్తీ పర్యటన సందర్భంగా సుధా టాకీస్ వద్ద వేదికపై హైదరాబాద్ పార్లమెంట్ బీజేపీ అ...


Helicopter Crash: ఎన్నికల వేళ కుప్పకూలిన హెలికాప్టర్.. ప్రచారానికి వెళ్తుండగా ప్రమాదం

Helicopter Crash: ప్రస్తుతం దేశంలో లోక్‌సభ ఎన్నికలు జరుగుతున్నాయి. నేతలు సుడిగాలి పర్యటనలు చేస్తున్నారు. ఈ క్రమంలోనే హెలికాప్టర్లు, ప్రత్యేక విమానాలు ఉపయోగిస్తున్నారు. అయితే తాజాగా ఓ మహిళా నేత ప్రచారానికి వెళ్తుండగా.. ఆమెను తీసుకెళ్లేందుకు వచ్చిన ఓ హెలికాప్టర్.. ల్యాండ్ అవుతుండగా కుప్పకూలిపోయింది. ఈ ఘటనలో ఆ మహిళా నేతకు ఎలాంటి గాయాలు కాకపోవడంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు. పైలట్ దూకేసి ప్రాణాలు దక్కించుకున్నాడు. ఇంతకీ ఈ సంఘటన ఎక్కడ జరిగిందంటే?


గుడ్ న్యూస్.. ఆ దరఖాస్తు గడువు పెంపు..

ఎంబీఏ, ఎంసీఏ కోర్సులో ప్రవేశాలకు నిర్వహించే తెలంగాణ ఐసెట్ ప్రవేశ పరీక్ష దరఖాస్తుల గడువును పొడిగించారు. ఈ మేరకు ఐసెట్ కన్వీనర్, కాకతీయ యూనివర్సిటీ కామర్స్ అండ్ బిజినెస్ మేనేజ్మెంట్ కళాశాల ప్రొఫెసర్ ఎస్.నరసింహ చారి ఒక ప్రకటనలో తెలిపారు. గత నెల 30తో గడువు ముగియగా అభ్యర్థుల విన్నపం మేరకు మే 7 వరకు గడుపొడిగించినట్లు ఆయన పేర్కొన్నారు.రూ:250 అపరాధ రుసుంతో మే 17 వరకు రూ:500 అపరాధ రుసుంతో 27వరకు ఆన్లైన్ లో దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం కల్పిస్తున్నట్లు...


జర్నలిస్టులు ఆ దేశాలను విడిచి ఎందుకు వెళ్లాల్సి వస్తోంది?

బలవంతంగా స్వదేశాలను విడిచి వెళ్లి, ఇతర దేశాల్లో పనిచేస్తున్న బీబీసీ వరల్డ్ సర్వీస్ జర్నలిస్టుల సంఖ్య 2020 నుంచి దాదాపు రెండింతలు పెరిగి 310కి చేరుకుందని ఒక అంచనా.


15 ఏళ్ల పాలకులు.. పలుగు పార పట్టి పనులకు వెళుతున్నారు !

ప్రస్తుత సమాజంలో రాజకీయాల్లోకి ప్రవేశించిన ఏ చిన్న నాయకుడైనా చేసే పెద్దరికం హంగామా మామూలుగా ఉండదు.. కానీ ఈ గ్రామానికి చెందిన దంపతులిద్దరూ 3 పర్యాయాలు (15 సంవత్సరాల పాటు) సర్పంచ్ లు గా సేవలందించి నేడు ఉపాధి కూలీలుగా మారి జీవనం సాగిస్తున్నారు. ఈ సర్పంచ్ దంపతులు ఎవరు..!? అసలు వారు ఉపాధి హామీ కూలీలుగా మారడానికి గల కారణాలేంటనే అంశాలపై లోకల్18 ప్రత్యేక కథనం. దంపతులిద్దరూ పలుమార్లు గ్రామానికి సర్పంచ్ గా సేవలందించారు. రాజన్న సిరిసిల్ల జిల్లా చందుర్తి మండలం మల్యాల గ్రామానికి చెందిన దొంగరి భూమయ్య, గంగవ్వ దంపతులు గతంలో పలు పర్యాయాలు సర్పంచ్ లుగా ఎన్నికై పంచాయతీకి సేవలు అందించారు. భూమయ్య పదేళ్ళు, గంగవ్వ ఐదేళ్లు సర్పంచ్ లుగా కొనసాగారు. వీరి కాలంలో గ్రామం అభివృద్ధి వైపు ఆడుగులు వేసిందని, గ్రామంలో సిసి రోడ్లు కూడా నిర్మాణం చేపట్టారని గ్రామ ప్రజలకు చెబుతున్నారు. మొదటి నుంచి వారిది వ్యవసాయ కుటుంబమేనని, సర్పంచ్ కాక ముందు భూమయ్యకు రెండు ఎకరాల భూమి ఉండేదని, సర్పంచ్ గా మూడు పర్యాయాలైన వీరు కారణాలు ఏంటో తెలియదు కానీ, ఉన్న రెండు ఎకరాల భూమి కూడా అమ్ముకున్నట్లు తెలుస్తోంది.అనునిత్యం ప్రజాసేవలోనే నిమగ్నమైన మాజీ సర్పంచ్ దంపతులు.. నిస్వార్ధంగా ప్రజాసేవ చేశారని, వీరి జీవితం ఎందరికో స్ఫూర్తి అంటారు వీరి గ్రామస్తులు. ఈ దంపతుల హయాంలోనే గ్రామ అభివృద్ధి సాగిందని ప్రజలు చెబుతున్నారు. మాజీ సర్పంచ్ భూమయ్య ఏడవ తరగతి వరకు చదివారని, ప్రస్తుతం అనునిత్యం ఉపాధి హామీ కూలీ పనులకు మాజీ సర్పంచ్ దంపతులు వెళ్తున్న దృశ్యాలు అందరినీ ఆలోచింపజేస్తున్నాయి.ప్రస్తుత సమాజంలో ఏదైనా పార్టీలో ఉన్న కొందరు కార్యకర్త నుంచి వార్డ్ మెంబర్ దాకా.. ఏదో అక్రమాలకు పాల్పడుతూ కోట్లకు పడగలెత్తుతున్న ఈ రోజుల్లో, పలు దఫాలుగా దంపతులిద్దరూ గ్రామానికి నిస్వార్ధంగా సేవ చేసి ఉన్న కాస్త భూమిని కూడా అమ్ముకున్నారని గ్రామ ప్రజలు తెలిపారు. 10 సంవత్సరాల క్రితం మూడు పర్యాయాలు వారే గ్రామానికి సర్పంచులుగా దంపతులు ఇద్దరూ సేవలందించారు. భూమయ్య పది సంవత్సరాలు అతని భార్య ఐదు సంవత్సరాలుగా సర్పంచ్ లుగా కొనసాగారు. ఉపాధి హామీ పథకం కూలిగా పనులకు వెళ్తున్న ఈ దంపతులు..మేము సామాన్యులం, పొట్ట కూటి కోసం కష్టపడి జీవించడంలో తప్పులేదని అంటూ తెలిపారు. ఉపాధి హామీ కూలీలకు సరైన సౌకర్యాలు పనిచేసే ప్రాంతంలో ఏర్పాటు చేయాలని మాజీ సర్పంచ్ భూమయ్య కోరుతున్నారు. ఏమైనప్పటికీ ఇలాంటి నిస్వార్ధ ప్రజా సేవకుల సేవలు ఎప్పటికీ చిరస్థాయిగా నిలిచిపోతారని ప్రజలు చర్చించుకుంటున్నారు. నిజాయితీగా గ్రామానికి సేవ చేసిన వారు కాబట్టే నేడు, ఉపాధి కూలిగా మారారని ఈ దృశ్యాలు చెప్పకనే చెబుతున్నాయి.


Peddapalli | మీ పిల్లలకు కూచిపూడి నాట్యం నేర్పించాలనుకుంటే..

పెద్దపల్లి జిల్లా గోదావరిఖని మార్కండేయ కాలనిలో వైష్ణవి నాట్య స్థల్ అనే ఇన్స్టిట్యూట్ లో జ్యోతిర్మయి గత 8 ఏళ్లుగా కూచిపూపూడి నాట్య శిక్షణ ఇస్తుంది. ఇక్కడ నేర్చుకునే పిల్లలు ఇప్పటి వరకు గిన్నిస్ రికార్డు,వరల్డ్ రికార్డు వంటివి అందుకున్న వారు కూడా ఉన్నారు. వీరి వద్ద కొత్తగా నేర్చుకునే పిల్లలకి ప్రత్యేక శ్రద్ధతో శిక్షణ ఇస్తున్నారు. వేసవి శిక్షణా అనే కాకుండా రెగ్యులర్ గా ఇక్కడే శిక్షణ చేస్తున్నారు.వీరికి రెండు బ్రాంచీలు కూడా ఉన్నాయి. మార్కెండయ కాలనీతో పాటు ఎన్టీపీసీ కృష్ణానగర్ మాతృ మందిర్ స్కూల్ లో వారానికి మూడు రోజులు శిక్షణ ఇస్తారు. ఇక ఫీ డిటైల్స్ నెలకి 1000 రూపాయలు మాత్రమే ఛార్జ్ చేస్తున్నారు.


వ్యవసాయంలో గుత్తాధిపత్య ధోరణులు

వ్యవసాయంలో గుత్తాధిపత్య ధోరణులు యునైటెడ్ స్టేట్స్​లోని కొలరాడో విశ్వవిద్యాలయానికి చెందిన ఓ పరిశోధకుడు 1969 నుంచి 2013 వరకు ప్రపంచవ్యాప్తంగా 180 దేశాల్లోని వ్యవసాయ కమతాల సంఖ్య, వాటి విస్తీర్ణం విశ్లేషించారు. ఈ సమాచారం ఆధారంగా 2100 నాటికి పరిస్థితి ఎట్లా ఉంటుందో  అంచనా వేశారు.  దాని ప్రకారం 2100 నాటికి  ప్రపంచంలోని కమతాల సంఖ్య సగానికి తగ్గుతుంది.  అమ...


తలాపున గోదారి ఉన్నా ధర్మపురికి సాగునీరు ఇయ్యలే : అడ్లూరి లక్ష్మణ్​

తలాపున గోదారి ఉన్నా ధర్మపురికి సాగునీరు ఇయ్యలే : అడ్లూరి లక్ష్మణ్​ జగిత్యాల, వెలుగు: బీఆర్ఎస్‌‌ హయాంలో తలాపున గోదారి పారుతున్న ధర్మపురి ప్రాంత రైతులకు సాగునీరు ఇవ్వలేదని విప్‌‌, ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్‌‌కుమార్‌‌‌‌ విమర్శించారు. జగిత్యాల జిల్లా వెల్గటూర్ మండలం రాజారాంపల్లి గ్రామంలో శుక్రవారం నిర్వహించిన జనజాతర సభకు సీఎం రేవంత్‌‌రెడ్డి, మంత్రి శ్ర...


చేవెళ్లలో ఎగిరేది కాంగ్రెస్ జెండానే : రంజిత్​రెడ్డి

చేవెళ్లలో ఎగిరేది కాంగ్రెస్ జెండానే : రంజిత్​రెడ్డి లోక్​సభ ఎన్నికలను కార్యకర్తలు చాలెంజ్​గా తీసుకోవాలి చేవెళ్ల కాంగ్రెస్​ ఎంపీ అభ్యర్థి రంజిత్ రెడ్డి శంషాబాద్/గండిపేట, వెలుగు: రాజేంద్రనగర్ నియోజకవర్గంలోని ప్రతి బూత్ కోఆర్డినేటర్ లోక్​సభ ఎన్నికలను చాలెంజ్ గా తీసుకోవాలని చేవెళ్ల కాంగ్రెస్ఎంపీ అభ్యర్థి రంజిత్​రెడ్డి సూచించారు. చేవెళ్లలో కాంగ్రెస్ ​జ...


సాధారణ కుటుంబాలు సాధించినవి అమోఘాలు

సాధారణ కుటుంబాలు సాధించినవి అమోఘాలు గుమాస్తా,  దినసరి కూలీ, బీడీలు చుట్టడం, అనాథ,  చిరువ్యాపారం, పేదరికం ఇవేవి కాలేదు ప్రతిభకు ఆటంకం. తాము పేద కుటుంబంలోంచి వచ్చినా...తమ మనో ధైర్యం గొప్పదని వారు రుజువు చేశారు.  తమను విజయం వరించిందని తెలిసినా కానరాని గర్వమే వారిని విజయాలకు బాటలు వేసింది.  సాదాసీదా జీవన ‘ప్రయాణం’ ఒడుదొడుకులు ఎన్నైనా లక్ష్యం వైపే చూపు....


కొల్లాపూర్ మామిడికి ఎంత కష్టం .. తోటలను నరికేస్తున్న రైతులు

కొల్లాపూర్ మామిడికి ఎంత కష్టం .. తోటలను నరికేస్తున్న రైతులు మార్కెట్​లో నిలువు దోపిడీ తరుగు పేరిట 10 కిలోల వరకు కోత కనుమరుగవుతున్న కొల్లాపూర్​మామిడి నాగర్​కర్నూల్, వెలుగు: ఫలాల్లో రారాజుగా ప్రఖ్యాతి గాంచిన కొల్లాపూర్​మామిడి మెల్లగా కనుమరుగవుతోంది. ఏటా తగ్గిపోతున్న సాగు విస్తీర్ణం, తెగుళ్లు ఇతర కారణాలతో దిగుబడి రావడం లేదు. దళారుల దోపిడీ, గిట్టుబాట...


ఆస్పత్రిని సీజ్ చేసిన అధికారులు

ఆస్పత్రిని సీజ్ చేసిన అధికారులు కోదాడ, వెలుగు :  వైద్యారోగ్యశాఖ అనుమతులు లేకుండా కోదాడ పట్టణంలో నిర్వహిస్తున్న శ్రీహృదయ ఆస్పత్రిని అధికారులు సీజ్ చేశారు. కొంతకాలంగా కోదాడలో ఆస్పత్రుల నిర్వహణపై ప్రజల నుంచి ఫిర్యాదులు రావడం తో అధికారులు తనిఖీలు చేపట్టారు. గురువారం పట్టణంలోని పలు ప్రైవేట్ ఆస్పత్రుల్లో జిల్లా వైద్యారోగ్యశాఖ అధికారి డాక్టర్ కోటచలం ఆధ్వర...


రూ. 98 లక్షలు పట్టుకున్న సైబరాబాద్ SOT పోలీసులు

రూ. 98 లక్షలు పట్టుకున్న సైబరాబాద్ SOT పోలీసులు హైదరాబాద్: బ్యాంకులకు నగదు తీసుకువెళ్లే రెండు వాహనాలలో ఎటువంటి ఆధారాలు లేకుండా తరలిస్తున్న నగదు సీజ్ చేశారు సైబరాబాద్ ఎస్వోటీ పోలీసులు. సైబరాబాద్ ఎస్వోటీ మేడ్చల్ టీం, శామీర్ పేట్ , దుండిగల్ పోలీస్ స్టేషన్ల సిబ్బందితో కలిసి తనిఖీలు నిర్వహించగా..క్యూఆర్ కోడ్లు, ఎన్నికల సంఘం నిబంధనలు పాటించకుండా రెండు...


కాలిఫోర్నియా వర్సిటీలో..పాలస్తీనా అనుకూల నినాదాలు

కాలిఫోర్నియా వర్సిటీలో..పాలస్తీనా అనుకూల నినాదాలు కాలిఫోర్నియా : లాస్ ఏంజెలెస్ లోని కాలిఫోర్నియా యూనివర్సిటీలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. కొంత మంది స్టూడెంట్లు పాలస్తీనా అనుకూల నినాదాలు చేశారు. ఆ దేశానికి అనుకూలంగా నినాదాలు చేస్తూ వారు ఏర్పాటు చేసుకున్న క్యాంపుపై ఇజ్రాయెల్  సపోర్టర్లు దాడి చేశారు. దీంతో ఇరు వర్గాల మధ్య ఉద్రిక్తత నెలకొంది. బుధవారం ...


25 virgin girls: కిమ్ ను సుఖపెట్టేందుకు ఏడాదికి 25 మంది అమ్మాయిలు... వెలుగులోకి షాకింగ్ విషయాలు...

North korea: ఉత్తరకొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ ఎంతటి క్రూరుడో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆయన గురించి తరచుగా షాకింగ్ విషయాలు వార్తలలో ఉంటునే ఉంటాయి. ఆ దేశంలో విధించే శిక్షలు, తిరుగుబాటు చేసిన వారిని అణచి వేసే విధానం అత్యంత క్రూరంగా ఉంటుదని చెబుతుంటారు.


ముక్క లేదు.. సుక్క లేదు .. ఎంపీ ఎన్నికల్లో కనిపించని దావత్​లు

ముక్క లేదు.. సుక్క లేదు .. ఎంపీ ఎన్నికల్లో కనిపించని దావత్​లు కులాలు, వర్గాలవారీగా ఆత్మీయ సమ్మేళనాల్లేవ్  ఇంటింటి ప్రచారమూ లేదు సోషల్ మీడియాపైనే అభ్యర్థులు, పార్టీల ఫోకస్​ సోషల్ జస్టిస్, దేశభద్రత లాంటి విధానపరమైన అంశాలపైనే చర్చ కార్నర్​ మీటింగులు, బహిరంగ సభలతో సరి  లోక్​సభ ఎన్నికల్లో సగానికి సగం తగ్గనున్న ఖర్చు  సమాజానికి మంచిదంటున్న ప్రజాస్వ...


అదిరే జీతం.. రాత పరీక్ష లేకుండా డైరెక్ట్ జాబ్, అర్హతలు ఇవే!

ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్నారా.. డిగ్రీ పట్టా చేతిలో ఉన్నా లాభం లేదని చింతిస్తున్నారా, అయితే మీ అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి మరో సారి ఉద్యోగం నోటిఫికేషన్ వేతుకుంటూ వచ్చింది. దానికోసం కష్టపడాల్సిన అవసరం లేదు కేవలం టీచింగ్ చేయాలనే ఆలోచన తో పాటు ఈ కొన్ని డాక్యుమెంట్స్ మీ వద్ద ఉంటే చాలు. నెలకి మంచి వేతనంతో కూడిన ఉద్యోగం మీ సొంతం అవుతుంది. ఉద్యోగం ఏంటి.. ఎక్కడ చేయాలి.. జాబ్ ప్రొఫైల్ ఏంటి.. అనే విషయాలు ఇక్కడ చూద్దాం.పెద్దపల్లి జిల్లా రామగుండం...


హెచ్‌డి దేవేగౌడ: అన్నం లేక పస్తులున్న రోజుల నుంచి ప్రధానమంత్రి పదవి దాకా..

ఆహారంలో రాగులు ప్రధానమైన ప్రాంతంలో ఒక రైతు రాజకీయ నాయకుడిగా ఎదిగారు. కర్నాటక ముఖ్యమంత్రిగా ఆ తర్వాత భారత దేశ ప్రధానమంత్రి అయ్యారు. ఆయన హర్థనహళ్లి దొడ్డగౌడ దేవేగౌడ.


బీఆర్ఎస్ ఎమ్మెల్సీ విఠల్ ఎన్నిక చెల్లదు : హైకోర్టు

బీఆర్ఎస్ ఎమ్మెల్సీ విఠల్ ఎన్నిక చెల్లదు : హైకోర్టు తన సంతకం ఫోర్జరీ చేశారని రాజేశ్వర్ రెడ్డి పిటిషన్​ విచారించిన హైకోర్టు.. విఠల్​ సభ్యత్వం రద్దు చేస్తూ ఉత్తర్వులు అప్పీల్​కు నాలుగు వారాల గడువు హైదరాబాద్/ ఆదిలాబాద్/కాగజ్​నగర్, వెలుగు: ఆదిలాబాద్ స్థానిక సంస్థల కోటా బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దండె విఠల్ ఎన్నిక చెల్లదని హైకోర్టు తీర్పు ఇచ్చింది. రూ.50 వేల జ...


బిట్​ బ్యాంక్​: కర్ణాటిక్​ యుద్ధాలు

బిట్​ బ్యాంక్​: కర్ణాటిక్​ యుద్ధాలు మధ్యయుగాలు, ఆధునిక భారతదేశ చరిత్రలో భారతదేశంలో అత్యంత శక్తిమంతమైన విశాలమైన రాజ్యం హైదరాబాద్​.      నిజాం ఉల్​ ముల్క్​ కాలంలో కర్ణాటక ప్రాంత రాజధాని ఆర్కాట్​.      1742లో నిజాం ఉల్​ ముల్క్​ ఆర్కాట్​ నవాబుగా సయీద్​ మహమ్మద్​ ఖాన్​ను నియమించారు.      1747లో ఆర్కాట్​తోపాటు కొండనూరు, కడప నవాబుగా నిజాం ఉల్​ ముల్క్​ త...


ఫోర్జరీ సంతకాలతో పొదుపు సంఘం లోన్‌‌‌‌

ఫోర్జరీ సంతకాలతో పొదుపు సంఘం లోన్‌‌‌‌ ఎలాంటి ఎంక్వైరీ లేకుండానే మంజూరు చేసిన బ్యాంక్‌‌‌‌ సిబ్బంది గరిడేపల్లి, వెలుగు : పొదుపు సంఘం సభ్యుల సంతకాలను ఫోర్జరీ చేసి రూ. 10 లక్షలు స్వాహా చేసిన ఘటన సూర్యాపేట జిల్లా గడ్డిపల్లిలో శుక్రవారం వెలుగు చూసిం ది. సూర్యాపేట జిల్లా నేరేడుచర్ల మండలం ఫత్తేపురం గ్రామానికి చెందిన సాయి సుధ సమభావన సంఘం సభ్యులు శుక్రవారం ల...


సూరి హత్య కేసులో భానుకు జీవితఖైదు కరెక్టే: హైకోర్టు

సూరి హత్య కేసులో భానుకు జీవితఖైదు కరెక్టే: హైకోర్టు కింది కోర్టు తీర్పులో జోక్యానికి హైకోర్టు నిరాకరణ హైదరాబాద్, వెలుగు: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో తీవ్ర సంచలనం రేపిన మద్దెలచెరువు సూరి హత్య కేసులో నిందితుడు మలిశెట్టి భానుకిరణ్‌‌కు నాంపల్లి కోర్టు విధించిన యావజ్జీవ శిక్ష తీర్పును హైకోర్టు సమర్థించింది. నాంపల్లి కోర్టు తీర్పును సవాల్‌‌  చేస్తూ భాను వేసిన...


Samshabad Leopard: శంషాబాద్ ఎయిర్‌ పోర్ట్‌‌ బోనులో చిక్కిన చిరుత, వారం రోజులుగా ముప్పతిప్పలు పెట్టిన చిరుత

Samshabad Leopard: శంషాబాద్ ఎయిర్‌ పోర్ట్‌లో గత వారం రోజులుగా సిబ్బందిని ముప్పతిప్పలు పెట్టిన చిరుత ఎట్టకేలకు బోనులో చిక్కింది.


రోహిత్ వేముల ఎస్సీ కాదు..కేసు మూసేస్తున్నాం: హైకోర్టుకు పోలీసుల రిపోర్ట్

రోహిత్ వేముల ఎస్సీ కాదు..కేసు మూసేస్తున్నాం: హైకోర్టుకు పోలీసుల రిపోర్ట్ దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన రోహిత్ వేముల ఆత్మహత్యకు ఎవరూ కారణం కాదని పోలీసులు హైకోర్టుకు నివేదిక సమర్పించారు. ఈ కేసుపై   మే3న  తెలంగాణ హైకోర్టులో విచారణ జరిగింది.  ఈ సందర్భంగా రోహిత్ ఆత్మహత్యకు కారణాలు, ఎవిడెన్స్ లేవని..కేసును మూసివేస్తున్నామని కోర్టుకు రిపోర్టు ఇచ్చారు ప...


వెస్ట్ బ్యాంక్‌లో ఎనిమిదేళ్ల బాలుడు హత్య, ఇజ్రాయెల్‌పై యుద్ధ నేరాల ఆరోపణలు.. అసలేం జరిగింది?

తుల్‌కర్మ్ శరణార్థి శిబిరంలో చేపట్టిన ఆపరేషన్‌లోనే ఇజ్రాయెల్ సైనికులు పేలుడు పదార్ధాలు కలిగి ఉన్నాడనే అనుమానంతో ఓ పాలస్తీనా యోధుడిని కాల్చి చంపిన తర్వాత, మృతదేహం మీద మూత్రం పోశారని, ఆ మృతదేహాన్ని కొట్టి, కట్టివేసి వీధిలో పడిసినట్లు ప్రత్యక్ష సాక్షులు బీబీసీతో చెప్పారు.


ప్రధాని మోదీతోనే దేశాభివృద్ధి: కేంద్ర మంత్రి మురుగన్ నారాయణ

ప్రధాని మోదీతోనే దేశాభివృద్ధి: కేంద్ర మంత్రి మురుగన్ నారాయణ వంగూరు, వెలుగు : ప్రధాని మోదీతోనే దేశం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతుందని కేంద్ర సమాచార, పశువర్ధక శాఖ మంత్రి మురుగన్‌‌‌‌ నారాయణ చెప్పారు. వంగూరు గేట్‌‌‌‌ వద్ద గల వైవీ ఫంక్షన్‌‌‌‌హాల్‌‌‌‌లో గురువారం నిర్వహించిన మీటింగ్‌‌‌‌లో ఆయన మాట్లాడారు. ఆర్టికల్‌‌‌‌ 370 రద్దు, అయోధ్యలో రామాలయం నిర్మిం...


యూఏఈలో మళ్లీ భారీ వర్షాలు..దుబాయ్, అబుధాబి అతలాకుతలం

యూఏఈలో మళ్లీ భారీ వర్షాలు..దుబాయ్, అబుధాబి అతలాకుతలం పలు విమాన సర్వీసులు రద్దు దుబాయ్: యునైటెడ్  అరబ్  ఎమిరేట్స్ (యూఏఈ) లో మళ్లీ భారీ వర్షాలు బీభత్సం సృష్టించాయి. గురువారం తెల్లవారుజామున వచ్చిన భారీ వానలతో దుబాయ్, అబుధాబి అతలాకుతలమయ్యాయి. వీధులన్నీ నీళ్లతో నిండిపోయాయి. దుబాయ్​లో పలు విమాన సర్వీసులతో పాటు బస్సు సర్వీసులు కూడా రద్దయ్యాయి. దుబాయ్​కి వ...


కాంగ్రెస్‌‌‌‌లోకి ఖమ్మం మేయర్‌‌‌‌

కాంగ్రెస్‌‌‌‌లోకి ఖమ్మం మేయర్‌‌‌‌ ఖమ్మం, వెలుగు: ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్‌‌‌‌ మేయర్‌‌‌‌ పునుకొల్లు నీరజ కాంగ్రెస్‌‌‌‌లో చేరారు. శుక్రవారం ఉదయం బీఆర్‌‌‌‌ఎస్‌‌‌‌ జిల్లా ఆఫీస్‌‌‌‌లో జరిగిన మీటింగ్‌‌‌‌కు మేయర్‌‌‌‌ నీరజ హాజరయ్యారు. ఆ తర్వాత కొన్ని గంటల్లోనే ఆమె కాంగ్రెస్‌‌‌‌ పార్టీ జిల్లా ఆఫీస్‌‌‌‌లో ప్రత్యక్షం అయ్యారు. మరో ఇద్దరు మహిళా కార్పొరేటర్లత...


నోటాకు ఓటెయ్యండి ఇండోర్ లో ఓటర్లకు కాంగ్రెస్ పిలుపు

నోటాకు ఓటెయ్యండి ఇండోర్ లో ఓటర్లకు కాంగ్రెస్ పిలుపు ఇండోర్: మధ్యప్రదేశ్ ఇండోర్ లోక్ సభ సెగ్మెంట్ లో నోటాకు ఓటెయ్యాలని గురువారం కాంగ్రెస్ పార్టీ పిలుపునిచ్చింది. ఇండోర్ లో కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థిగా బరిలోకి దిగిన అక్షయ్ కాంతి బామ్‌‌ చివరి రోజు నామినేషన్​ను ఉపసంహరించుకుని బీజేపీలో చేరారు.ఈ నేపథ్యంలో నోటాకు ఓటెయ్యాలని కాంగ్రెస్ ఓటర్లకు విజ్ఞప్తి చేసింద...


Hyper Aadi: ఏపీ ప్రభుత్వంపై హైపర్ ఆది నాన్ స్టాప్ పంచులు

ఏపీ ప్రభుత్వంపై హైపర్ ఆది నాన్ స్టాప్ పంచులు.


Tragedy Incident: వేరే పెళ్లి చేసుకున్న ప్రేయసి కుటుంబంపై పగ.. బాంబ్‌ పెట్టి చంపిన మాజీ ప్రియుడు

Speaker Explodes Two Dies In Gujarat: పెళ్లయి వేరే ఇంటికి వెళ్లిన తన ప్రేయసిపై లవర్‌ కక్ష తీర్చుకున్నాడు. తనను కాదని వేరే అతడిని పెళ్లి చేసుకోగా.. అతడిని బాంబు పెట్టి హతమార్చాడు.


ఖమ్మం కార్పొరేషన్​ కాంగ్రెస్​ కైవసం!

ఖమ్మం కార్పొరేషన్​ కాంగ్రెస్​ కైవసం! కారు’ దిగి కాంగ్రెస్​ లో చేరిన మేయర్ పునుకొల్లు నీరజ మరో ఇద్దరు కార్పొరేటర్లూ మంత్రి తుమ్మల సమక్షంలో చేరిక ఒకట్రెండు రోజుల్లో మరో ఆరుగురు చేరేందుకు సిద్ధం! ఖమ్మం, వెలుగు:  ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్​ కాంగ్రెస్ వశమైంది. బీఆర్ఎస్​ కు చెందిన మేయర్​ పునుకొల్లు నీరజ శుక్రవారం రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగే...


14ఏళ్లుగా చల్లని సేవ.. వీరి సేవకు చేతులు జోడించాల్సిందే !

అసలే ఎండాకాలం. ఎవరికైనా అధిక దాహం సర్వసాధారణమే. అలా ఎండలో కొద్ది క్షణాలు వెళ్ళామంటే చాలు, ఖ చ్చితంగా మన దప్పిక మనం తీర్చుకోవాల్సిందే. అలా దప్పిక తీర్చుకొని పక్షంలో మనం పడే ఇబ్బంది అంతా ఇంతా కాదు. ఆ సమయంలో దాహం తీర్చుకోక పోతే ప్రమాదం కొని తెచ్చుకున్నట్లే. అందుకే ఎండాకాలంలో ప్రజల దాహార్తిని తీర్చేందుకు ఎందరో మానవతావాదులు, స్వచ్ఛంద సంస్థలు చలివేంద్రాలను ఏర్పాటు చేస్తారు.ఇలా ఎన్నో ఏళ్లుగా ఎన్నో స్వచ్చంధ సంస్థల సభ్యులు ఎండాకాలం రాగానే చలివేంద్రాలను...


ఏపీవాసులకు గుడ్ న్యూస్.. డీబీటీ చెల్లింపుల కోసం ఈసీకి ప్రభుత్వం లేఖ.. వారి ఖాతాల్లో డబ్బులు పడే ఛాన్స్!

AP Government Letter EC about DBT for Welfare schemes: పలు ప్రభుత్వ పథకాలకు సంబంధించి నిధులను విడుదల చేసేందుకు ఏపీ ప్రభుత్వం.. ఈసీ అనుమతి కోరింది. డీబీటీ విధానం ద్వారా చెల్లింపులు చేసేందుకు అనుమతి ఇవ్వాలంటూ ఈ మేరకు ఏపీ ప్రభుత్వం ఎన్నికల సంఘానికి లేఖ రాసింది. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు ఐదేళ్ల నుంచి అమల్లో ఉన్నవేనని తెలిపింది. కొత్త పథకాలు కాదు కావున డీబీటీ ద్వారా చెల్లింపులకు పర్మిషన్ ఇవ్వాలని లేఖలో కోరింది.


సైకీ ఆస్టరాయిడ్: కోటానుకోట్ల విలువైన ఖనిజ రాశులున్న ఈ గ్రహ శకలం.. మానవాళికి బంగారు బాతు కానుందా..?

Psyche Mission: విశ్వానికి సంబంధించిన రహస్యాలను తెలుసుకోవడం అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ-నాసా 2023లో ఓ కీలక ప్రయోగాన్ని చేపట్టింది. కుజుడు, బృహస్పతి గ్రహాల మధ్య ఉన్న సైకీ గ్రహశకలంపై పరిశోధనల కోసం 2023 అక్టోబర్‌లో సైకీ స్పేస్‌క్రాఫ్ట్‌ను ప్రయోగించింది. సుదూర ప్రయాణాన్ని ప్రారంభించిన ఈ స్పేస్‌క్రాఫ్ట్ 2029 నాటికి గమ్యాన్ని చేరనుంది. ఇక ఆ సైకీ గ్రహశకలంపై ఉన్న సంపద విలువ 80 లక్షల కోట్ల కోట్లు రూపాయలకు సమానమని నాసా శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు.


చంద్రబాబు ఎన్నికల హామీలు నీటి మూటలేనా.. సాధ్యసాధ్యాలపై ఆర్ధిక నిపుణుల అంచనాలు ఇవే

ఐదేళ్లకు ఒకసారి జరిగే సార్వత్రిక ఎన్నికల్లో ప్రజలకు రాజకీయ పార్టీలు వాగ్ధానాలు చేస్తాయి. ప్రజా సమస్యలు తీరుస్తామని హామీలు ఇస్తాయి. సంక్షేమ పాలనతో పాటు పలు ప్రజ ఉపయోగకరమైన పథకాలను ప్రవేశపెట్టి తద్వారా మేలు చేస్తామని మాటిస్తాయి. ఈ తరహా వాగ్ధానాలకు ఎన్నికల హమీలు అంటారు. ఏవైతే ప్రజలకు అందజేస్తామని మాటిస్తాయో వాటిని తమ ఎన్నికల మానిఫెస్టోగా ఎలక్షన్స్ సమయంలో ప్రకటిస్తాయి. అయితే మరికొద్ది రోజుల్లో ఆంధ్రప్రదేశ్(Andhra Pradesh) లో అసెంబ్లీ, లోక్ సభ...


Srikakulam | భారతదేశంలోనే 175 అడుగుల ఎత్తైన అభయాంజనేయ స్వామి విగ్రహం

శ్రీ ఆంజనేయం ప్రసన్నాంజనేయం అనే పదాలు ప్రతి ఆంజనేయస్వామి భక్తునికి ఏంతో ధర్యాన్ని నింపుతాయి. అటువంటి ఆంజనేయ విగ్రహాలు ప్రతీ ఊరులో ఉంటాయి. కానీ శ్రీకాకుళం పట్టణంకు 18 కిలోమీటర్స్ దూరంలో మండపం టోల్ దగ్గర 175 అడుగులు ఎత్తైన ఆంజనేయ స్వామి విగ్రహం మరియు దేవాలయం ఉంది. ఈ అభ్యంజనేయస్వామి విగ్రహం వంశధార నది ఒడ్డున 2005 సంవత్సరంలో భూమి పూజ చేసి ప్రాంభించారు.


హైదరాబాద్ ప్రచారంలో అరుదైన దృశ్యం.. అసదుద్దీన్‌ ఒవైసీకి పురోహితుల మద్దతు..!

Lok Sabha Election 2024: లోక్ సభ ఎన్నికల వేళ ఆసక్తికర సన్నివేశాలు చోటుచేసుకుంటున్నాయి. వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ.. కీలక నేతలపై కేసులు, ప్రచార నిషేధాలు చోటుచేసుకుంటున్న సందర్భంలో.. మరో ఆసక్తికర దృశ్యం కనిపించింది. అది కూడా హైదరాబాద్‌‌లో ఎంఐఎం అభ్యర్థి అసదుద్ధీన్ ఒవైసీ ప్రచారంలో. మతతత్వ పార్టీ అని, నిజాం వారసులంటూ బీజేపీ పెద్ద ఎత్తున విమర్శలు చేస్తున్న నేపథ్యంలో.. అసదుద్దీన్‌కు పురోహితులు మద్దతు తెలిపారు. ఇది ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశంగా...